RRR Movie : పేప‌ర్స్ విసిరేస్తూ RRR Movie థియేర‌ట్స్‌లో ర‌చ్చ చేసిన ఉపాస‌న‌.. మూవీని మ‌స్త్ ఎంజాయ్ చేసిన‌ట్టుందే.. వీడియో !

Authored By Sam C | The Telugu News | Published on: March 25, 2022, 10:00 am

RRR Movie : దేశ వ్యాప్తంగా ఆర్ఆర్ఆర్ RRR Movie రచ్చ మొదలైంది. ఇన్నాళ్ల ఎదురు చూపుల‌కి పులిస్టాప్ ప‌డింది. ఆర్ఆర్ఆర్ సినిమా ఎట్ట‌కేల‌కు ప్రేక్ష‌కుల ముందుకు వ‌చ్చింది. చరిత్రలో ఎన్నడు కలవని ఇద్దరూ వీరలను మొదటిసారి వెండితెరపై స్నేహితులుగా చూపించబోతున్నాడు జక్కన్న.. ఇప్పటికే ఈ సినిమా విడుదల కావాల్సి ఉండగా.. కరోనా కారణంగా వాయిదా పడిన సంగతి తెలిసిందే. గ‌త కొద్ది రోజులుగా ఆర్ఆర్ఆర్ సినిమాకి సంబంధించి విదేశాల్లోనూ చరణ్, ఎన్టీఆర్ ఫ్యాన్స్ రచ్చ చేస్తున్నారు. ఆర్ఆర్ఆర్ సినిమా కోసం తాము ఎంతగా ఎదురుచూస్తున్నారో చెప్పకనే చెబుతున్నారు.కెనడాలో కార్లతో కలిసి ఆర్ఆర్ఆర్ అని.. ఎన్టీఆర్ అంటూ డిజైన్ చేసిన సంగతి తెలిసిందే.

ఇందుకు సంబంధించిన వీడియో నెట్టింట్లో చక్కర్లు కొట్టింది. అమెరికాకు చెందిన యంగ్ టైగర్ ఫ్యాన్స్ ఓ చిన్నపాటి విమానంకు బ్యానర్ కట్టి ఆకాశంలో ఎగరవేశారు. దానిపై తొక్కుకుంటూ పోవాలే.. జై ఎన్టీఆర్ అంటూ పెద్ద పెద్ధ అక్షరాలతో రాసి ఆకాశంలో ప్రదర్శించారు. రామ్ చ‌ర‌ణ్ ఫ్యాన్స్ కూడా తమ అభిమానాన్ని ప‌లు ర‌కాలుగా ప్ర‌ద‌ర్శించారు. అయితే ఈ రోజు రామ్ చరణ్, రాజమౌళిలు భ్రమరాంబ థియేటర్లో మెగా ఫ్యామిలీ, అభిమానులతో కలిసి సినిమా చూశారు.బెనిఫిట్ షో తెల్లవారు జామున మూడు గంటలకి మొదలైంది. రాజమౌళి, ఆయన కుటుంబ సభ్యులు, రామ్ చరణ్, వరుణ్ తేజ్, అల్లు శిరీష్, మరికొంతమంది మెగా ఫ్యామిలీలు కలిసి ఈ బెనిఫిట్ షో చూశారు.

upasana enjoyed ram charan RRR movie

upasana enjoyed ram charan RRR movie

RRR Movie : ఉపాస‌న హంగామా మాములుగా లేదుగా..

రాజమౌళి, రామ్ చరణ్ లు థియేటర్ కి బెనిఫిట్ షోకి రావడంతో అభిమానులు ఈలలు, అరుపులతో హంగామా చేశారు. మంచి మంచి సీన్స్, పాటలు వ‌స్తున్న స‌మ‌యంలో పేప‌ర్స్ విసిరారు. ఉపాస‌న కూడా పేప‌ర్లు ఎగ‌రేస్తూ నానా ర‌చ్చ చేసింది. ఆర్ఆర్ఆర్ సినిమాని బాగా ఎంజాయ్ చేసిన‌ట్టు తెలుస్తుంది. ప్ర‌స్తుతం ఉపాస‌న upasana ఎంజాయ్‌మెంట్‌కి సంబంధించిన వీడియో నెట్టింట వైర‌ల్ అవుతుంది.డైరెక్టర్ రాజమౌళి అత్యంత ప్రతిష్టాత్మకంగా తెరకెక్కించిన ఈ సినిమాలో బాలీవుడ్ బ్యూటీ అలియా భట్.. హాలీవుడ్ బ్యూటీ ఒలివియా మోరీస్ .. అక్షయ్ కుమార్.. శ్రియా శరణ్ కీలకపాత్రలలో నటించారు. ఈ చిత్రాన్ని భారీ బడ్జె్ట్‏తో డీవీవీ బ్యానర్ పై దానయ్య నిర్మిస్తున్నారు.

Sam C

No bio available for this author.

Google The Telugu News మీకు నచ్చిన సైటుగా ఎంచుకోండి
WhatsApp