vaishnav tej kondapoam movie unit In big boss house
KondaPolam: తెలుగు పాపులర్ రియాలిటీ షో ‘బిగ్ బాస్ సీజన్ ఫైవ్’ గత సీజన్స్‌తో పోల్చితే చాలా డిఫరెంట్‌గా ఉందని ఆడియన్స్ అంటున్నారు. ఈ సీజన్‌కు టాలీవుడ్ కింగ్ అక్కినేని నాగార్జున వ్యాఖ్యాతగా వ్యవహరిస్తున్న సంగతి తెలిసిందే. కాగా, ‘బిగ్ బాస్’లోకి ‘కొండ పొలం’ మూవీ టీమ్ వచ్చేసింది. ఇందుకు సంబంధించిన ప్రోమోను తాజాగా స్టార్ మా వారు ఇన్ స్టా గ్రామ్ వేదికగా విడుదల చేశారు.‘బిగ్ బాస్’ షోలో కంటెస్టెంట్స్ పర్ఫార్మెన్స్ టాస్కులు చేసే తీరు ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకుంటోంది. ఈ క్రమంలో కంటెస్టెంట్స్‌ను సర్‌ప్రైజ్ చేసేందుకుగాను ‘కొండ పొలం’ సినిమా డైరెక్టర్ క్రిష్, హీరో వైష్ణవ్ తేజ్ హౌజ్‌కు వచ్చేశారు.
vaishnav tej kondapoam movie unit In big boss house
ఇన్ స్టా వేదికగా విడుదలైన ప్రోమో సోషల్ మీడియాలో వైరలవుతోంది. సదరు ప్రోమోలో ఇంత చిన్న వయసులో రకుల్‌ను ఎలా ప్రేమించావ్? అని నాగార్జున పంజా వైష్ణవ్ తేజ్‌ను అడగగా, ఏమో సర్ అలా చేయాల్సి వచ్చిందని వైష్ణవ్ చెప్పాడు. ఈ క్రమంలోనే డైరెక్టర్ క్రిష్‌ను నాగ్ ‘కొండ పొలం’ ఫిల్మ్ ఎన్ని రోజుల్లో కంప్లీట్ చేశారని అడగగా, నలభై రోజులని క్రిష్ సమాధానం చెప్పాడు. అంతలోనే మా వాళ్లకు (హౌజ్ మేట్స్) 105 రోజులు హౌజ్‌లో ఉంటారని చెప్పాడు నాగ్.
vaishnav tej kondapoam movie unit In big boss house
ఈ క్రమంలోనే ‘బిగ్ బాస్’ కంటెస్టెంట్స్‌కు నాగార్జున ప్రశ్నలు వేస్తుండగా డైరెక్టర్ క్రిష్, హీరో వైష్ణవ్ తేజ్ కౌంటర్స్ ఇచ్చారు. తనకు హమీదా అంటే ఇష్టమని క్రిష్ తెలిపాడు. ‘ఎవరి వంట వాళ్లు వండుకోవాలి’ అనే టాస్కు ఇచ్చినట్లు నాగ్ చెప్పాడు. ఈ క్రమంలో హౌజ్ మేట్స్ మధ్య తలెత్తిన గొడవలను నాగార్జున ప్రస్తావించాడు. మొత్తానికి ప్రోమో చాలా ఇంట్రెస్టింగ్‌గానే ఉంది. ఇకపోతే శుక్రవారం విడుదలైన ‘కొండ పొలం’ సినిమా పాజిటివ్ టాక్ తెచ్చుకుని హిట్ దిశగా కొనసాగుతోంది.
CMF Phone 2 Pro | దసరా పండగ సీజన్ సందడిలో ఫ్లిప్‌కార్ట్ బిగ్ బిలియన్ డేస్ సేల్ జోష్‌తో సాగుతోంది.…
Corona | కరోనా మహమ్మారి వెనుకడుగు వేసినా… దాని ప్రభావాలు ఇప్పటికీ చాలా మందిపై కొనసాగుతూనే ఉన్నాయి. ముఖ్యంగా ఘ్రాణశక్తి…
AP Farmers | ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం 2025-26 పత్తి సీజన్‌కు సంబంధించి కీలక మార్గదర్శకాలను విడుదల చేసింది. రైతుల సంక్షేమాన్ని…
TGSRTC | దసరా పండుగను పురస్కరించుకుని తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ (టీఎస్ఆర్టీసీ) ప్రయాణికులకు శుభవార్త చెప్పింది. పండుగ సందర్భంగా…
OG Collections | సుజీత్ దర్శకత్వంలో పవర్‌స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా రూపొందిన ఓజీ బారీ అంచనాల మధ్య సెప్టెంబర్…
OG | పవన్ కళ్యాణ్ తాజా చిత్రం ‘ఓజీ’ (ఒరిజినల్ గ్యాంగ్‌స్టర్) టికెట్ ధరల పెంపుపై తెలంగాణ రాష్ట్ర సినిమాటోగ్రఫీ…
Coconut | కొబ్బరి అంటేనే మనం వెంటనే ఆరోగ్యానికి మంచిదని భావిస్తాం. పచ్చి కొబ్బరి, కొబ్బరి నీళ్లు, కొబ్బరి నూనె…
Jackfruit seeds | రోజురోజుకూ మారుతున్న వాతావరణం, పుట్టుకొస్తున్న కొత్త వైరస్లు ప్రజల ఆరోగ్యాన్ని ముప్పుతిప్పులు పెడుతున్నాయి. ఇలాంటి పరిస్థితుల్లో…
This website uses cookies.