Anchor Shiva Jyothy : ఆ విషయంలో శివ జ్యోతి అక్క హిట్‌… తీన్మార్ ను వీళ్లు మించారు

Authored By Prahbas Gilakathula | The Telugu News | Updated on : 21 May 2022, 3:30 pm

Anchor Shiva Jyothy : శివజ్యోతి అంటే ఠక్కున జనాలకు ఆమె గుర్తు రాదు.. తీన్మార్ సావిత్రి లేదా ఇస్మార్ట్‌ న్యూస్ జ్యోతి లేదా బిగ్ బాస్ జ్యోతక్క అంటేనే ఆమెను వెంటనే జనాలు గుర్తిస్తారు. ఒక సాదారణ ఉద్యోగం చేసుకుంటూ జీవితాన్ని సాగిస్తున్న ఆమె కు అనూహ్యంగా వీ6 లో తీన్మార్‌ వార్తల్లో సావిత్రి రోల్‌ కు అవకాశం దక్కింది. ఆమె యాక్టివ్‌ నేచర్ మరియు ఆ సమయంలో బిత్తిరి సత్తి ఆమె తో కలిసి ఉండటం వల్ల మంచి పాపులారిటీని దక్కించుకున్నారు. ఒకరి వల్ల ఒకరికి మంచి పేరు వచ్చింది అనడంలో ఎలాంటి సందేహం లేదు.

వీ6 లో తీన్మార్‌ న్యూస్ లో చేస్తున్న సమయంలోనే బిగ్ బాస్ లో శివ జ్యోతి అడుగు పెట్టిన విషయం తెల్సిందే. అక్కడ మంచి ప్రవర్తనతో అందరితో బాగుంటూ ప్రతి ఒక్కరిని ఆకట్టుకుంది. బిగ్‌ బాస్ లో మంచి పేరు దక్కించుకుంది. సావిత్రి అనే పేరును చెరిపేసుకుని ఆమె జ్యోతి అనే పేరుకు వచ్చేసింది. ఇప్పుడు టీవీ 9 లో ఇస్మార్ట్‌ న్యూస్ ను చేస్తోంది. ఈ పోగ్రా టీమ్ అంతా కూడా చాలా యాక్టివ్‌ గా పని చేస్తూ ప్రతి ఒక్కరికి కూడా ఎంటర్‌ టైన్మెంట్ ను అందిస్తున్నారు. శివ జ్యోతి ఆ కార్యక్రమంకు ప్రత్యేక ఆకర్షణ గా నిలుస్తుంది.

tv9 ismart news anchor shiva jyothy get good marks

tv9 ismart news anchor shiva jyothy get good marks

ఇస్మార్ట్‌ న్యూస్ కు మంచి వ్యూవర్‌ షిప్‌ ఉంటుంది. రేటింగ్‌ బాగుంటున్న నేపథ్యంలో మరింత యాక్టివ్ గా టీమ్ విభిన్నమైన వార్తలను సేకరిస్తూ వింతగా ఆకట్టుకునే విధంగా ప్రజెంట్ చేస్తున్నారు. శివ జ్యోతి ఆ విషయంలో సూపర్‌ హిట్‌ అయ్యింది. తీన్మార్ కు ఏమాత్రం తగ్గకుండా.. ఇసుమంత ఎక్కువే అన్నట్లుగా శివ జ్యోతి ఇస్మార్ట్‌ న్యూస్ ను ముందుకు తీసుకు వెళ్తున్నారు. తెలంగాణ యాస వాడటం లో వీ6 వారిని మించి పోయేలా ఇస్మార్ట్‌ న్యూస్ టీమ్‌ ప్రయత్నాలు చేస్తున్నారు. కనుక ఇస్మార్ట్‌ న్యూస్ కు ఇటీవల తెలుగు న్యూస్ ఛానల్ రేటింగ్‌ విషయంలో టాప్‌ లో నిలిచింది. ఇందతా కూడా శివ జ్యోతి వల్లే అంటున్నారు.

Prahbas Gilakathula

Prabhas Gilakathula Content Writer experiened in Digital media field. Iam worked in various Telugu media for about 5 years. Worked in Namasthe Telangana, Telugu Rajyam , as a telugu content writer. I wrote various Latest Breaking News , politics, interesting stories, Andhr Pradesh & Telangana local news, health, technology, entertainment , Devotional, etc. He is also Social Media Expert, Technical Expert . He is present content writer of thetelugunews.com website. Contact details: Prabhas29nov@gmail.com

Google The Telugu News మీకు నచ్చిన సైటుగా ఎంచుకోండి
WhatsApp