Janaki Kalaganaledu 16 Nov Today Episode : జానకిని అడుగడుగునా పరీక్షిస్తున్న మైరావతి.. ఈసారి కఠిన పరీక్ష.. దీంట్లో జానకి పాస్ అవుతుందా? మైరావతి మనసు గెలుచుకుంటుందా?
Janaki Kalaganaledu 16 Nov Today Episode : జానకి కలగనలేదు సీరియల్ లేటెస్ట్ ఎపిసోడ్ తాజాగా విడుదలైంది. ఈరోజు 16 నవంబర్ 2021, మంగళవారం ఎపిసోడ్ 172 హైలైట్స్ ఏంటో ఇప్పుడు చూద్దాం. జానకి.. సుబ్బయ్య కూతురు సమస్యను పరిష్కరించి అందరి దృష్టిలో మంచిపేరే తెచ్చుకున్నా.. మైరావతికి ఈ విషయం తెలిస్తే ఏమౌతుందో అని జ్ఞానాంబ టెన్షన్ పడుతుంది. జానకి చేసిందాంట్లో తప్పేముంది.. జానకిని ఈ విషయంలో అమ్మ కూడా మెచ్చుకుంటుంది. నువ్వు ఇక దాని గురించి దిగులుపడకు అని జ్ఞానాంబకు ధైర్యం చెబుతాడు గోవిందరాజు.
కట్ చేస్తే తెల్లారుతుంది. ఊళ్లోని వాళ్లందరికీ చీరలు పంచుతుంది మైరావతి. జ్ఞానాంబ ఫ్యామిలీకి కూడా అందరూ నమస్కారం పెడతారు. రామయ్య.. మీ మొగుడు పెళ్లాలు మన ఊళ్లో వాళ్లకు బట్టలు పెట్టండి అంటుంది మైరావతి. దీంతో అదేంటి అమ్మమ్మ గారు పెద్దవాళ్లు మీ చేతుల మీదుగా ఇస్తే బాగుంటుంది కదా అంటుంది. దీంతో ఇదిగో పిల్లా.. నా మనవడి పెళ్లి అయ్యాక మొదటిసారి మీరు ఇక్కడికి వచ్చారు కాబట్టి.. ఊళ్లో వాళ్ల ఆశీర్వాదం ఉంటుందని పెట్టమన్నాను అంతే.. వెళ్లి కానీవ్వండి అంటుంది మైరావతి.
దీంతో రామా, జానకి.. ఇద్దరూ అందరికీ బట్టలు పెడుతుంటారు. అయితే.. మైరావతి.. ఏదో ప్లాన్ వేస్తుంది. ఊళ్లో వాళ్లలో ఓ మహిళకు ఏదో ప్లాన్ చెబుతుంది. జానకిని టెస్ట్ చేయమని చెబుతుంది. ఆమె చీర తీసుకున్నాక… లక్షణంగా ఉన్నావమ్మా.. మీరు బాగా చదువుకున్నారట కదా. మామూలుగా చదువుకున్న అమ్మాయి తన కంటే ఎక్కువ చదువుకున్న అబ్బాయిని.. మంచి ఉద్యోగం చేస్తున్న అబ్బాయిని చేసుకోవాలనుకుంటారు.. అంటుంది.
మరి మీరు అని అనబోతుండగా.. ఏవమ్మా.. అవన్నీ నీకెందుకమ్మా.. అని అంటాడు. కానీ.. అరేయ్ గోవిందం.. అడిగినప్పుడు సమాధానం చెప్పి నోరు మూయించాలిరా అంటుంది. చెప్పనీయ్.. నీ కోడలు ఏం సమాధానం చెబుతుందో చూడనీయి అంటుంది.
Janaki Kalaganaledu 16 Nov Today Episode : మైరావతి పెట్టిన మరోటెస్ట్ లోనూ జానకి పాస్
మీకన్నా తక్కువ చదువుకున్న వ్యక్తిని పెళ్లి చేసుకున్నారని ఊళ్లో అందరూ చెవులు కొరుక్కుంటున్నారు. మీరు జ్ఞానాంబ ఆస్తిని చూసే పెళ్లి చేసుకున్నారని అందరూ అనుకుంటున్నారమ్మా.. అంటుంది ఆ పెద్దావిడ. దీంతో.. పెళ్లికి ముందు మా అత్తయ్య గారికి ఏం ఆస్తులు ఉన్నాయో కూడా నాకు తెలియదు. స్వీట్ షాపు నడుపుకునే వ్యక్తిని ఎలా పెళ్లి చేసుకున్నారు అనే కదా అడిగారు.. సంపాదిస్తే ఆస్తులు వస్తాయి కానీ.. సంస్కారం రాదు.
మా ఆయనకు చదువు లేకపోయినా.. శిఖరం అంత సంస్కారం ఉంది. ఒక ఆడపిల్లకు పెళ్లిసంబంధం చూసేటప్పుడు చూడాల్సింది.. చదువుకున్నవాడా.. డబ్బులున్నవాడా కాదు.. మంచోడా.. మంచి మనసు ఉన్నాడో అని. ఈ విషయంలో మా ఆయన మనసు మంచికొండ.. ఒక అమ్మాయి.. అత్తారింట్లో సంతోషంగా ఉండాలంటే.. భార్యను భర్త అర్థం చేసుకునేవాడై ఉండాలి. ఈ విషయంలో మా ఆయన దేవుడు.. అందుకే నేను మా అత్తారింట్లో చాలా సంతోషంగా ఉన్నాను అని చెబుతుంది జానకి. నా భర్త శ్రీరామచంద్రుడి కన్నా గొప్పోడు.. పురుషోత్తముడు అని చెప్పి పొగడగానే.. అందరూ చప్పట్లు కొడతారు.
కట్ చేస్తే.. ఇంట్లో అందరూ దీపావళి సంబురాలు జరుపుకుంటూ ఉంటారు. రామా.. జానకి.. ఇద్దరూ కలిసి దీపాలు వెలిగిస్తారు. టపాసులు కాల్చి సంబురాలు చేసుకుంటారు. రామా, జానకి అందరూ డ్యాన్సులు చేసి పండుగ చేసుకుంటారు. ఆ తర్వాత ఏం జరుగుతుందో తెలియాలంటే తరువాయిభాగంలో చూడాల్సిందే.