Bala Krishna | మోకాళ్ల మీద కూర్చొని పిల్లలతో క్యూట్ పిక్..ఆ చిన్నారులు ఎవరంటే..!
Bala Krishna | సినిమాల్లో ఎంత గంభీరంగా కనిపించినా, నిజ జీవితంలో మాత్రం బాలకృష్ణ “బంగారు మనిషి” అని అంటుంటారు. తాజాగా ఓ ఈవెంట్‌లో బాలయ్య తన అమాయకపు ప్రేమను మరోసారి చాటారు. ఈ కార్యక్రమానికి నటి, యాంకర్ ఉదయభాను తన ఇద్దరు కూతుళ్లు – భూమి ఆరాధ్య, యువి నక్షత్రలతో హాజరయ్యారు. అక్కడ బాలయ్యను చూసిన చిన్నారులు ఆనందంతో ఉప్పొంగిపోయారు. బాలయ్య కూడా వారిని ముద్దుగా అక్కున చేర్చుకుని, మరీ మోకాళ్లపై కూర్చొని ఫోటోలు దిగారు.

#image_title
బాలయ్యనా, మజాకానా..
ఆ మధుర క్షణం వీడియోగా ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఉదయభాను బాలయ్యకు వీరాభిమాని మాత్రమే కాదు, ఆయనను ఇంటి పెద్దల్లాగే గౌరవిస్తారు. గతంలో కూడా ఆమె మాట్లాడుతూ – “నాకెప్పుడు కష్టంగా ఉన్నా బాలయ్య గారు సపోర్టుగా నిలిచారు. నా కవలల పుట్టినరోజుకు ప్రత్యేకంగా వచ్చి ఆశీర్వదించారు” అని పేర్కొన్న విషయం తెలిసిందే. ఇప్పుడు ఈ తాజా వీడియో చూస్తే ఆ అనుబంధం ఎంత బలంగా ఉందో స్పష్టంగా తెలుస్తోంది.
ఈ హృద్యమైన క్షణాన్ని ఉదయభాను స్వయంగా తన సోషల్ మీడియాలో షేర్ చేయగా, బాలయ్య అభిమానులు “మా బాలయ్య బాబు నిజంగా బంగారం”, “మొదటి చూపులోనే పిల్లలకు ఎంత ప్రేమ చూపారో” అంటూ కామెంట్స్ చేస్తున్నారు.