Bigg Boss OTT Telugu : అఖిల్‌ బిందు మాధవి, నటరాజ్ మాస్టర్ యాంకర్ శివ… ఎడిటర్‌కు మరెవ్వరు కనిపించడం లేదా?

Authored By Prahbas Gilakathula | The Telugu News | Published on: April 12, 2022, 9:45 pm

Bigg Boss OTT Telugu : తెలుగు బిగ్ బాస్ నాన్ స్టాప్ మంచి సక్సెస్ తో దూసుకు వెళ్తుంది. ప్రతి ఒక్కరు కూడా ఈ షో పై ఆసక్తి చూపిస్తూ డిస్నీ ప్లస్ హాట్ స్టార్ లో రెగ్యులర్ గా చూస్తున్నారు. కొంత మంది యూట్యూబ్లో ప్రోమోలు చూసి ఆ ఎపిసోడ్ బాగుంటే డిస్నీ ప్లస్ హాట్ స్టార్ లో కి వెళ్లి చూస్తుంటే.. మరి కొందరు మాత్రం రెగ్యులర్ గా ఫాలో అవుతున్నారు. రెగ్యులర్ గా బిగ్ బాస్ ని ఫాలో అవుతున్న చాలా మందికి ఒక విషయం క్లియర్ గా అర్ధం అవుతుంది. అది ఏంటి అంటే ఈ కార్యక్రమంలో ఎక్కువ స్క్రీన్ స్పేస్ బిందు మాధవి మరియు అఖిల్ ఇంకా యాంకర్ శివ మరియు నట్రాజ్ మాస్టర్ లకు ఉన్నట్లుగా అనిపిస్తుంది.

అఖిల్‌ మరియు బిందు మాధవి ల మధ్య గొడవ ప్రేక్షకులు బాగా ఎంజాయ్ చేస్తున్నట్లు గా సోషల్ మీడియాలో జరుగుతున్న ప్రచారం చూస్తే అనిపిస్తుంది. అందుకే వారిద్దరి మధ్య ఎక్కువ గొడవలు పెట్టేందుకు స్వయంగా బిబి టీమ్‌ ప్రయత్నాలు చేస్తున్నట్లు అనిపిస్తుంది. బిగ్ బాస్ వారు ఈవారం ఎలిమినేషన్ నామినేషన్‌ ప్రక్రియ నిర్వహించారు. అఖిల్‌ మరియు బిందు మాధవి లో ఎవరో ఒకరు ఎలిమినేట్ అయ్యేందుకు నామినేట్‌ అవ్వాల్సి ఉంటుంది. ఇద్దరి మద్య చర్చ తారా స్థాయికి చేరింది. ఇద్దరు కూడా ఒరేయ్‌.. ఒసేయ్‌ అంటూ తిట్టేసుకున్నారు. చివరకు ఇద్దరు కూడా ఎలిమినేషన్ లో ఉన్నారు.ఇద్దరు అభిమానులు ఓటింగ్ విషయంలో పోరాడే అవకాశాలు ఉన్నాయి.ఇక మరో ఆసక్తికర జంట ఏంటంటే నటరాజ్ మాస్టర్ మరియు యాంకర్ శివ.

trolls on bigg boss OTT Telugu nonstop editors

trolls on bigg boss OTT Telugu nonstop editors

వీరిద్దరి మధ్య కూడా పోటీ అనేది తీవ్రంగా కనిపిస్తుంది. ఇద్దరూ బూతులు తిట్టుకుంటూ ఓ రేంజ్లో గొడవ పడుతున్నారు. అందుకే వీరిద్దరికి కూడా ఎక్కువ స్క్రీన్ స్పేస్ ఇస్తున్నారు. బిగ్ బాస్ ఇస్తున్న టాస్క్ లతో వీరిద్దరూ కూడా తగ్గేది లేదు అంటూ భీష్మించుకు కూర్చోవడంతో గొడవలు అవుతున్నాయి. తాజా ఎలిమినేషన్‌ నామినేషన్‌ పక్రియలో కూడా అలాగే జరిగింది. చేసేది లేక ఇద్దరు కూడా నామినేట్ అయ్యారు. మొత్తానికి ఈ నలుగురు కార్యక్రమం లో కనిపిస్తే ఎక్కువగా ప్రేక్షకులు చూస్తున్నారు అనే ఉద్దేశంతో ఎడిటర్ ఈ నలుగురిని ఎక్కువగా చూపెడుతున్నాడు అనే విమర్శలు వస్తున్నాయి. ఇతర కంటెస్టెంట్ విషయంలో అసలు దృష్టి పెట్టడం లేదా అంటే అలా ఏం కాదు కానీ ఎక్కువగా వీరు నలుగురి పై దృష్టి పెట్టడం.. వీరి నలుగురి మధ్య గొడవలు ఫైనల్ ఎడిటింగ్ లో ఉంచడం చేస్తున్నారు.

Prahbas Gilakathula

Prabhas Gilakathula Content Writer experiened in Digital media field. Iam worked in various Telugu media for about 5 years. Worked in Namasthe Telangana, Telugu Rajyam , as a telugu content writer. I wrote various Latest Breaking News , politics, interesting stories, Andhr Pradesh & Telangana local news, health, technology, entertainment , Devotional, etc. He is also Social Media Expert, Technical Expert . He is present content writer of thetelugunews.com website. Contact details: Prabhas29nov@gmail.com

Google The Telugu News మీకు నచ్చిన సైటుగా ఎంచుకోండి
WhatsApp