Bigg Boss 5 Telugu : ఉమాదేవి అవుట్.. కారణాలు ఇవేనా?
Bigg Boss 5 Telugu బిగ్ బాస్ షోలో రెండో వారం ఎలిమినేషన్‌కు సమయం వచ్చింది. రెండో వారంలో ఏడుగురు నామినేషన్‌లోకి వచ్చారు. నామినేషన్ సమయంలోనే ఎలిమినేట్ కాబోయే వ్యక్తి ఎవరనేది అందరికీ ఓ అంచనా వచ్చేసింది. కాజల్, నటరాజ్ మాస్టర్, యానీ మాస్టర్, ప్రియ, ప్రియాంక సింగ్, లోబో, ఉమాదేవీ నామినేట్ అయ్యారు. ఇక నామినేషన్ ప్రక్రియలో ఉమా దేవీ బూతుల పురాణాన్ని విని కంటెస్టెంట్లు నోరెళ్ల బెట్టేశారు. ఎర్రి డ్యాష్, పుట్టలో వేలు, డ్యాష్ కింద డెబ్బై ఏళ్లు అంటూ ఇలా నోరు విప్పితే బూతులతో వీరంగం ఆడింది.
uma devi elimination in bigg boss 5 telugu second week
ఉమా దేవీ ఎలిమినేషన్.. Bigg Boss 5 Telugu
అప్పుడే ఉమాదేవీ ఎలిమినేషన్ ఫిక్స్ అయింది. అసలు నోరు వేసుకుని గయ్యాలి గంపల అంత ఎత్తున లేచే ఉమా దేవీ అంటే ప్రేక్షకులను నచ్చలేదు. మొదటి వారంలోనే ఇంటికి వెళ్లేది. కానీ నామినేషన్‌లోకి వెళ్లలేదు కాబట్టి.. బతికిపోయింది. కానీ రెండో వారంలో తప్పించుకోలేకపోయింది. ఊరికే గొడవలు పెట్టుకోవడం, ఎదుటివారి మీద అరవడం, బూతులతో రెచ్చిపోవడంతో ఉమా దేవీని ఆడియన్స్ తిరస్కరించినట్టు కనిపిస్తోంది. అందుకే ఆదివారం ప్రసారం కాబోయే ఎపిసోడ్‌లో ఉమాదేవీ ఎలిమినేట్ కాబోతోందట.
ఈ మేరకు లీకులు అందుతున్నాయి. ఉమా దేవీ ఎలిమినేట్ అయిందంటూ వార్తలు చక్కర్లు కొడుతున్నాయి. శనివారం నాటి ఎపిసోడ్‌లో ప్రియాంక, లోబో, యానీ మాస్టర్ సేఫ్ అయినట్టు నాగార్జున ప్రకటించారు. ఇక ఆదివారం నాడు మిగిలిన ప్రాసెస్‌ను పూర్తి చేయబోతోన్నారు. ఉమాదేవీకి బూతుల ఎఫెక్ట్ బాగానే పడింది. నిన్నటి ఎపిసోడ్‌లో నాగార్జున ముందు.. బూతులు మాట్లాడినందుకు క్షమించమని, గుంజిళ్లు తీసింది ఉమాదేవీ. కానీ అది చాలా ఆలస్యమైంది. మొత్తానికి ఉమాదేవీ మీద వేటు పడింది.
Umadevi Fires On Anee Master In Bigg Boss 5 Telugu
