Anchor Shiva Jyothi : జ్యోతక్కా ఆపు నీ అతి .. అంటూ కామెంట్స్ .. శివ జ్యోతి అంత తప్పు ఏం చేసింది ! | The Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు

Anchor Shiva Jyothi : జ్యోతక్కా ఆపు నీ అతి .. అంటూ కామెంట్స్ .. శివ జ్యోతి అంత తప్పు ఏం చేసింది !

 Authored By aruna | The Telugu News | Updated on :7 June 2023,9:00 pm

Anchor Shiva Jyothi : బుల్లితెరపై యాంకర్ గా శివజ్యోతి సుపరిచితురాలు. తీన్మార్ వార్తలలో సావిత్రిగా యాంకరింగ్ చేసి తన తెలంగాణ యాసతో అందరిని ఆకట్టుకుంది. ముఖ్యంగా ఆమె తన కట్టుబొట్టుతో అందరిని మెప్పించింది. అలా ప్రతి ఒక్కరితో మంచి పరిచయం ఏర్పరచుకుంది. అలా శివజ్యోతికి బిగ్ బాస్ షోలో అవకాశం వచ్చింది. ఈ షో తో శివజ్యోతి బాగా పాపులర్ అయింది. అలాగే ఈ షో ద్వారా ఆమె బాగా ఎమోషనల్ అని తెలిసిపోయింది. బిగ్ బాస్ తర్వాత శివజ్యోతి టీవీ9 లో ఇస్మార్ట్ న్యూస్ ఛానల్లో యాంకర్ గా పనిచేసింది. బిగ్ బాస్ లో తనతోటి కంటెస్టెంట్లతో ఇప్పుడు కూడా ఫ్రెండ్షిప్ కంటిన్యూ చేస్తుంది.

Anchor Shiva Jyothi overaction comments

Anchor Shiva Jyothi overaction comments

అయితే ఒకప్పుడు ట్రెడిషనల్ గా కనిపించిన శివ జ్యోతి బిగ్బాస్ తర్వాత మోడ్రన్ గా తయారవుతూ అందరిని షాక్ అయ్యేలా చేస్తుంది. ఇక తన ఇంస్టాగ్రామ్ లో ఎప్పటికప్పుడు ఫోటోలు పెడుతూ ఉంటుంది. తన భర్త గంగూలితో కలిసి చేసిన వీడియోలు, ఫోటోలు కూడా బాగా షేర్ చేస్తూ ఉంటుంది. వీళ్లది ప్రేమ వివాహం. అందుకే చూడ్డానికి ఎంత అన్యోన్యంగా కనిపిస్తూ ఉంటారు. ఒకరిని వీడి మరొకరు ఉండలేకపోతుంటారు. అయితే రీసెంట్గా శివజ్యోతి తన భర్తను వదిలి మొదటిసారి అమెరికాకు వెళ్ళింది.

దీంతో వెళ్లే సమయంలో చాలా ఎమోషనల్ అయింది. ఇక దానికి సంబంధించిన వీడియో బాగా వైరల్ అవుతుంది. ఆమె తిరిగి హైదరాబాద్ చేరుకోగా తన భర్త ను పట్టుకొని చాలా ఎమోషనల్ అయింది. ఏడుస్తూ తన భర్తను హగ్ చేసుకుంది. దీంతో ఆ వీడియో చూసిన కొందరు నెటిజన్స్ జ్యోతక్కా ఆపు నీ అతి, ఓవరాక్షన్ ఆపు చూడలేకపోతున్నాం అంటూ ట్రోల్స్ చేస్తున్నారు. ఏడ్చేటప్పుడు వీడియో తీయడం, పెట్టడం. బాధ ఉంటే రీల్ లో పెట్టడం కాదు. రియల్ గా ఏడవండి అంటూ కామెంట్స్ చేస్తున్నారు.

aruna

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది