Trivikram Srinivas : గురూజీ అంటే రచయితదర్శకుడు త్రివిక్రమ్ శ్రీనివాస్. బుట్టకొమ్మ అంటే మోస్ట్ వాంటెడ్ హీరోయిన్ పూజా హెగ్డే. ఇప్పటికే ఆయన దర్శకత్వంలో అమ్మడు రెండు సినిమాలు హీరోయిన్‌గా చేసి హిట్ అందుకుంది. ఈ క్రమంలోనే హ్యాట్రిక్ సినిమా ఆఫర్ ఇచ్చారు. కానీ, తాజా సమాచారం మేరకు ఇప్పుడు గురూజీ బుట్టకొమ్మకి హ్యాండ్ ఇచ్చాడని టాక్ మొదలైంది. అల్లు అర్జున్‌కు ఇండస్ట్రీ హిట్ గా నిలిచిన ‘అల వైకుంఠపురంలో’ వంటి బ్లాక్ బస్టర్ హిట్ తర్వాత మళ్ళీ మన మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ నుంచి ఇంకో సినిమా రాలేదు. దీనికి కారణం పవన్ కళ్యాణ్ నటించిన భీమ్లా నాయక్ సినిమాకు లాక్ అవడమే.
దానికి ముందు కొన్ని నెలలు ఎన్.టి.ఆర్ 30 కోసం ప్రీ ప్రొడక్షన్స్ వర్క్ చేయడం, అనూహ్యంగా ఆ ప్రాజెక్ట్ ఆగిపోవడం వల్ల గురూజీని నుంచి సినిమా రాలేదు. అయితే, రీసెంట్‌గా తన నెక్స్ట్ సినిమాను టాలీవుడ్ సూపర్ స్టార్ మహేశ్ బాబుతో ప్రకటించారు. దాదాపు 12 ఏళ్ల తర్వాత మహేశ్ – త్రివిక్రమ్ కలిసి ప్రాజెక్ట్ చేస్తున్నారు. గతంలో మహేశ్ – త్రివిక్రమ్ కలిసి అతడు, ఖలేజా చిత్రాలు వచ్చాయి. ఈ రెండు సినిమాలు బాక్సాఫీస్ వద్ద తిరగబడ్డాయి.కానీ, బుల్లితెర మీద మాత్రం ఈ రెండు సినిమాలకు మంచి క్రేజ్ ఉంటుంది. ఎప్పుడు టెలికాస్ట్ అయినా మంచి రేటింగ్ నమోదవుతుంది.
Trivikram Srinivas hand to basket twig
అయితే, ఇప్పుడు త్రివిక్రమ్ మహేశ్ తో చేయబోతున్న సినిమాలో హీరోయిన్‌గా ముందు నుంచి పూజా హెగ్డే అనుకున్నారు. కానీ, తాజా సమాచారం మేరకు ఇందులో ప్రియాంక అరుళ్ మోహన్‌ను తీసుకోవాలని మేకర్స్ ఆలోచిస్తున్నారట. ఈ బ్యూటీ ప్రస్తుతం తమిళంలో వరుసగా సినిమాలు చేస్తూ బిజీగా ఉంది. తెలుగులో నాని, శర్వానంద్ సినిమాలలో హీరోయిన్‌గా నటించి గుర్తింపు తెచ్చుకుంది. ఇప్పుడు మన గురూజీ కన్ను ఈ క్లాస్ బ్యూటీపై పడిందట. ఆమైతే మహేశ్ సరసన ఫ్రెష్‌గా ఉంటుందని భావిస్తున్నారట. ఇదే నిజమైతే పూజాకు హ్యాండ్ ఇచ్చినట్టే.
Pragya Jaiswal : అందాల ముద్దుగుమ్మ.. ప్రగ్యా జైస్వాల్ గురించి ప్రత్యేక పరిచయాలు అక్కర్లేదు. కంచె సినిమాతో తెలుగు ఆడియన్స్…
Banakacherla Project : బనకచర్ల క్రాస్ రెగ్యులేటర్ వివాదంపై పరిష్కారానికై కేంద్ర ప్రభుత్వం ఒక నిపుణుల కమిటీని ఏర్పాటు చేయాలని…
YCP : ఆంధ్రప్రదేశ్‌లో తమ బలాన్ని తిరిగి సాధించుకోవడానికి కాంగ్రెస్ పార్టీ తీవ్రంగా ప్రయత్నిస్తున్నట్లుగా తెలుస్తోంది. ఇటీవల పాతిక మందితో…
Samantha - Naga Chaitanya : టాలీవుడ్ స్టార్ జంటగా పేరు తెచ్చుకున్న నాగ చైతన్య – సమంత ప్రేమించి…
Little Hearts Movie : "90s మిడిల్ క్లాస్ బయోపిక్" ఫేమ్ మౌళి తనుజ్, "అంబాజీపేట మ్యారేజి బ్యాండు" మూవీతో…
Rajagopal Reddy : తెలంగాణ కాంగ్రెస్ పార్టీలో అంతర్గత విభేదాలు మరోసారి తెరపైకి వచ్చాయి. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిపై బహిరంగంగా…
Allu Arha : ఐకాన్ స్టార్ Allu Arjun అల్లు అర్జున్ ముద్దుల కూతురు అల్లు అర్హ తెగ సందడి…
Modi : అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ donald trump విధించిన టారిఫ్‌లపై భారత ప్రధాని నరేంద్ర మోదీ ఘాటుగా…
This website uses cookies.