Vakeel saab : వకీల్ సాబ్ నుంచి బిగ్ సర్‌ప్రైజ్.. రిలీజ్ డేట్ తో షాక్ ఇచ్చిన పవన్ కళ్యాణ్ ..! | The Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు | Today Telugu News

Vakeel saab : వకీల్ సాబ్ నుంచి బిగ్ సర్‌ప్రైజ్.. రిలీజ్ డేట్ తో షాక్ ఇచ్చిన పవన్ కళ్యాణ్ ..!

Vakeel saab : వకీల్ సాబ్ సినిమా నుంచి ఇన్ని నెలలు గా పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ అభిమానులు .. యావత్ సినీ అభిమానులు ఎదురు చూసిన సర్‌ప్రైజింగ్ అప్‌డేట్ వచ్చేసింది. వకీల్ సాబ్ టీజర్ తో సినిమా మీద భారీ అంచనాలు పెంచేశారు చిత్ర యూనిట్. పవన్ కళ్యాణ్ మూడేళ్ళ తర్వాత రీ ఎంట్రీ ఇస్తున్న సినిమా కావడం తో ఈ సినిమా మీద ఇండస్ట్రీ వర్గాలలో విపరీతమైన ఆసక్తి నెలకొంది. ఇక పవన్ […]

 Authored By govind | The Telugu News | Updated on :30 January 2021,6:03 pm

Vakeel saab : వకీల్ సాబ్ సినిమా నుంచి ఇన్ని నెలలు గా పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ అభిమానులు .. యావత్ సినీ అభిమానులు ఎదురు చూసిన సర్‌ప్రైజింగ్ అప్‌డేట్ వచ్చేసింది. వకీల్ సాబ్ టీజర్ తో సినిమా మీద భారీ అంచనాలు పెంచేశారు చిత్ర యూనిట్. పవన్ కళ్యాణ్ మూడేళ్ళ తర్వాత రీ ఎంట్రీ ఇస్తున్న సినిమా కావడం తో ఈ సినిమా మీద ఇండస్ట్రీ వర్గాలలో విపరీతమైన ఆసక్తి నెలకొంది. ఇక పవన్ కళ్యాణ్ అభిమానులకైతే ఆతృత ఎలా ఉందో మాటల్లో చెప్పడానికి వీల్లేదు.

vakeel saab release date announced by pawan kalyan regarding vakeel saab

vakeel-saab-release date announced by pawan kalyan regarding vakeel saab

యంగ్ డైరెక్టర్ వేణు శ్రీరాం దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా ఇటీవలే షూటింగ్ కంప్లీట్ చేసుకుంది. టాలీవుడ్ స్టార్ ప్రొడ్యూసర్ దిల్ రాజు నిర్మాణంలో తెరకెక్కిన ఈ సినిమాకి బాలీవుడ్ నిర్మాత బోనీకపూర్ సమర్పకుడిగా వ్యవహరించాడు. ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్స్ వర్క్ జరుపుకుంటున్న ఈ సినిమాలో శృతిహాసన్ గెస్ట్ రోల్ లో నటిస్తుండగా నివేదా థామస్, అనన్య నాగళ్ళ, అంజలి కీలక పాత్రల్లో నటించారు. సీనియర్ నరేష్, ప్రకాశ్ రాజ్ కీలక పాత్రల్లో నటించారు. కాగా తాజాగా వకీల్ సాబ్ సినిమా రిలీజ్ డేట్ ని అనౌన్స్ చేశారు.

Vakeel saab : వకీల్ సాబ్ వాస్తవంగా గత ఏడాది మే 15 న రిలీజ్ కావాల్సింది..!

కరోనా కారణంగా ఆలస్యం అయిన వకీల్ సాబ్ వాస్తవంగా గత ఏడాది మే 15 న రిలీజ్ కావాల్సింది. కాని కరోనా లాక్ డౌన్ కారణంగా వకీల్ సాబ్ సినిమా.. షూటింగ్ దశలోనే నిలిచిపోయింది. లాక్ డౌన్ తర్వాత ఒకవైపు రాజకీయాలకి సంబంధించిన వ్యవహారాలను చూసుకుంటూనే మరోకవైపు వకీల్ సాబ్ షూటింగ్ ని కంప్లీట్ చేశాడు పవన్ కళ్యాణ్. అయితే సంక్రాంతి బరిలో రిలీజ్ అని ఆశపడ్డారు అభిమానులు. కాని అది సాధ్యపడలేదు ఎట్టకేలకి ఈ సినిమాని ఏప్రిల్ 9 న భారీ స్థాయిలో రిలీజ్ చేస్తున్నట్టు అధికారకంగా ప్రకటించారు మేకర్స్. ఈ సందర్భంగా పోస్టర్ ని రిలీజ్ చేయగా సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఇక ఈ సినిమా ని బాలీవుడ్ లో బిగ్ బి అమితాబ్ బచ్చన్ నటించిన పింక్ సినిమాకి రీమేక్ గా తెరకెక్కించారు.

govind

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది