Allu Arjun : ఎన్టీఆర్‌ని చూసి నేర్చుకో బన్నీ.. ఈ రేంజ్‌లో ట్రోలింగా..!
Allu Arjun : ఈ మధ్య కాలంలో సెలబ్రిటీలపై ఏ రేంజ్‌లో ట్రోలింగ్ నడుస్తుందో మనం చూస్తూనే ఉన్నాం. ఎవరు చిన్న తప్పు చేసిన దానిని పదే పదే ఎత్తి చూపిస్తూ ట్రోల్ చేస్తున్నారు. ఇటీవల ఏపీ ఎన్నికల ప్రచారంలో అల్లు అర్జున్ చేసిన ఓ పనికి ఆయనని విమర్శల పాలయ్యేలా చేసింది. ఇటీవల జరిగిన ఏపీ ఎన్నికలలో కూటమి మంచి విజయం సాధించింది. తెలుగుదేశం పార్టీలో నందమూరి ఫ్యామిలీ ఉంది. ఇక జనసేన పార్టీని పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నడిపిస్తున్నారు. ఈ రెండు పార్టీలో అఖండ విజయాన్ని సొంతం చేసుకున్నాయి. జనసేన పార్టీ అయితే పోటీ చేసిన అన్ని స్థానాల్లో 100 పర్సెంట్ స్ట్రైక్ రేట్ తో ఘనవిజయం సాధించింది. మెగా ఫ్యామిలీ నైతికంగా పవన్ కళ్యాణ్ కి మద్దతు తెలిపారు.
కొందరు మెగా హీరోలు బహిరంగంగానే పవన్ కోసం ప్రచారం చేశారు. అల్లు అర్జున్ కూడా పవన్ కళ్యాణ్ విజయం సాధించాలని కోరుతూ సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. విజయం సాధించిన తర్వాత శుభాకాంక్షలు కూడా తెలిపారు. ఇంతవరకు బాగానే ఉన్నా కూడా ఎన్నికలకి ముందు అల్లు అర్జున్ నంద్యాలకి వెళ్లి తన స్నేహితుడు శిల్పా రవిచంద్ర రెడ్డికి బహిరంగంగా మద్దతు తెలిపాడు. ఫ్యామిలీతో పాటు వెళ్లిన బన్నీ.. తన స్నేహితుడు విజయం సాధించాలని కోరారు. ఇది మెగా అభిమానులకు ఏమాత్రం నచ్చలేదు. ఒక వైపు తన కుటుంబ సభ్యుడు పవన్ కళ్యాణ్ ఎన్నికల్లో పోరాడుతుంటే.. వెళ్లి వైసీపీ అభ్యర్థికి సపోర్ట్ చేయడం ఏంటి అంటూ ఆ రోజు నుంచే అల్లు అర్జున్ పై ట్రోలింగ్ మొదలైంది.
Allu Arjun : ఎన్టీఆర్‌ని చూసి నేర్చుకో బన్నీ.. ఈ రేంజ్‌లో ట్రోలింగా..!
ఎన్నికల్లో శిల్పా రవిచంద్రారెడ్డి ఓటమిపాలయ్యారు. దీనితో అల్లు అర్జున్ పై ట్రోలింగ్ మరింతగా ఎక్కువైంది. ఇప్పుడు మెగా అభిమానులు యంగ్ టైగర్ ఎన్టీఆర్ ని చూపిస్తూ అల్లు అర్జున్ పై విరుచుకుపడుతున్నారు. ఎన్టీఆర్ కి కూడా వైసీపీ లో కొంతమంది ఫ్రెండ్స్ ఉన్నారు. కొడాలి నాని, వల్లభనేని వంశి లాంటివారు తారక్ కి బెస్ట్ ఫ్రెండ్స్. కాని ఆయన టీడీపీకి మాత్రమే కట్టుబడి ఉన్నారు. అందుకే వారి ఫ్రెండ్స్ వైసీపీలో ఉన్న కారణంగా తన మద్దతు ప్రకటించలేదు. కుటుంబం పట్ల గౌరవం అంటే తారక్ లా ఉండాలని మెగా అభిమానులు అంటున్నారు. ఈ క్రమంలో బన్నీని ఓ రేంజ్‌లో ట్రోల్ కూడా చేస్తున్నారు. కాగా, శిల్పా రవిచంద్ర రెడ్డి భార్యకి అల్లు అర్జున్ భార్య స్నేహితురాలు. ఆ విధంగా శిల్పా రవిచంద్రారెడ్డి అల్లు అర్జున్ కి ఫ్రెండ్ అయ్యారు.
Smart Watch : సాధారణంగా చాలామంది చేతిని అందంగా కనిపించేందుకు స్మార్ట్ వాచ్ ని స్టైల్ కోసం, ఇంకా అవసరాల…
Vastu Tips : చాలామందికి తెలియకుండానే కొన్ని తప్పుల్ని ఇంట్లో చేస్తూ ఉంటారు. అలాగే వాస్తు విషయంలో కూడా అలాగే…
kingdom Movie Review : విజయ్ దేవరకొండ Vijay Devarakonda , Bhagya Sri Borse , హీరోగా నటించిన…
Pumpkin : గుమ్మడికాయలు ఆరోగ్యానికి ఎంతో మంచిది. ఇందులో మూడు రకాల గుమ్మడికాయలు ఉంటాయి. మూడింటిలో ఆకుపచ్చ పసుపు తెలుపు…
Kingdom Movie Review : విజయ్ దేవరకొండ vijay devarakonda , bhagya sri borse నటించిన కింగ్డమ్ చిత్రం…
Tea : వర్షాకాలం, చలికాలం వచ్చిందంటే చల్లటి వాతావరణం లో మన శరీరం వెచ్చదనాన్ని వెతుక్కుంటుంది. మన శరీరం వేడిగా…
Rakhi Festival : శ్రావణ మాసంలో rakhi festival ప్రతి సంవత్సరం వచ్చే పౌర్ణమి తిధి రోజున రాఖీ పండుగ…
Indiramma Houses : ఈ రోజు ఘట్కేసర్ మున్సిపల్ లో ఇందిరమ్మ పథకం కింద వచ్చిన 5 లక్షల రూపాయలు…
This website uses cookies.