Trivikram Srinivas : త్రివిక్రమ్ శ్రీనివాస్ బుట్ట కొమ్మకి హ్యాండ్ ఇచ్చాడా..? | The Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు

Trivikram Srinivas : త్రివిక్రమ్ శ్రీనివాస్ బుట్ట కొమ్మకి హ్యాండ్ ఇచ్చాడా..?

 Authored By govind | The Telugu News | Updated on :5 June 2022,7:00 pm

Trivikram Srinivas : గురూజీ అంటే రచయితదర్శకుడు త్రివిక్రమ్ శ్రీనివాస్. బుట్టకొమ్మ అంటే మోస్ట్ వాంటెడ్ హీరోయిన్ పూజా హెగ్డే. ఇప్పటికే ఆయన దర్శకత్వంలో అమ్మడు రెండు సినిమాలు హీరోయిన్‌గా చేసి హిట్ అందుకుంది. ఈ క్రమంలోనే హ్యాట్రిక్ సినిమా ఆఫర్ ఇచ్చారు. కానీ, తాజా సమాచారం మేరకు ఇప్పుడు గురూజీ బుట్టకొమ్మకి హ్యాండ్ ఇచ్చాడని టాక్ మొదలైంది. అల్లు అర్జున్‌కు ఇండస్ట్రీ హిట్ గా నిలిచిన ‘అల వైకుంఠపురంలో’ వంటి బ్లాక్ బస్టర్ హిట్ తర్వాత మళ్ళీ మన మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ నుంచి ఇంకో సినిమా రాలేదు. దీనికి కారణం పవన్ కళ్యాణ్ నటించిన భీమ్లా నాయక్ సినిమాకు లాక్ అవడమే.

దానికి ముందు కొన్ని నెలలు ఎన్.టి.ఆర్ 30 కోసం ప్రీ ప్రొడక్షన్స్ వర్క్ చేయడం, అనూహ్యంగా ఆ ప్రాజెక్ట్ ఆగిపోవడం వల్ల గురూజీని నుంచి సినిమా రాలేదు. అయితే, రీసెంట్‌గా తన నెక్స్ట్ సినిమాను టాలీవుడ్ సూపర్ స్టార్ మహేశ్ బాబుతో ప్రకటించారు. దాదాపు 12 ఏళ్ల తర్వాత మహేశ్ – త్రివిక్రమ్ కలిసి ప్రాజెక్ట్ చేస్తున్నారు. గతంలో మహేశ్ – త్రివిక్రమ్ కలిసి అతడు, ఖలేజా చిత్రాలు వచ్చాయి. ఈ రెండు సినిమాలు బాక్సాఫీస్ వద్ద తిరగబడ్డాయి.కానీ, బుల్లితెర మీద మాత్రం ఈ రెండు సినిమాలకు మంచి క్రేజ్ ఉంటుంది. ఎప్పుడు టెలికాస్ట్ అయినా మంచి రేటింగ్ నమోదవుతుంది.

Trivikram Srinivas hand to basket twig

Trivikram Srinivas hand to basket twig

Trivikram Srinivas : ఆమైతే మహేశ్ సరసన ఫ్రెష్‌గా ఉంటుంది..!

అయితే, ఇప్పుడు త్రివిక్రమ్ మహేశ్ తో చేయబోతున్న సినిమాలో హీరోయిన్‌గా ముందు నుంచి పూజా హెగ్డే అనుకున్నారు. కానీ, తాజా సమాచారం మేరకు ఇందులో ప్రియాంక అరుళ్ మోహన్‌ను తీసుకోవాలని మేకర్స్ ఆలోచిస్తున్నారట. ఈ బ్యూటీ ప్రస్తుతం తమిళంలో వరుసగా సినిమాలు చేస్తూ బిజీగా ఉంది. తెలుగులో నాని, శర్వానంద్ సినిమాలలో హీరోయిన్‌గా నటించి గుర్తింపు తెచ్చుకుంది. ఇప్పుడు మన గురూజీ కన్ను ఈ క్లాస్ బ్యూటీపై పడిందట. ఆమైతే మహేశ్ సరసన ఫ్రెష్‌గా ఉంటుందని భావిస్తున్నారట. ఇదే నిజమైతే పూజాకు హ్యాండ్ ఇచ్చినట్టే.

Advertisement
WhatsApp Group Join Now

govind

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది