Shiva Jyothi : వామ్మో శివ జ్యోతి.. మొన్న బీఎండబ్ల్యూ, నిన్న ఇల్లు, ఇంత డబ్బు ఎలా సంపాదిస్తున్నావు అక్కా? | The Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు | Today Telugu News

Shiva Jyothi : వామ్మో శివ జ్యోతి.. మొన్న బీఎండబ్ల్యూ, నిన్న ఇల్లు, ఇంత డబ్బు ఎలా సంపాదిస్తున్నావు అక్కా?

Shiva Jyothi : వార్తలు చెప్పే శివ జ్యోతి ఎప్పుడూ వార్తల్లో నిలుస్తూనే ఉంటుంది. ఆ మధ్య అత్యంత ఖరీదైన బిఎండబ్ల్యూ కారు కొనుగోలు చేయడం ద్వారా వార్తల్లో నిలిచిన శివ జ్యోతి తాజాగా తన నూతన ఇంటి గృహ ప్రవేశ కార్యక్రమం అంగరంగ వైభవంగా నిర్వహించడం ద్వారా వార్తల్లో నిలిచింది. శివజ్యోతి అలియాస్ సావిత్రి సోషల్ మీడియా ద్వారా ఎంతో యాక్టివ్ గా అందరికీ అందుబాటులో ఉంటుంది అనే విషయం తెలిసిందే. ఆమె టీవీ ఛానల్లో […]

 Authored By prabhas | The Telugu News | Updated on :6 December 2022,3:40 pm

Shiva Jyothi : వార్తలు చెప్పే శివ జ్యోతి ఎప్పుడూ వార్తల్లో నిలుస్తూనే ఉంటుంది. ఆ మధ్య అత్యంత ఖరీదైన బిఎండబ్ల్యూ కారు కొనుగోలు చేయడం ద్వారా వార్తల్లో నిలిచిన శివ జ్యోతి తాజాగా తన నూతన ఇంటి గృహ ప్రవేశ కార్యక్రమం అంగరంగ వైభవంగా నిర్వహించడం ద్వారా వార్తల్లో నిలిచింది. శివజ్యోతి అలియాస్ సావిత్రి సోషల్ మీడియా ద్వారా ఎంతో యాక్టివ్ గా అందరికీ అందుబాటులో ఉంటుంది అనే విషయం తెలిసిందే. ఆమె టీవీ ఛానల్లో ఒక కార్యక్రమం చేస్తూ ఉంటుంది. అంతకు మించి ఆమె ఏం చేస్తుంది అనేది ఎవరికీ అర్థం కాదు. అయినా కూడా ఆమె ఆదాయ మార్గాలు ఎన్నో ఉన్నాయి అంటూ ఆమె సన్నిహితులు చెబుతూ ఉంటారు.

యూట్యూబ్ ద్వారా ఆమెకు నెలకు లక్షల రూపాయల ఆదాయం వస్తుందట, అంతే కాకుండా ఇంస్టాగ్రామ్ లో ఆమె పెయిడ్ ప్రమోషన్ కార్యక్రమాలను నిర్వహిస్తూ ఉంటుంది. అందుకుగాను ఆమె నెల నెల లక్షల రూపాయల సంపాదన కలిగి ఉంటుంది. ఇక ఆమె భర్త గంగూలి కూడా వ్యాపారంలో ఉన్నారు. అందువల్ల రకరకాల మార్గాల ద్వారా వచ్చే ఆదాయం కారణంగానే ఖరీదైన కార్లను కొనుగోలు చేయడంతో పాటు ఇలా రెండు మూడు ఇళ్లను కూడా సొంతం చేసుకుంటుంది. కొన్నాళ్ల క్రితమే శివ జ్యోతి ఒక ఇల్లు కొనుగోలు చేసి గృహప్రవేశం చేసింది. ఆ సమయంలో సోషల్ మీడియాలో షేర్ చేసిన వీడియోలు మరియు ఫోటోలు వైరల్‌ అయ్యాయి.

how are you earning so much money Shiva Jyothi

how are you earning so much money Shiva Jyothi

ఇప్పుడు మరో సారి తన ఇంటి గృహ ప్రవేశ కార్యక్రమం అంటూ ఫోటోలు షేర్ చేయడం ద్వారా అందరి దృష్టిని ఆకర్షిస్తుంది. ఈసారి శివ జ్యోతి ఇంటి గృహ ప్రవేశం గురించి సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున చర్చ జరుగుతుంది. ఇంత డబ్బు ఎలా సంపాదిస్తున్నావు అక్క? బావ ఏం చేస్తున్నాడు మీరేం చేస్తున్నారు అంటూ ఆమె అభిమానులు రకరకాలుగా ప్రశ్నిస్తున్నారు. మొత్తానికి శివజ్యోతి గృహ ప్రవేశ కార్యక్రమానికి సోషల్ మీడియా సెలబ్రిటీలు మాత్రమే కాకుండా బుల్లి తెరకు చెందిన పలువురు ప్రముఖులు కూడా హాజరై అందరి దృష్టిని ఆకర్షించారు. మా తరఫున కూడా చివరి జ్యోతి దంపతులకు శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం.

prabhas

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది