Urvashi Rautela : హీరోయిన్‌తో వివాదం.. పిల్ల బ‌చ్చావి అంటూ రిష‌బ్‌పై గ‌రం అయిన ఊర్వ‌శి

Authored By Sam C | The Telugu News | Published on: August 12, 2022, 6:40 pm

Urvashi Rautela : రిష‌బ్ పంత్‌.. ఊర్వ‌శి రౌతెలా వ్య‌వ‌హారం ఇప్పుడు చ‌ర్చ‌నీయాంశంగా మారిన విష‌యం తెలిసిందే. వీరిద్ద‌రి మధ్య సోషల్ మీడియాలో చిన్నపాటి వార్ నడుస్తోన్న విషయం తెలిసిందే. ఊర్వశి తాజాగా ఓ ఇంటర్వ్యూలో పేరు చెప్పుకుండా ఆర్‌పీ అని సంబోధిస్తూ.. తన ప్రేమ ఎక్కడ చెడిందనే విషయాన్ని చెప్పారు. దానికి ఇన్‌స్టాగ్రామ్ వేదికగా ఊర్వశి పేరు ప్రస్తావించకుండా.. ఫేమ్, పాపులారిటీ కోసం ఇన్ని పచ్చి అబద్దాలు ఆడుతారా అని పంత్ ఫైర్ అయ్యాడు. అందుకు బదులుగా ‘చిన్న తమ్ముడు.. పోయి బ్యాట్ బాల్ ఆడుకో’ అంటూ పంత్‌కు ఊర్వశి స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చారు.

Urvashi Rautela : చోటా వార్..

‘చోటు భయ్యా బ్యాట్ బాల్ తో ఆడుకోవాలి. నీలాంటి పిల్లాడి విషయంలో నేనేమీ మున్నీని కాదు.. చెడ్డ పేరు తెచ్చుకోడానికి.. రక్షా బంధన్ శుభాకాంక్షలు ఆర్పీ చోటు భయ్యా’ అని పోస్టు పెట్టింది. మౌనంగా ఉన్న అమ్మాయి విషయంలో అడ్వాంటేజ్ తీసుకోవద్దని ఊర్వశి సూచించింది. అయితే అభిమానులు మాత్రం మొదట రిషబ్ పంత్ నీ గురించి ప్రస్తావించకపోయినా ఇంటర్వ్యూలో నువ్వే చాలాసార్లు ఆర్పీ.. ఆర్పీ అంటూ కలవరించావని కౌంటర్లు ఇచ్చారు. ఊర్వశి రౌతేలా నటించిన ది లెజెండ్ సినిమా ఇటీవలే విడుదల అయింది.

Urvashi Rautela Comments On Rishabh Pant

Urvashi Rautela Comments On Rishabh Pant

అంత‌క‌ముందు ఊర్వ‌శి మాట్లాడుతూ.. ‘వారణాసిలో ఓ సినిమా షూటింగ్‌ చేసి న్యూ ఢిల్లీకి వెళ్లి ఓ షోలో పాల్గొన్నా. అక్కడ రోజంతా షూటింగ్‌ చేసి తర్వాతి రోజు ఫ్లైట్ ఎక్కి వారణాసి వెళ్లా. అప్పుడు నన్ను కలవడానికి మిస్టర్ ఆర్‌పీ వచ్చాడు. నేను ఉంటున్న హోటల్‌కు వచ్చి లాబీలో వెయిట్ చేశాడు. ఆర్‌పీ వచ్చిన 10 నిమిషాల ముందే నేను హోటల్‌కు వచ్చి పడుకున్నా. షూటింగ్ కారణంగా అసలిపోయి బాగా నిద్రపోయా. గాఢ నిద్రలో ఉన్న నాకు ఫోన్ రింగ్ కూడా వినిపించలేదు. లేచి చూసేసరికి మిస్టర్ ఆర్‌పీ నుంచి 17 మిస్డ్ కాల్స్ వచ్చాయి. నేను చాలా ఫీల్ అయ్యా’ అని అన్నారు. దానికి రిష‌బ్ పంత్ ఘాటుగ స్పందించాడు. ఇప్పుడు రిష‌బ్ కామెంట్స్‌కి ఊర్వ‌శి త‌న‌దైన శైలిలో స్పందించ‌డం హాట్ టాపిక్‌గా మారింది.

 

Sam C

No bio available for this author.

  1. "Tirumala Darshan : ₹300 టికెట్ మాత్రమే కాదు.. శ్రీవారి దర్శనానికి ఇన్ని మార్గాలున్నాయా?"

  2. "Fruits Myths : రాత్రి పండ్లు తింటే హానా?.. స్మూతీలో ఫైబర్ పోతుందా?"

  3. "Saara Palekar : ‘డోంట్ ట్రబుల్ ది ట్రబుల్’లో స్పెషల్ అట్రాక్షన్ ఈ పాపే.. సారా పాలేకర్ ఎవరో తెలుసా?"

  4. "Shubman Gill : గిల్ డబుల్ సెంచరీ.. 406 పరుగులు ఛేజ్ చేసి సిరీస్ గెలిచిన భారత్..!"

  5. "Jr NTR Dragon : ఫౌజీ చేసిన పెద్ద తప్పును ‘డ్రాగన్’ టీమ్ రిపీట్ చేస్తుందా? ఎన్టీఆర్ ఫ్యాన్స్‌లో మొదలైన గుబులు..!"

  6. "Nabha Natesh : సముద్రం మధ్యలో నభా నటేష్ స్టన్నింగ్ లుక్.. వైరల్ అవుతున్న వెకేషన్ పిక్స్"

  7. "Perni Nani : మచిలీపట్నంలో పేర్ని నానికి తీవ్ర నిరసన సెగ.. సొంత పార్టీ కేడరే తిరగబడటంతో టెన్షన్!"

Google The Telugu News మీకు నచ్చిన సైటుగా ఎంచుకోండి
WhatsApp