Urvashi Rautela Comments On Rishabh Pant
Urvashi Rautela : రిషబ్ పంత్.. ఊర్వశి రౌతెలా వ్యవహారం ఇప్పుడు చర్చనీయాంశంగా మారిన విషయం తెలిసిందే. వీరిద్దరి మధ్య సోషల్ మీడియాలో చిన్నపాటి వార్ నడుస్తోన్న విషయం తెలిసిందే. ఊర్వశి తాజాగా ఓ ఇంటర్వ్యూలో పేరు చెప్పుకుండా ఆర్‌పీ అని సంబోధిస్తూ.. తన ప్రేమ ఎక్కడ చెడిందనే విషయాన్ని చెప్పారు. దానికి ఇన్‌స్టాగ్రామ్ వేదికగా ఊర్వశి పేరు ప్రస్తావించకుండా.. ఫేమ్, పాపులారిటీ కోసం ఇన్ని పచ్చి అబద్దాలు ఆడుతారా అని పంత్ ఫైర్ అయ్యాడు. అందుకు బదులుగా ‘చిన్న తమ్ముడు.. పోయి బ్యాట్ బాల్ ఆడుకో’ అంటూ పంత్‌కు ఊర్వశి స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చారు.
‘చోటు భయ్యా బ్యాట్ బాల్ తో ఆడుకోవాలి. నీలాంటి పిల్లాడి విషయంలో నేనేమీ మున్నీని కాదు.. చెడ్డ పేరు తెచ్చుకోడానికి.. రక్షా బంధన్ శుభాకాంక్షలు ఆర్పీ చోటు భయ్యా’ అని పోస్టు పెట్టింది. మౌనంగా ఉన్న అమ్మాయి విషయంలో అడ్వాంటేజ్ తీసుకోవద్దని ఊర్వశి సూచించింది. అయితే అభిమానులు మాత్రం మొదట రిషబ్ పంత్ నీ గురించి ప్రస్తావించకపోయినా ఇంటర్వ్యూలో నువ్వే చాలాసార్లు ఆర్పీ.. ఆర్పీ అంటూ కలవరించావని కౌంటర్లు ఇచ్చారు. ఊర్వశి రౌతేలా నటించిన ది లెజెండ్ సినిమా ఇటీవలే విడుదల అయింది.
Urvashi Rautela Comments On Rishabh Pant
అంతకముందు ఊర్వశి మాట్లాడుతూ.. ‘వారణాసిలో ఓ సినిమా షూటింగ్ చేసి న్యూ ఢిల్లీకి వెళ్లి ఓ షోలో పాల్గొన్నా. అక్కడ రోజంతా షూటింగ్ చేసి తర్వాతి రోజు ఫ్లైట్ ఎక్కి వారణాసి వెళ్లా. అప్పుడు నన్ను కలవడానికి మిస్టర్ ఆర్‌పీ వచ్చాడు. నేను ఉంటున్న హోటల్‌కు వచ్చి లాబీలో వెయిట్ చేశాడు. ఆర్‌పీ వచ్చిన 10 నిమిషాల ముందే నేను హోటల్‌కు వచ్చి పడుకున్నా. షూటింగ్ కారణంగా అసలిపోయి బాగా నిద్రపోయా. గాఢ నిద్రలో ఉన్న నాకు ఫోన్ రింగ్ కూడా వినిపించలేదు. లేచి చూసేసరికి మిస్టర్ ఆర్‌పీ నుంచి 17 మిస్డ్ కాల్స్ వచ్చాయి. నేను చాలా ఫీల్ అయ్యా’ అని అన్నారు. దానికి రిషబ్ పంత్ ఘాటుగ స్పందించాడు. ఇప్పుడు రిషబ్ కామెంట్స్‌కి ఊర్వశి తనదైన శైలిలో స్పందించడం హాట్ టాపిక్‌గా మారింది.
Guvvala Balaraju : తెలంగాణ రాజకీయాల్లో మరో కీలక పరిణామం చోటుచేసుకుంది. బీఆర్ఎస్ పార్టీని వీడిన అచ్చంపేట మాజీ ఎమ్మెల్యే…
Zodiac Signs : జ్యోతిష్య శాస్త్రంలో ప్రతి గ్రహం ఒక ప్రత్యేక స్థానం కలిగి ఉంటుంది. వాటిలో సూర్యుడు అతి…
Coconut Oil : కొబ్బరి నూనె... మన వంటగదిలో అందుబాటులో ఉండే అత్యంత సాధారణమైన వస్తువు. కానీ దీని ఉపయోగాలు…
Gym : ఇప్పుడు ఆరోగ్యంపై శ్రద్ధ పెరిగిన తరుణంలో వ్యాయామం ప్రతి ఒక్కరి జీవనశైలిలో భాగమవుతోంది. కానీ, వర్కౌట్ చేస్తూ…
Onions Black Spots : ఉల్లిపాయలపై కనిపించే నల్లటి మచ్చలు చాలామందిని ఆందోళనకు గురి చేస్తుంటాయి. అయితే ఈ మచ్చలు…
Smartphone : దేశీయ మొబైల్ తయారీ సంస్థ లావా తాజాగా మరో అద్భుతమైన స్మార్ట్‌ఫోన్‌ను మార్కెట్లోకి తీసుకురావడానికి సిద్ధమవుతోంది. ఇప్పటికే…
Tea BP : టీ అంటే చాలా మందికి ఎంతో ఇష్టం. రోజులో ఒక్క కప్పు టీ లేకుండా చాలామందికి…
Varalakshmi Vratham : వరలక్ష్మీ వ్రతం .. సౌభాగ్యదాయినీ లక్ష్మీదేవిని LAkshmi Devi పూజించే పవిత్రమైన రోజు. ఈ రోజు…
This website uses cookies.