Trivikram Venkatesh : 20 ఏళ్ల తర్వాత జత కట్టబోతున్న త్రివిక్రమ్ – వెంకటేష్.. బన్నీ ప్రాజెక్ట్ సంగతేంటి ?
ప్రధానాంశాలు:
Trivikram Venkatesh : 20 ఏళ్ల తర్వాత జత కట్టబోతున్న త్రివిక్రమ్ - వెంకటేష్.. బన్నీ ప్రాజెక్ట్ సంగతేంటి ?
Trivikram Venkatesh : త్రివిక్రమ్- వెంకటేష్ కాంబోలో రూపొందుతున్న సినిమాకి సంబంధించి తాజాగా ఓ వార్త నెట్టింట హల్ చల్ చేస్తుంది. త్రివిక్రమ్ దర్శకుడిగా మారిన తర్వాత వెంకీతో ఒక్క సినిమా కూడా చేయలేదు. కానీ ఈరోజు త్రివిక్రమ్ ఈ స్థాయిలో ఉన్నాడు అంటే మాత్రం దానికి కారణం కచ్చితంగా వెంకటేష్ అని చెప్పాలి. ఎందుకంటే ఆయన రైటర్ గా ఉన్నప్పుడు వెంకీ నటించిన సినిమాలు సూపర్ డూపర్ హిట్ అయ్యాయి.

Trivikram Venkatesh : 20 ఏళ్ల తర్వాత జత కట్టబోతున్న త్రివిక్రమ్ – వెంకటేష్.. బన్నీ ప్రాజెక్ట్ సంగతేంటి ?
Trivikram Venkatesh : క్రేజీ కాంబో..
సంక్రాంతికి వస్తున్నాం విజయంతో వెంకటేష్ కెరీర్ మళ్లీ టాప్ స్పీడ్ కు వెళ్లిపోయింది. సంక్రాంతికి వస్తున్నాం వచ్చి మూడు నెలలు అవుతున్న కూడా ఇప్పటివరకు నెక్స్ట్ సినిమా ఇదే అని అఫీషియల్ గా అనౌన్స్ చేయలేదు వెంకటేష్. చాలా సంవత్సరాల తర్వాత బ్లాక్ బస్టర్ అందుకోవడం.. పైగా ఏకంగా 300 కోట్లు వసూలు చేయడంతో ఆ మార్కెట్ పడిపోకుండా సరైన ప్లానింగ్ చేసుకుంటున్నాడు వెంకీ.
వెంకీ నెక్స్ట్ దర్శకుల లిస్టులో త్రివిక్రమ్ శ్రీనివాస్ కూడా ఉండటం విశేషం. దర్శకుడిగా మారిన తర్వాత వెంకటేష్ తో సినిమా చేయని త్రివిక్రమ్.. ఇప్పుడు ఆ లోటును భర్తీ చేయాలని చూస్తున్నాడు. త్వరలోనే ఈ కాంబినేషన్ లో సినిమా రాబోతుంది. నువ్వు నాకు నచ్చావు, మళ్లీశ్వరి ఇలాంటి సినిమాలు ఇదే కాంబినేషన్ లో వచ్చాయి. అందులో త్రివిక్రమ్ రాసిన డైలాగులు ఇప్పటికీ ఫేమస్. చూస్తుంటే అల్లు అర్జున్ తో గురూజీ చేయాల్సిన సినిమా ఇంకా ఆలస్యం అయ్యేలా కనిపిస్తోంది.