Vadinamma 16 Nov Today Episode : రిషి కన్నతల్లి శైలూ కాదు సీతక్క.. అని భరత్ కు చెప్పిన సిరి.. దీంతో భరత్ ఏ నిర్ణయం తీసుకున్నాడు? తన కూతురును వాళ్లకు దత్తత ఇస్తాడా? ఇవ్వడా? | The Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు

Vadinamma 16 Nov Today Episode : రిషి కన్నతల్లి శైలూ కాదు సీతక్క.. అని భరత్ కు చెప్పిన సిరి.. దీంతో భరత్ ఏ నిర్ణయం తీసుకున్నాడు? తన కూతురును వాళ్లకు దత్తత ఇస్తాడా? ఇవ్వడా?

 Authored By gatla | The Telugu News | Updated on :16 November 2021,1:40 pm

Vadinamma 16 Nov Today Episode : వదినమ్మ సీరియల్ లేటెస్ట్ ఎపిసోడ్ తాజాగా విడుదలైంది. ఈరోజు 16 నవంబర్ 2021, మంగళవారం 701 ఎపిసోడ్ హైలైట్స్ ఏంటో ఇప్పుడు చూద్దాం. లక్ష్మణ్ చేసిన నిర్వాకాన్ని భరత్.. సీతకు చెబుతాడు. దీంతో సీత కూడా బాధపడుతుంది. రఘురామ్ ను అందరూ తిడుతుండటం చూసి భరత్ తట్టుకోలేడు. అయినా.. పెద్దన్నయ్య నోరు తెరిచి ఒక్క మాట అయినా అన్నారా అంటే.. తన వైపు తప్పు ఉంది కాబట్టి ఆయన నోరు తెరవడం లేదు. అయినా మేం ఏం తప్పు చేశాం. మమ్మల్ని ఎందుకు తప్పు పడుతున్నారు.. అంటూ చెబుతుంది శైలూ.

vadinamma 16 november 2021 full episode

vadinamma 16 november 2021 full episode

ఒప్పుకుంటానురా.. నువ్వు చెప్పింది నిజమే. మాకంటే.. రఘురామ్ అన్నయ్య, సీత వదిన మీద నీకే ప్రేమ ఉంది. అది నిరూపించుకో. నీ కూతురునే వాళ్లకు దత్తత ఇవ్వొచ్చు కదా. నీ బిడ్డనే దత్తత ఇవ్వు. నీ ప్రేమను నిరూపించుకో అంటాడు లక్ష్మణ్. దీంతో అందరూ షాక్ అవుతారు. సిరి కూడా షాక్ అవుతుంది. దీంతో మేము ఇప్పుడు ఎవరి బిడ్డను దత్తత తీసుకునే ఆలోచనలో లేము. అందరూ కాస్త సైలెంట్ గా ఉండండి.. అని చెబుతాడు రఘురామ్. ఈ గొడవ అంతటికీ కారణం.. నేను, నా ప్రవర్తన.. అమ్మ శైలూ.. ఏదో ఆరాటంలో తెలియకుండా నేనే నిన్ను బాధపెట్టాను.. భయపెట్టాను.. తప్పే క్షమించు.. అని రఘురామ్.. శైలూను వేడుకుంటాడు.

మొన్ననే మా పెళ్లి రోజును ఘనంగా చేశారు. ఇంకా ఆ తీపి గుర్తులు నా మదిలో ఉన్నాయి. నేను కోరుకున్నది ఒక్కటే.. ఆరోజు మీరు ఎలా సంతోషంగా ఉన్నారో.. ఎప్పుడూ మీరు అలాగే ఉండాలి. మీరంతా మా బిడ్డలు.. ఎందుకో.. ఆరోజు ఎమోషన్ లో నా బిడ్డను తలుచుకొని బాధపడ్డాను.. మిమ్మల్ని బాధపెట్టాను.. అని ఎమోషనల్ అవుతాడు రఘురామ్.

నా తమ్ముళ్లు మారిపోయారు సీత.. అని రఘురామ్ సీతతో చెబుతాడు. నీ ముందు మాట్లాడటానికే భయపడే నీ తమ్ముళ్లు.. ఇప్పుడు నీ ముందే పోట్లాడుకుంటున్నారు అంటుంది సీత. ఏది ఏమైనా.. రిషి గురించి మాత్రం అస్సలు లక్ష్మణ్, శైలూకు తెలియకూడదు.. అంటాడు రఘురామ్.

Vadinamma 16 Nov Today Episode : మన బిడ్డను దత్తత ఇద్దామని సిరితో చెప్పిన భరత్

మరోవైపు సిరి, భరత్.. ఇద్దరూ మాట్లాడుకుంటారు. ఈ సమస్యకు పరిష్కారం కావాలంటే మనమే ఒక నిర్ణయం తీసుకోవాలి అంటాడు భరత్. వైదేహిని అన్నయ్య, వదినమ్మలకు దత్తత ఇద్దాం అంటాడు భరత్. ఇంతకుముందు అడిగినప్పుడు ఒప్పుకున్నావు.. ఇప్పుడు కూడా ఒప్పుకుంటావని అనుకుంటున్నా. శైలూ వదినకు మళ్లీ పిల్లలు పుట్టే అవకాశం లేదు.

కానీ.. మనకు పిల్లలు పుట్టే అవకాశం ఉంది కదా. వదినమ్మ, అన్నయ్య రుణం ఇలాగైనా తీర్చుకుందాం. నువ్వు కాదనకు. నీ మీద చాలా ఆశలు పెట్టుకున్నాను. నువ్వు తీసుకునే ఈ ఒక్క నిర్ణయం.. ఈ ఇంటిని ప్రశాంతంగా ఉంచుతుంది అంటాడు భరత్.

దీంతో అసలు నిజం చెప్పేస్తుంది సిరి. సీతక్క ముందే ఆ త్యాగం చేసిందని.. రిషి కన్నతల్లి శైలూ కాదు.. సీతక్క అని చెబుతుంది సిరి. దీంతో భరత్ షాక్ అవుతాడు. ఆ తర్వాత ఏం జరుగుతుందో తెలియాలంటే తరువాయిభాగంలో చూడాల్సిందే.

 

gatla

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది