Varsha Emmanuel : రెచ్చిపోయిన ఇమాన్యుయేల్ వర్ష.. స్టేజ్ మీదే రొమాన్స్ వీడియో..!

Authored By Cinema Desk | The Telugu News | Published on: December 13, 2021, 5:40 pm

Varsha Emmanuel  : బుల్లితెరపై వర్ష, ఇమాన్యుయేల్ క్రియేట్ మ్యాజిక్ అందరికీ తెలిసిందే. అయితే ఒకానొక స్టేజ్ వచ్చే సరికి ఈ ఇద్దరి చేష్టలు చూసి జనాలకు వెగటు పుట్టేసింది. లవ్ ట్రాక్ అంటూ బాగా రెచ్చిపోయారు. రష్మీ సుధీర్ జోడిలా వర్ష ఇమాన్యుయేల్ కూడా స్టార్డం తెచ్చుకోవాలని చూశారు. కానీ ఆ వ్యూహం బెడిసి కొట్టేసింది. వర్ష ఇమాన్యుయేల్ ఎన్ని రకాలుగా ట్రై చేసినా కూడా వారిది కేవలం నటనే అని అందరూ లైట్ తీసుకున్నారు.

వర్ష ఇమాన్యుయేల్ జంట మీద పెళ్లి అంటూ ఓ ఈవెంట్‌ను చేయడంతో జనాలు భగ్గుమన్నారు. అలాంటి పనికి మాలిన ఈవెంట్లు చేయడం ఎందుకు? అంటూ మల్లెమాల టీంను, వర్ష ఇమాన్యుయేల్‌లను ఏకిపారేశారు. నీ చిత్రం చూసి అనే పాటను కూడా ఈ ఇద్దరికి ఆర్ఆర్‌గా వేసి ఖూనీ చేసేశారు. అలా మధ్యలో కొన్ని రోజులు ఈ ఇద్దరూ దూరంగానే ఉన్నారు.

Varsha Emmanuel Dance in Sridevi Drama Company

Varsha Emmanuel Dance in Sridevi Drama Company

Varsha Emmanuel  : వర్షతో ఇమాన్యుయేల్ డ్యాన్స్..

కలిసి స్కిట్లు చేయలేదు. చేసినా కూడా లవర్స్‌గా నటించలేదు, కానీ మళ్లీ ఇప్పుడు బండి ట్రాక్ ఎక్కేసినట్టు కనిపిస్తోంది. వచ్చే ఆదివారం నాడు రాబోతోన్న శ్రీదేవీ డ్రామా కంపెనీ ఎపిసోడ్‌లో వర్ష ఇమాన్యుయేల్ రెచ్చిపోయారు. స్టేజ్ మీద డ్యాన్సులతో రొమాన్స్ చేసేశాడు. లెహరాయి పాటకు అదిరిపోయే స్టెప్పులు వేశారు. నలుపు నేరేడంటి అనే పాటకు లారెన్స్‌లా ఇమాన్యుయేల్‌ వర్షతో డ్యాన్స్ చేశాడు.

Cinema Desk

No bio available for this author.

Google The Telugu News మీకు నచ్చిన సైటుగా ఎంచుకోండి
WhatsApp