నమ్రత ఫ్యామిలీ పార్టీలొ వంశీ పైడిపల్లి.. ఆ గొడవలన్నీ సమసిపోయాయా?

Authored By Admin | The Telugu News | Published on: December 11, 2020, 2:59 pm

సూపర్ స్టార్ మహేష్ బాబు దర్శకుడు వంశీ పైడిపల్లి మధ్య ఎన్నో గొడవలు జరిగాయి.. ఇద్దరూ దూరమయ్యారంటూ అప్పట్లో ఎన్నో వార్తలు వచ్చాయి. సరిలేరు నీకెవ్వరు సినిమా తరువాత మహేష్ బాబు తన తదుపరి చిత్రాన్ని వంశీ పైడిపల్లితో చేస్తానని మీడియా ముఖంగానే చెప్పాడు. అంతా బాగానే ఉంది. కానీ సడెన్‌గా వంశీ పైడిపల్లి సినిమా క్యాన్సిల్ అయింది. దీని వెనుక ఎన్నో కథనాలు బయటకు వచ్చాయి. మహర్షి సినిమా, సరిలేరు నీకెవ్వరు సినిమాల ద్వారా దిల్ రాజుకు కాసింత నష్టమే మిగిల్చాయట.

Vamsi Paidipally with Namrata shirodkar And mahesh babu In Mumbai

Vamsi Paidipally with Namrata shirodkar And mahesh babu In Mumbai

దీంతో వంశీ పైడిపల్లి సినిమాకు కొంచెం రెమ్యూనరేషన్ తగ్గించుకోమని మహేష్ బాబును కోరాడట. ఆ విషయం నచ్చని మహేష్ బాబు.. స్క్రిప్ట్ నచ్చలేదనే నెపంతో మొత్తం ప్రాజెక్ట్‌నే క్యాన్సిల్ చేశాడట. అలా తన స్క్రిప్ట్ నచ్చలేదని చెప్పడంతో వంశీ పైడిపల్లి బాగా హర్ట్ అయ్యాడని వార్తలు వచ్చాయి. అసలే మహర్షి సినిమా సమయంలో రెండు ఫ్యామిలీలు బాగా కలిసిపోయాయి. మరీ ముఖ్యంగా సితార ఆద్య (వంశీ పైడిపల్లి కూతురు) బాగా క్లోజ్ అయ్యారు.

ఆ ఇద్దరూ కలిసి యూట్యూబ్ చానెల్ పెట్టి వీడియోలు కూడా చేశారు. మహేష్ బాబును స్పెషల్ ఇంటర్వ్యూ కూడా చేశారు. అలా బాగా కలిసిపోయిన ఫ్యామిలీలు ఆ కారణంగా దూరమయ్యాయని వార్తలు వచ్చాయి. కానీ ఆ మధ్య ఓ ఫంక్షన్‌లో నమ్రతను కలిసిన వంశీ పైడిపల్లి అన్ని వ్యవహారాలను చక్కబెట్టేశాడటని తెలుస్తోంది. అందుకే ఇప్పుడు నమ్రత సోదరి కూతురి బర్త్ డే పార్టీలోనూ వంశీ పైడిపల్లి ప్రత్యక్షమయ్యాడు. అంటే ఆ ఇద్దరి మధ్య గొడవలేమీ లేవన్నట్టే.

Admin

No bio available for this author.

Google The Telugu News మీకు నచ్చిన సైటుగా ఎంచుకోండి
WhatsApp