Bigg Boss 5 Telugu : ఉమాదేవి అవుట్.. కారణాలు ఇవేనా?

Authored By Cinema Desk | The Telugu News | Updated on: September 19, 2021, 7:15 pm

Bigg Boss 5 Telugu బిగ్ బాస్ షోలో రెండో వారం ఎలిమినేషన్‌కు సమయం వచ్చింది. రెండో వారంలో ఏడుగురు నామినేషన్‌లోకి వచ్చారు. నామినేషన్ సమయంలోనే ఎలిమినేట్ కాబోయే వ్యక్తి ఎవరనేది అందరికీ ఓ అంచనా వచ్చేసింది. కాజల్, నటరాజ్ మాస్టర్, యానీ మాస్టర్, ప్రియ, ప్రియాంక సింగ్, లోబో, ఉమాదేవీ నామినేట్ అయ్యారు. ఇక నామినేషన్ ప్రక్రియలో ఉమా దేవీ బూతుల పురాణాన్ని విని కంటెస్టెంట్లు నోరెళ్ల బెట్టేశారు. ఎర్రి డ్యాష్, పుట్టలో వేలు, డ్యాష్ కింద డెబ్బై ఏళ్లు అంటూ ఇలా నోరు విప్పితే బూతులతో వీరంగం ఆడింది.

uma devi elimination in bigg boss 5 telugu second week

uma devi elimination in bigg boss 5 telugu second week

ఉమా దేవీ ఎలిమినేషన్.. Bigg Boss 5 Telugu

అప్పుడే ఉమాదేవీ ఎలిమినేషన్ ఫిక్స్ అయింది. అసలు నోరు వేసుకుని గయ్యాలి గంపల అంత ఎత్తున లేచే ఉమా దేవీ అంటే ప్రేక్షకులను నచ్చలేదు. మొదటి వారంలోనే ఇంటికి వెళ్లేది. కానీ నామినేషన్‌లోకి వెళ్లలేదు కాబట్టి.. బతికిపోయింది. కానీ రెండో వారంలో తప్పించుకోలేకపోయింది. ఊరికే గొడవలు పెట్టుకోవడం, ఎదుటివారి మీద అరవడం, బూతులతో రెచ్చిపోవడంతో ఉమా దేవీని ఆడియన్స్ తిరస్కరించినట్టు కనిపిస్తోంది. అందుకే ఆదివారం ప్రసారం కాబోయే ఎపిసోడ్‌లో ఉమాదేవీ ఎలిమినేట్ కాబోతోందట.

ఈ మేరకు లీకులు అందుతున్నాయి. ఉమా దేవీ ఎలిమినేట్ అయిందంటూ వార్తలు చక్కర్లు కొడుతున్నాయి. శనివారం నాటి ఎపిసోడ్‌లో ప్రియాంక, లోబో, యానీ మాస్టర్ సేఫ్ అయినట్టు నాగార్జున ప్రకటించారు. ఇక ఆదివారం నాడు మిగిలిన ప్రాసెస్‌ను పూర్తి చేయబోతోన్నారు. ఉమాదేవీకి బూతుల ఎఫెక్ట్ బాగానే పడింది. నిన్నటి ఎపిసోడ్‌లో నాగార్జున ముందు.. బూతులు మాట్లాడినందుకు క్షమించమని, గుంజిళ్లు తీసింది ఉమాదేవీ. కానీ అది చాలా ఆలస్యమైంది. మొత్తానికి ఉమాదేవీ మీద వేటు పడింది.

 

Umadevi Fires On Anee Master In Bigg Boss 5 Telugu

Umadevi Fires On Anee Master In Bigg Boss 5 Telugu

Cinema Desk

No bio available for this author.

  1. "Jabardasth : చంటికి రావాల్సిన ఆఫర్లు భాస్కర్ కొట్టేస్తున్నాడా?.. నూకరాజు షాకింగ్ కౌంటర్!"

  2. "Women on Bikes : మహిళలు బైక్‌పై రెండు కాళ్లు ఒకే వైపు ఎందుకు పెడతారు? దీని వెనుక ఆసక్తికర చరిత్ర!"

  3. "Annadata Sukhibhava PM Kisan : ఏపీ రైతులకు డబుల్ ధమాకా.. అకౌంట్‌లోకి ఒకేసారి రూ.6 వేలు..!"

  4. "Sai Pallavi : కాబోయే భర్తలో ఆ ఒక్క లక్షణం ఉండాల్సిందే.. జీవిత భాగస్వామిపై సాయిపల్లవి ఆసక్తికర కామెంట్స్..!"

  5. "AP Weather Alert : ఏపీకి మరో వాన గండం.. అండమాన్‌లో అల్పపీడనం, భారీ వర్షాలకు ఛాన్స్!"

  6. "Konda Surekha KTR : బిగ్ బ్రేకింగ్‌.. కేటీఆర్‌కు సారీ చెప్పిన కొండా సురేఖ.. తెలంగాణ రాజకీయాల్లో బిగ్ ట్విస్ట్!"

  7. "Cyclone Landfall : తుపాను తీరం దాటడం అంటే ఏంటి? భూమిపైకి వచ్చాక ఏం జరుగుతుంది?"

Google The Telugu News మీకు నచ్చిన సైటుగా ఎంచుకోండి
WhatsApp