vakeel-saab-release date announced by pawan kalyan regarding vakeel saab
Vakeel saab : వకీల్ సాబ్ సినిమా నుంచి ఇన్ని నెలలు గా పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ అభిమానులు .. యావత్ సినీ అభిమానులు ఎదురు చూసిన సర్‌ప్రైజింగ్ అప్‌డేట్ వచ్చేసింది. వకీల్ సాబ్ టీజర్ తో సినిమా మీద భారీ అంచనాలు పెంచేశారు చిత్ర యూనిట్. పవన్ కళ్యాణ్ మూడేళ్ళ తర్వాత రీ ఎంట్రీ ఇస్తున్న సినిమా కావడం తో ఈ సినిమా మీద ఇండస్ట్రీ వర్గాలలో విపరీతమైన ఆసక్తి నెలకొంది. ఇక పవన్ కళ్యాణ్ అభిమానులకైతే ఆతృత ఎలా ఉందో మాటల్లో చెప్పడానికి వీల్లేదు.
vakeel-saab-release date announced by pawan kalyan regarding vakeel saab
యంగ్ డైరెక్టర్ వేణు శ్రీరాం దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా ఇటీవలే షూటింగ్ కంప్లీట్ చేసుకుంది. టాలీవుడ్ స్టార్ ప్రొడ్యూసర్ దిల్ రాజు నిర్మాణంలో తెరకెక్కిన ఈ సినిమాకి బాలీవుడ్ నిర్మాత బోనీకపూర్ సమర్పకుడిగా వ్యవహరించాడు. ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్స్ వర్క్ జరుపుకుంటున్న ఈ సినిమాలో శృతిహాసన్ గెస్ట్ రోల్ లో నటిస్తుండగా నివేదా థామస్, అనన్య నాగళ్ళ, అంజలి కీలక పాత్రల్లో నటించారు. సీనియర్ నరేష్, ప్రకాశ్ రాజ్ కీలక పాత్రల్లో నటించారు. కాగా తాజాగా వకీల్ సాబ్ సినిమా రిలీజ్ డేట్ ని అనౌన్స్ చేశారు.
కరోనా కారణంగా ఆలస్యం అయిన వకీల్ సాబ్ వాస్తవంగా గత ఏడాది మే 15 న రిలీజ్ కావాల్సింది. కాని కరోనా లాక్ డౌన్ కారణంగా వకీల్ సాబ్ సినిమా.. షూటింగ్ దశలోనే నిలిచిపోయింది. లాక్ డౌన్ తర్వాత ఒకవైపు రాజకీయాలకి సంబంధించిన వ్యవహారాలను చూసుకుంటూనే మరోకవైపు వకీల్ సాబ్ షూటింగ్ ని కంప్లీట్ చేశాడు పవన్ కళ్యాణ్. అయితే సంక్రాంతి బరిలో రిలీజ్ అని ఆశపడ్డారు అభిమానులు. కాని అది సాధ్యపడలేదు ఎట్టకేలకి ఈ సినిమాని ఏప్రిల్ 9 న భారీ స్థాయిలో రిలీజ్ చేస్తున్నట్టు అధికారకంగా ప్రకటించారు మేకర్స్. ఈ సందర్భంగా పోస్టర్ ని రిలీజ్ చేయగా సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఇక ఈ సినిమా ని బాలీవుడ్ లో బిగ్ బి అమితాబ్ బచ్చన్ నటించిన పింక్ సినిమాకి రీమేక్ గా తెరకెక్కించారు.
Neem tree | ఆధ్యాత్మిక పరంగా, ఆరోగ్య పరంగా, జ్యోతిషశాస్త్ర పరంగా ఎంతో ప్రత్యేకత కలిగిన వేప చెట్టు గురించి…
తనకు పదవి కంటే రైతుల ప్రయోజనాలే ముఖ్యమని మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి (Rajagopal Reddy) స్పష్టం చేశారు.…
ఆంధ్రప్రదేశ్ పోలీస్ రిక్రూట్మెంట్ బోర్డు(Police Recruitment Board)లో 42 అసిస్టెంట్ పబ్లిక్ ప్రాసిక్యూటర్ పోస్టుల భర్తీకి దరఖాస్తు గడువు నేటితో…
Laptop | వైఫై పాస్‌వర్డ్‌ను మర్చిపోవడం సాధారణంగా జరిగేదే. పాస్వర్డ్ మరిచిపోయినప్పుడు ఎలా తెలుసుకోవాలో ఐడియా లేకపోతే కొంచెం ఇబ్బంది…
SIIMA | 'సౌత్ ఇండియన్ ఇంటర్నేషనల్ మూవీ అవార్డ్స్ 2025' (సైమా 2025) ప్రదానోత్సవ కార్యక్రమం అట్టహాసంగా రెండు రోజుల…
ప్రపంచంలోనే ధనిక క్రికెట్ బోర్డుగా బీసీసీఐకి ప్రత్యేకమైన క్రేజ్ ఉంది. ఐపీఎల్‌తో బీసీసీఐ బాగానే దండుకుంది. ప్రస్తుతం బీసీసీఐ ఖాతాలో…
Ponguleti srinivas reddy | తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్న ఇందిరమ్మ ఇళ్లు పథకంపై కీలక అభివృద్ధి చోటుచేసుకుంది.…
Bigg Boss 9 | ప్రముఖ రియాలిటీ షో బిగ్ బాస్ తెలుగు సీజన్ 9 గ్రాండ్ లాంచ్‌కు సమయం…
This website uses cookies.