Vadinamma 22 Nov Episode Highlights : రఘురామ్ ను చితక్కొట్టిన లక్ష్మణ్, జనార్దన్.. రిషి బర్త్ డేకు రఘురామ్ ను పిలవని లక్ష్మణ్

Authored By Varun G | The Telugu News | Published on: November 21, 2021, 3:20 pm

Vadinamma 22 Nov Episode Highlights : వదినమ్మ సీరియల్ ఈరోజు ప్రసారం కాదు. తిరిగి సోమవారం ప్రసారం అవుతుంది. సోమవారం 22 నవంబర్ 2021, సోమవారం ఎపిసోడ్ 706 హైలైట్స్ ఏంటో ఇప్పుడు చూద్దాం. ఎలాగైనా రిషిని చూడాలనుకొని దొంగచాటుగా రఘురామ్.. జనార్ధన్ ఇంటికి వస్తాడు. రిషి ఏడుస్తూ కనిపిస్తాడు. దీంతో వెంటనే రిషిని తీసుకొని ముసుగు వేసుకొని కిందికి వస్తాడు. ఇంతలో పక్కనే ఉన్న ఫ్లవర్ బాక్స్ కింద పడుతుంది. దీంతో ఏం చేయాలో అర్థం కాదు రఘురామ్ కు.

Vadinamma 22 november 2021 episode highlights

Vadinamma 22 november 2021 episode highlights

ఏమైందో అని లింగం వచ్చి చూస్తాడు. ముసుగు వేసుకొని సోఫా పక్కన దాక్కొని ఉన్న రఘురామ్ ను చూసి షాక్ అవుతాడు. అందరిని పిలుస్తాడు. ఎవరో దొంగ అనుకొని.. అందరూ కలిసి రఘురామ్ ను చితకబాదుతారు. తర్వాత ముసుగు తీసేయడంతో రఘురామ్ అని అనుకొని షాక్ అవుతారు అందరూ. అన్నయ్య నువ్వా.. ఏంటిది.. ఇలా చేశావు. ఇలా ముసుగు వేసుకొని రావడం ఏంటి.. అని అడుగుతాడు. రిషిని చూడాలనిపించి వచ్చానురా అంటాడు రఘురామ్.

బాబు మెట్ల మీది నుంచి కింద పడబోయాడు. దీంతో బాబును పడుకోబెడదామని కిందికి వచ్చాను. ఇంతలో ఫ్లవర్ బాక్స్ కింద పడింది అంటాడు. అయినా ఎవ్వరూ నమ్మరు. బాబును చూడాలనిపిస్తే.. డైరెక్ట్ గా రావచ్చు కదా.. ఇలా దొంగలా రావడం ఎందుకు అంటాడు లక్ష్మణ్. దొంగలా వచ్చినందుకు నన్ను క్షమించు అని చెప్పి అక్కడి నుంచి వెళ్లిపోతాడు రఘురామ్.

కట్ చేస్తే.. రఘురామ్ ఎటు వెళ్లాడో అని టెన్షన్ పడుతుంది సీత. ఇంతలో రఘురామ్ ఇంటికి వస్తాడు. రఘురామ్ శరీరం మీద గాయాలు ఉండటం చూసి అందరూ షాక్ అవుతారు. ఆ దెబ్బలు ఏంటి అని అడుగుతారు. బావా నువ్వు జనార్ధన్ ఇంటికి వెళ్లావు కదా అని అడుగుతుంది సీత.

కట్ చేస్తే.. మనం ఆ ఇంటికి ఇక వెళ్లడం లేదు అంటుంది శైలూ. మనం నాలుగు రోజులు ఇక్కడ ఉంటే.. బావ గారు మారుతారని అనుకున్నాం కానీ.. బాబు కోసం దొంగలా ఇంటికి వచ్చాడు. అందుకే.. మనం ఇక ఆ ఇంటికి వెళ్లడం లేదు అంటుంది శైలూ. జనార్ధన్ కూడా అదే విషయం చెబుతాడు.

Vadinamma 22 Nov Episode Highlights : మనం అక్కడికి వెళ్లొద్దు అని లక్కీకి చెప్పిన శైలూ

లక్ష్మణ్ కు ఏం చేయాలో అర్థం కాదు. ఏం చెప్పలేక పోతాడు. మరోవైపు లక్ష్మణ్ ఎప్పుడు వస్తాడు అని ఎదురు చూస్తాడు రఘురామ్. రిషి వస్తాడు కదా అని సంతోషంగా ఉంటాడు రఘురామ్. కానీ.. రిషి రాడు. శైలూ.. వద్దంటుంది. ఇంకొన్ని రోజులు అక్కడే ఉందాం అని శైలూ అంటుంది.

కట్ చేస్తే.. భరత్ కు లక్ష్మణ్ ఫోన్ చేసి ఈరోజు రిషి బర్త్ డే గుర్తుందా అంటాడు. ఈ ఇంటి వారసుడి పుట్టిన రోజు ఎలా మరిచిపోతాం అంటాడు భరత్. ఫంక్షన్ విషయం అన్నయ్య, వదినమ్మలతో అనకండి. వాళ్లను పిలవట్లేదు అంటాడు లక్ష్మణ్. దీంతో రఘురామ్ షాక్ అవుతాడు.

నీ ఉమ్మడి కుటుంబం లింక్ తెగబోతుంది. పొరపాటున ఫంక్షన్ కు రావాలని ప్రయత్నించావో బాగుండదు అని రఘురామ్ కు జనార్ధన్ ఫోన్ చేసి చెబుతాడు. దీంతో ఎలాగైనా ఆ ఫంక్షన్ కు వెళ్లి రిషిని ఆశీర్వదించి వద్దాం అని రఘురామ్, సీత డిసైడ్ అవుతారు. ఆ తర్వాత ఏం జరుగుతుందో తెలియాలంటే తరువాయిభాగం కోసం వెయిట్ చేయాల్సిందే.

 

Varun G

No bio available for this author.

Google The Telugu News మీకు నచ్చిన సైటుగా ఎంచుకోండి
WhatsApp