Udaya Bhanu : మళ్లీ ఈవెంట్ చేస్తానన్న నమ్మకం లేదు.. ఉదయ భాను సంచలన వ్యాఖ్యలు
ప్రధానాంశాలు:
Udaya Bhanu : మళ్లీ ఈవెంట్ చేస్తానన్న నమ్మకం లేదు.. ఉదయ భాను సంచలన వ్యాఖ్యలు
Udaya Bhanu : బుల్లితెర అతిలోక సుందరిగా పేరుతెచ్చుకున్న యాంకర్ ఉదయభాను Uday Bhanu. ఈ అందాల యాంకర్ ఒకప్పుడు తన మాటలతో.. అందంతో, చలాకీ తనంతో ప్రేక్షకులను ఆకట్టుకుంది. ప్రముఖ ఛానల్‌లో టెలికాస్ట్ అయిన హృదయాంజలి అనే కార్యక్రమంతో ప్రేక్షకులను పలకరించింది ఉదయభాను. యాంకర్‌గా చేసిన మొదటి కార్యక్రమంతోనే గలగలా మాట్లాడుతూ ప్రేక్షకుల ఆదరణ పొందింది ఉదయభాను…

Udaya Bhanu : మళ్లీ ఈవెంట్ చేస్తానన్న నమ్మకం లేదు.. ఉదయ భాను సంచలన వ్యాఖ్యలు
Udaya Bhanu : ఉదయభాను కౌంటర్..
వన్స్ మోర్ ప్లీజ్, సాహసం చేయరా డింబకా , డ్యాన్స్ బేబీ డ్యాన్స్, రేలారే రే రేలా, ఢీ రియాలిటీ డ్యాన్స్ షో, జాణవులే నెరజాణవులే, పిల్లలు పిడుగులు ఇలా చాలా పాపులర్ షోల్లో యాంకర్ కనిపించి ప్రేక్షకులను ఆకట్టుకుంది. ఇక యాంకర్ గానే కాదు సినిమాల్లోనూ నటించింది ఉదయభాను. ఇక చాలా కాలంగా యాంకరింగ్ కు దూరంగా ఉంటున్న ఉదయభాను రీసెంట్ గా ఓ సినిమా ఈవెంట్ ను హోస్ట్ చేశారు. కాగా ఆ సినిమా ఈవెంట్ వేదిక పై ఉదయభాను చేసిన కామెంట్స్ ఇప్పుడు వైరల్ అయ్యాయి.
ఓ భామ అయ్యో రామ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్‌లో ఉదయభాను ..మళ్లీ నేను ఎప్పుడు యాంకరింగ్ చేస్తానో తెలియదని.. ఇక్కడో పెద్ద సిండికేట్ ఏర్పడిపోయిందని అంటూ స్టేజ్ పైనే అసంతృప్తి వ్యక్తం చేసింది ఉదయభాను. ఇదొక్కటే చేశానండీ.. మళ్లీ చేస్తానో లేదో గ్యారంటీ లేదు. రేపే ఈవెంట్ అని అనుకుంటాం కానీ.. చేసేరోజుకి మనికి ఈవెంట్ ఉండదు. అంత పెద్ద సిండికేట్ ఎదిగింది ఇండస్ట్రీలో. హీరో సుహాస్ మా బంగారం కాబట్టి ఏదో చేయగలిగాం… మనసులో మాట కాబట్టే చెప్తున్నా అంటూ ఉదయభాను అసహనం వ్యక్తం చేశారు.. ‘నాకు చాలా బుల్లెట్లు తగిలాయి అది ఎవరికీ తెలియదు’ అంటూ నవ్వుతూనే కౌంటర్ ఇచ్చారు