Nayanthara : నయనతార చేసిన అతి పెద్ద తప్పునే చేయబోతున్న మెగా కోడలు ఉపాసన..!

Authored By Prahbas Gilakathula | The Telugu News | Published on: December 15, 2022, 10:00 am

Nayanthara : ప్రస్తుతం సోషల్ మీడియాలో ఒక వార్త బాగా ట్రెండ్ అవుతుంది. మెగా కోడలు ఉపాసన ప్రెగ్నెంట్ అంటూ చిరంజీవి అధికారికంగా ప్రకటించారు. పదేళ్లుగా ఈ వార్త కోసం ఎదురు చూస్తున్న మెగా అభిమానులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. త్వరలోనే ఇండస్ట్రీకి మెగాస్టార్ లాంటి టాలెంట్ ఉన్న హీరో వస్తున్నాడని ఆనందపడుతున్న తరుణంలో ఒక్కసారిగా అభిమానుల ఆశలు తలకిందులు అయ్యాయి. రామ్ చరణ్, ఉపాసన త్వరలోనే తల్లిదండ్రులు కాబోతున్నారు.

అయితే ఉపాసన నాచురల్ గా గర్భం దాల్చలేదని, సరోగసి ద్వారా పిల్లలను కనబోతుందని సోషల్ మీడియాలో వార్తలు వస్తున్నాయి. దీనికి గల కారణం చిరంజీవి ఉపాసన ప్రెగ్నెంట్ అంటూ చెప్పిన కొన్ని నిమిషాల ముందే ఆమె కార్ రేసింగ్ దగ్గర ఉన్న విజువల్స్ సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. ఈ క్రమంలో ఉపాసన ప్రెగ్నెంట్ అయితే ఆమె అత్త మామలు ఆమెను అలా వదిలేయరు. ఎంత జాగ్రత్తగా ఉన్నా మొదటిసారి కాబట్టి జాగ్రత్తగా ఉండాలి. మరి ఉపాసన అంతా ఫ్రీగా ఉండడం ఏంటి అని సందేహాలు వ్యక్తం అవుతున్నాయి.

upasana follow the Nayanthara surrogacy process

upasana follow the Nayanthara surrogacy process

అయితే సెలబ్రిటీస్ అందరూ ఇప్పుడు ఎక్కువగా సరోగసి ద్వారానే పిల్లలను కంటున్నారు. అయితే ఉపాసన కూడా సరోగసి ద్వారానే పిల్లలు కనడానికి ఆసక్తి చూపుతుందని వార్తలు వస్తున్నాయి. అయితే ఈ వార్త నిజమో కాదో తెలియాలంటే మెగా ఫ్యామిలీ నుంచి రెస్పాండ్ రావాల్సి ఉంది. రామ్ చరణ్ గాని చిరంజీవి గాని ఇది ఫేక్ న్యూస్ అని చెబితే గాని ఈ వార్త బయటపడదు. ఏది ఏమైనా ఉపాసన ప్రెగ్నెంట్ అయితే ఒక బాధ, ప్రెగ్నెంట్ కాకపోతే మరొక బాధ. ఏమవుతుంది ఏమో కానీ అభిమానులు మాత్రం మెగా వారసుడు రాక కోసం ఎదురుచూస్తున్నారు.

Prahbas Gilakathula

Prabhas Gilakathula Content Writer experiened in Digital media field. Iam worked in various Telugu media for about 5 years. Worked in Namasthe Telangana, Telugu Rajyam , as a telugu content writer. I wrote various Latest Breaking News , politics, interesting stories, Andhr Pradesh & Telangana local news, health, technology, entertainment , Devotional, etc. He is also Social Media Expert, Technical Expert . He is present content writer of thetelugunews.com website. Contact details: Prabhas29nov@gmail.com

Google The Telugu News మీకు నచ్చిన సైటుగా ఎంచుకోండి
WhatsApp