Urvashi Rautela : ఉత్త‌రాఖండ్‌లో నా పేరుతో గుడి ఉంది.. ద‌క్షిణాదిలోను నాకు గుడి క‌ట్టాలి : ఊర్వ‌శి | The Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు

Urvashi Rautela : ఉత్త‌రాఖండ్‌లో నా పేరుతో గుడి ఉంది.. ద‌క్షిణాదిలోను నాకు గుడి క‌ట్టాలి : ఊర్వ‌శి

 Authored By ramu | The Telugu News | Updated on :18 April 2025,2:00 pm

ప్రధానాంశాలు:

  •  Urvashi Rautela : ఉత్త‌రాఖండ్‌లో నా పేరుతో గుడి ఉంది.. ద‌క్షిణాదిలోను నాకు గుడి క‌ట్టాలి : ఊర్వ‌శి

Urvashi Rautela : బాలీవుడ్ నటి ఊర్వశీ రౌతేలా వింత కోరిక‌ల‌తో వార్త‌ల‌లో నిలుస్తూ ఉంటుంది. ఉత్తరాఖండ్​లో తన పేరు మీద ఆలయం ఉందని తాజాగా ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో చెప్పారు. అంతేకాదు దక్షిణాదిలోనూ తన కోసం ఓ గుడి కట్టాలని ఆకాంక్షించారు. దీనితో ఆమె వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్‌ అయ్యాయి. అమ్మడి చిలిపి కోరికపై నెటిజన్‌లు సరదాగా కామెంట్స్‌ పెడుతున్నారు.

Urvashi Rautela ఉత్త‌రాఖండ్‌లో నా పేరుతో గుడి ఉంది ద‌క్షిణాదిలోను నాకు గుడి క‌ట్టాలి ఊర్వ‌శి

Urvashi Rautela : ఉత్త‌రాఖండ్‌లో నా పేరుతో గుడి ఉంది.. ద‌క్షిణాదిలోను నాకు గుడి క‌ట్టాలి : ఊర్వ‌శి

Urvashi Rautela : నా పేరుతో గుడి..

ఇటీవల ‘డాకు మహారాజ్’ సినిమాతో నవ్వులపాలైన ఈ నటి, ఇప్పుడు నమ్మశక్యం కాని మరో వాదనను తెరపైకి తెచ్చింది. సన్నీ డియోల్, రణదీప్ హుడా నటించిన ‘జాట్’ సినిమాలో ఒక ఐటమ్ సాంగ్ చేసిన ఊర్వశి, తాజాగా తన పేరుతో ఉత్తరాఖండ్‌లో ఒక గుడి ఉందని, ఇప్పుడు దక్షిణ భారతదేశంలో కూడా తన పేరుతో ఒక గుడిని నిర్మించాలని అని అన‌డం విమ‌ర్శ‌ల పాలైంది.

బద్రీనాథ్‌కు ఎవరైనా వెళితే, పక్కనే ఉన్న నా గుడిని చూడండి. అక్కడి వెళ్లి సందర్శించండి. దిల్లీ యూనివర్సిటీలోనూ నా ఫొటోలకు పూలమాలలు వేసి పూజిస్తారు. నన్ను ‘దండమమాయి’ అని పిలుస్తారు కూడా. ఈ విషయం తెలిసిన తరువాత నేను చాలా ఆశ్చర్యపోయాను. కానీ ఇది నిజం. దీనిపై చాలా వార్తా కథనాలు కూడా ఉన్నాయి. కావాలంటే మీరంతా వార్తా కథనాలను చదవచ్చు అని ఊర్వ‌శి పేర్కొంది. ఇక్క‌డ మెగాస్టార్​ చిరంజీవి, పవర్​స్టార్​ పవన్‌ కల్యాణ్‌, నటరత్న బాలకృష్ణలతో కలిసి నటించాను. దక్షిణాదిలో కూడా నాకు ఎంతోమంది అభిమానులు ఉన్నారు. అందుకే దక్షిణ భారతదేశంలోనూ నా కోసం ఓ ఆలయాన్ని నిర్మించాలని ఆశిస్తున్నా అని ఊర్వ‌శి అన్నారు.

ramu

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది