Upasana konidela : త్వరలోనే పాన్ ఇండియా హీరో రామ్ చరణ్ , ఉపాసన దంపతులు తల్లిదండ్రులు కాబోతున్నారు. మనకు తెలిసిందే వీరిద్దరికీ పెళ్లి అయ్యి దాదాపుగా పదేళ్లు అవుతుంది. చాలా ఆలస్యంగా వీరు తల్లిదండ్రులు కాబోతున్నారు. మెగా ఫ్యామిలీలో మరోతరం రాబోతుండడంతో మెగా అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఈ క్రమంలోనే ఉపాసన తన బిడ్డ ఆరోగ్యం గురించి కీలక నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తుంది. పుట్టబోయే బిడ్డ కోసం రామ్ చరణ్ ఉపాసన చాలా జాగ్రత్తలు తీసుకుంటున్నారు.
అంతేకాకుండా బేబీ కార్డ్ బ్లడ్ బ్యాంక్ పట్ల ప్రత్యేక శ్రద్ధ చూపిస్తున్నట్లు తెలుస్తోంది. భవిష్యత్తులో బేబీతో పాటు ఫ్యామిలీ ఆరోగ్యం కోసమే అత్యాధునిక పద్ధతిలో స్టెమ్ సెల్ బ్యాంకింగ్ విధానం ఎంచుకున్నట్లు తన సోషల్ మీడియా ఖాతా వేదికగా ఉపాసన తెలిపింది. అయితే స్టెమ్ సెల్ బ్యాంకింగ్ అంటే బొడ్డుతాడు దాచుకోవడం. భవిష్యత్తులో బిడ్డకు ఏవైనా అనారోగ్య సమస్యలు వస్తే దీని ద్వారా నయం చేసుకోవచ్చు. దీని గురించి చాలామందికి పెద్దగా తెలియదు. పిల్లలు పుట్టినప్పుడు బొడ్డు తాడు దాచుకుంటే పెద్దయ్యాక వాళ్ళకది ఉపయోగపడుతుంది. దీనిని అనేక రకాల చికిత్సల కోసం వినియోగిస్తారు.
గతంలో మహేష్ బాబు భార్య నమ్రత కూడా ఈ విషయం గురించి మాట్లాడారు. వారి పిల్లల స్టెమ్ సెల్స్ దాచినట్లు గతంలో ఆమె తెలిపారు. తమ పిల్లలిద్దరి విషయంలో ఈ జాగ్రత్తలు తీసుకున్నట్లు వెల్లడించింది. ప్రస్తుత ఉపాసన అపోలో హాస్పిటల్ పనుల్లో బిజీగా ఉంది. ఇక రాంచరణ్ సినిమాలు చేస్తే బిజీగా గడుపుతున్నాడు. ప్రస్తుతం శంకర్ దర్శకత్వంలో ‘ గేమ్ ఛేంజర్ ‘ సినిమాలో నటిస్తున్నాడు. ఈ సినిమాలో హీరోయిన్గా కీయారా అద్వానీ నటిస్తోంది. ఈ సినిమాను వచ్చే ఏడాది సంక్రాంతికి రిలీజ్ చేసే ప్లాన్ చేస్తున్నారు. ప్రస్తుతం ఏ సినిమా షూటింగ్ శరవేగంగా జరుగుతుంది.
Passports : పాస్‌పోర్ట్ అత్యంత ముఖ్యమైన ప్రయాణ పత్రాలలో ఒకటి. అంతర్జాతీయ ప్రయాణాన్ని ధృవీకరించడమే కాకుండా, పాస్‌పోర్ట్ గుర్తింపు మరియు…
Mahakumbh Mela : ఉత్తరప్రదేశ్‌లోని ప్రయాగ్‌రాజ్ మహాకుంభమేళా 2025 ఉత్సవాలకు సిద్ధమవుతుంది. 13 జనవరి 2025న ప్రయాగ్‌రాజ్‌లో కుంభమేళా నిర్వహించబడుతుంది.…
Ola Electric : ప్రభుత్వ విచారణ మరియు పెరుగుతున్న నష్టాల మధ్య వివాదాల్లో కూరుకుపోయిన ఓలా ఎలక్ట్రిక్ పునర్వ్యవస్థీకరణలో భాగంగా…
YSR Congress Party : ఆంధ్రప్రదేశ్ పంపిణీ కంపెనీలు (డిస్కమ్‌లు) మరియు అదానీ గ్రూప్ మధ్య ప్రత్యక్ష ఒప్పందం లేదని…
Hair Tips : ప్రస్తుత కాలంలో చాలామందికి జుట్టు చివరలు చిట్లిపోయి నిర్జీవంగా మారిపోతాయి. దీంతో వెంట్రుకలు అనేవి ఊడిపోతూ…
Bigg Boss Telugu 8 : బిగ్ బాస్ సీజన్ 8 చివరి దశకు రానే వచ్చింది. మూడు వారాలలో…
Winter : చలికాలం రానే వచ్చేసింది. రోజురోజుకి చెల్లి ముదిరిపోతుంది. ఈసారి నవంబర్ నెలలోనే చలి మొదలైంది. ఇక ముందు ముందు…
Ind Vs Aus : సొంత గడ్డపై న్యూజిలాండ్ టీం అద్భుతంగా రాణించి భారత జట్టుని వైట్ వాష్ చేసింది.…
This website uses cookies.