Upasana Konidela : యాంకర్ అడిగిన ప్రశ్నలకు సీరియస్ అయిన ఉపాసన కొణిదెల.. !
Upasana Konidela : మెగాస్టార్ చిరంజీవి కోడలుగా, రామ్ చరణ్ భార్యగా, అపోలో ఆసుపత్రి అధినేత ప్రతాప్ రెడ్డి మనవరాలుగా గానే కాకుండా ఉపాసన తన సేవల ద్వారా అలానే తన ఫ్యాషన్స్ ద్వారా సోషల్ మీడియాలో తనకంటూ ప్రత్యేక ఫ్యాన్ ఫాలోయింగ్ సంపాదించుకున్నారు. ప్రస్తుతం ఉపాసన అపోలో బాధ్యతలు కూడా చూసుకుంటున్నారు. నిత్యం సోషల్ మీడియాలో యాక్టివ్గా ఉంటూ ఎన్నో విషయాలను అభిమానులతో పంచుకుంటూ ఉంటారు. ఇక తాజాగా అపోలో గ్రూప్ అధినేత, తన తాత ప్రతాప్ సి. రెడ్డి పుట్టినరోజు సందర్భంగా ది అపోలో స్టోరీ కామిక్ బుక్ ను ఆమె ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఇచ్చిన ప్రత్యేక ఇంటర్వ్యూలో తన వ్యక్తిగత, వైవాహిక జీవితం గురించి, కొణిదెల, కామినేని కుటుంబాల గురించి, సినిమాల గురించి ఆసక్తికర విషయాలు పంచుకున్నారు.
తన తాత, అమ్మమ్మే స్ఫూర్తి అని ఉపాసన తెలిపారు. వారి నుంచి చాలా విషయాలు నేర్చుకున్నట్లు ఆమె తెలిపారు. ఆర్ఆర్ఆర్ సినిమా ఆస్కార్ వేడుకల్లో పాల్గొనడం జీవితంలో మర్చిపోలేని అనుభూతి అని ఉపాసన వివరించారు. ఇక ఇదే ఇంటర్వ్యూలో యాంకర్ క్లీన్ కారా గురించి కూడా అడిగారు. అమ్మాయిలు నాన్న కూచీ అంటారు. అది మీ పాప విషయంలో నిజమేనా అని అడుగుతుంది. దానికి ఉపాసన సమాధానం ఇస్తూ అది పక్కా నిజమైన స్టేట్మెంట్ అంటూ చెప్పుకొచ్చారు. అంతేకాదు తాను చాలా జలసీగా ఉన్నాను అని తెలియజేసింది. చరణ్ కనిపిస్తే చాలు క్లీన్ కారా కళ్ళల్లో స్పార్క్ వస్తుంది. మొహంలో నవ్వు వస్తుంది. నాకు అదంతా చూస్తే జలసీగా ఉంటుంది అని తమాషాగా రామ్ చరణ్ క్లీన్ కారకు మధ్య ఉండే ప్రేమ గురించి ఉపాసన చెప్పుకొచ్చారు.
ఇక పెళ్లి అయి పదేళ్ల తర్వాత రామ్ చరణ్ ఉపాసన దంపతులు తల్లిదండ్రులు అయ్యారు. అందరూ తల్లి కావడం గ్రేట్ అనుకుంటారు. నేను మాత్రం డబుల్ గ్రేట్ అని ఫీల్ అవుతున్నా. ఇంకా ఎప్పుడు బిడ్డకు జన్మనిస్తారు లాంటి మాటలు నా వరకు వచ్చాయి. ఏమైనా సమస్య ఉందా అని కూడా మాట్లాడుకున్నారు. అయితే మేము అన్ని విధాల సిద్ధంగా ఉన్నప్పుడే బిడ్డని కనాలని అనుకున్నాం. అందుకే ఇన్నేళ్లు పట్టింది అని ఉపాసన చెప్పుకొచ్చారు. ఇక రాంచరణ్ ఎప్పుడూ కూడా ప్రేమలో పడకు, ప్రేమలో ఎదుగుదామని అంటుంటాడు. అలానే మేము ఒకరినొకరు సపోర్ట్ చేసుకుంటాం, గౌరవించుకుంటాం. మా ఇద్దరి మధ్య హద్దులు కూడా ఉంటాయి. కెరీర్ విషయంలో ఒకరి దానిలో మరొకరం కల్పించుకోము. కానీ వ్యక్తిగత విషయాలకి వచ్చేసరికి మాత్రం ఒక్కటిగా ఉంటామని ఉపాసన చెప్పుకొచ్చారు.