Trivikram Srinivas : మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ గురించి ప్రత్యేక పరిచయాలు అక్కర్లేదు. టాలీవుడ్ స్టార్ డైరెక్టర్‌గా ఓ వెలుగు వెలుగుతున్న త్రివిక్రమ్ ఈమధ్య కాలంలో స్పీడ్ తగ్గించారు అని చెప్పాలి. ఎప్పుడో 2020లో అల్లు అర్జున్ తో “అల వైకుంఠపురములో” సినిమా చేసిన త్రివిక్రమ్ ఈ సినిమాతో మంచి హిట్ తన ఖాతాలో వేసుకున్నారు. ఇక ఈ సినిమా విడుదలై దాదాపు మూడేళ్లవుతోంది. ఆ తర్వాత ఎప్పుడో “భీమ్లానాయక్” కు త్రివిక్రమ్ డైరెక్టర్ గా కాకుండా స్క్రిప్ట్ రైటర్ గా మాత్రమే పని చేశారు. యంగ్ టైగర్ ఎన్టీఆర్ తో ఒక సినిమా చేయాలనుకున్న కుదరలేదు. మధ్యలో కారణాలు చెప్పకుండా సినిమాను చర్చల దశలోనే ఆపేసినట్టు సమాచారం.
చివరికి మహేష్ తో సినిమా ఫైనల్ అయింది. ఈ సినిమా షూటింగ్ వడివడిగా సాగడం లేదు. మహేష్ తల్లి ఇందిరాదేవి అకాల మృతితో కొద్ది రోజులు సినిమాకి బ్రేక్ లు పడ్డాయి. ఆ తరువాత హీరోయిన్ పూజా హెగ్డే కాలికి గాయం కావడంతో నెక్స్ట్ షూటింగ్ షెడ్యూల్ ని త్రివిక్రమ్ వాయిదా వేయాల్సి వచ్చింది. మళ్లీ మహేష్ బాబు స్క్రిప్ట్ లో కొన్ని మార్పులు చేయగా, యాక్షన్ షెడ్యూల్ ని పక్కన పెట్టేయాల్సి వచ్చింది. మళ్లీ ఇప్పుడు మహేష్ బాబు తండ్రి సూపర్ స్టార్ కృష్ణ చనిపోవడంతో ఈ మూవీ షూటింగ్‌కి కొన్నాళ్ల పాటు బ్రేక్ పడనుంది. అయితే త్రివిక్రమ్ శ్రీనివాస్ తో సినిమాలు చేస్తున్నప్పుడే హీరోల తండ్రులు చనిపోతున్నారనే సెంటిమెంట్ ఇప్పుడు ఇండస్ట్రీలో చర్చనీయాంశంగా మారింది.
పవన్ కళ్యాణ్ హీరోగా జల్సా సినిమా షూటింగ్ చేస్తున్న సమయంలోనే పవన్ కళ్యాణ్ తండ్రి కొణిదెల వెంకటరావు అనారోగ్యం కారణంతో కన్నుమూశారని ఓ నెటిజన్ పేర్కొన్నారు. అంతేకాదు ఆ తర్వాత ఎన్టీఆర్ హీరోగా అరవింద సమేత వీర రాఘవ అనే సినిమా చేస్తున్న సమయంలో ఆయన తండ్రి హరికృష్ణ రోడ్డు ప్రమాదానికి గురై చనిపోయారని నెటిజన్ చెప్పుకొచ్చాడు. ఇక ఇప్పుడు మహేష్‌తో సినిమా చేస్తుండగా, కృష్ణ చనిపోయారు. అలా పవన్ -కళ్యాణ్ తండ్రి వెంకట్రావు, ఎన్టీఆర్ తండ్రి హరికృష్ణ , మహేష్ తండ్రి కృష్ణ … త్రివిక్రమ్ సెంటిమెంట్‌తో చని పోయారని సదరు నెటిజన్ పేర్కొన్నాడు.
Passports : పాస్‌పోర్ట్ అత్యంత ముఖ్యమైన ప్రయాణ పత్రాలలో ఒకటి. అంతర్జాతీయ ప్రయాణాన్ని ధృవీకరించడమే కాకుండా, పాస్‌పోర్ట్ గుర్తింపు మరియు…
Mahakumbh Mela : ఉత్తరప్రదేశ్‌లోని ప్రయాగ్‌రాజ్ మహాకుంభమేళా 2025 ఉత్సవాలకు సిద్ధమవుతుంది. 13 జనవరి 2025న ప్రయాగ్‌రాజ్‌లో కుంభమేళా నిర్వహించబడుతుంది.…
Ola Electric : ప్రభుత్వ విచారణ మరియు పెరుగుతున్న నష్టాల మధ్య వివాదాల్లో కూరుకుపోయిన ఓలా ఎలక్ట్రిక్ పునర్వ్యవస్థీకరణలో భాగంగా…
YSR Congress Party : ఆంధ్రప్రదేశ్ పంపిణీ కంపెనీలు (డిస్కమ్‌లు) మరియు అదానీ గ్రూప్ మధ్య ప్రత్యక్ష ఒప్పందం లేదని…
Hair Tips : ప్రస్తుత కాలంలో చాలామందికి జుట్టు చివరలు చిట్లిపోయి నిర్జీవంగా మారిపోతాయి. దీంతో వెంట్రుకలు అనేవి ఊడిపోతూ…
Bigg Boss Telugu 8 : బిగ్ బాస్ సీజన్ 8 చివరి దశకు రానే వచ్చింది. మూడు వారాలలో…
Winter : చలికాలం రానే వచ్చేసింది. రోజురోజుకి చెల్లి ముదిరిపోతుంది. ఈసారి నవంబర్ నెలలోనే చలి మొదలైంది. ఇక ముందు ముందు…
Ind Vs Aus : సొంత గడ్డపై న్యూజిలాండ్ టీం అద్భుతంగా రాణించి భారత జట్టుని వైట్ వాష్ చేసింది.…
This website uses cookies.