Bigg Boss 6 Telugu : అమ్మో ఈ టీవీ 9 యాంకర్ బిగ్ బాస్‌లోకి.. ‘ఇస్మార్ట్‘ బ్రెయిన్ వాడుతుందా?

Authored By Prahbas Gilakathula | The Telugu News | Published on: August 10, 2022, 5:00 pm

Bigg Boss 6 Telugu : బిగ్ బాస్ ఆరో సీజన్ సందడి మొదలైంది. మొన్న లోగోను వదిలాడు. లోగో వెనుకున్న మర్మాన్ని కూడా చెప్పాడు. అన్ని రకాల ఎమోషనల్‌కు చిహ్నంగా అన్ని రకాల రంగులను పెట్టామని, ఇక ఈ షో ఈసారి అన్ని వయసుల వారిని అలరించేందుకు రాబోతోన్నట్టు చెప్పుకొచ్చారు. ఇక ఇప్పుడు మొదటి ప్రోమోను వదిలారు. ఇందులో కాస్త ఎక్కువే అనిపించినా కూడా బిగ్ బాస్ షోకు ఉన్న ఫాలోయింగ్ క్రేజ్‌ను చాటేలా ఉంది. కూతురి పెళ్లి జరుగుతుంటే..అప్పగింతలు జరుగుతూ ఉంటే.. బిగ్ బాస్ అప్డేట్ వచ్చిందని మధ్యలోనే వదిలేసి వెళ్తాడు తండ్రి.

అలా ఆ షోకు ఎంత క్రేజ్ ఉందో చెప్పాలనే ఉద్దేశ్యంతోనే ప్రోమోను డిజైన్ చేశారు. అయితే ఇప్పుడు మాత్రం బిగ్ బాస్ కంటెస్టెంట్ల లిస్ట్ వైరల్ అవుతోంది. ఎవరికీ ఏదీ తెలియకపోయినా కూడా నెట్టింట్లో మాత్రం కొన్ని పేర్లు వైరల్ అవుతున్నాయి. ఇక ఈ సారి సిరి ప్రియుడు శ్రీహాన్, గీతా మాధురి భర్త నందు మాత్రం కచ్చితంగా ఉంటారని అనుకుంటున్నారు. జబర్దస్త్ అప్పారావు, చంటి, గలాట గీతూ వంటి వారు కూడా రాబోతోన్నారట.

TV 9 Anchor Ismart Anjali Bigg Boss 6 Telugu Entry Confirm

TV 9 Anchor Ismart Anjali Bigg Boss 6 Telugu Entry Confirm

ఉదయ భాను, సంజనా చౌదరి, ఆర్జే సూర్య, యూట్యూబర్ నిఖిల్, చైల్డ్ ఆర్టిస్ట్ భరత్ ఇలా ఎంతో మంది పేర్లు చక్కర్లు కొడుతున్నాయి. అయితే తాజాగా ఓ ఇంట్రెస్టింగ్ న్యూస్ బయటకు వచ్చింది. టీవీ 9 యాంకర్‌ని ప్రతీ సారి తీసుకుంటూ ఉంటారు. ఈ సారి టీవీ 9 నుంచి ఇస్మార్ట్ అంజలిగా ఫేమస్ అయిన ఆరోహిని తీసుకుంటున్నారని తెలుస్తోంది. ఎందుకంటే ఈమె తాజాగా తన ఇన్ స్టా గ్రాంలో బిగ్ న్యూస్ అని గాల్లో తేలిపోతోన్న పోస్ట్ వేసింది. బిగ్ న్యూస్ అంటే.. బిగ్ బాస్ షో అని అర్థమవుతోంది. అంటే ఈమె ఎంట్రీ అఫీషియల్‌గా కన్ఫామ్ అయినట్టు కనిపిస్తోంది.

Prahbas Gilakathula

Prabhas Gilakathula Content Writer experiened in Digital media field. Iam worked in various Telugu media for about 5 years. Worked in Namasthe Telangana, Telugu Rajyam , as a telugu content writer. I wrote various Latest Breaking News , politics, interesting stories, Andhr Pradesh & Telangana local news, health, technology, entertainment , Devotional, etc. He is also Social Media Expert, Technical Expert . He is present content writer of thetelugunews.com website. Contact details: Prabhas29nov@gmail.com

Google The Telugu News మీకు నచ్చిన సైటుగా ఎంచుకోండి
WhatsApp