Rashmi Gautam : రష్మి గౌతమ్, దీపిక పిల్లి కొంటె చేష్టలు.. పగలబడి నవ్వేసిన వర్షిణి

 Authored By prabhas | The Telugu News | Updated on :10 April 2022,1:00 pm

Rashmi Gautam : బుల్లితెరపై ఆర్టిస్ట్‌లు, యాంకర్లు ఇలా అందరూ కూడా ఓ ఫ్యామిలీలా కలిసి మెలిసి ఉంటారు.ఎందుకంటే నిత్యం అందరూ కలిసి ఒకే చోట పని చేస్తుంటారు. ఎక్కువ సమయం గడుపుతుంటారు. అలా జబర్దస్త్ ఆర్టిస్ట్‌లు, ఢీ షో మెంబర్లు కలిసి మెలిసి ఉంటారు. ఇక ఢీ షోలో అయితే వర్షిణి స్థానంలో దీపిక పిల్లి వచ్చేసిన సంగతి తెలిసిందే. అయినా కూడా వర్షిణికి ఏ మాత్రం కోపం లేనట్టుంది.మామూలుగా అయితే వర్షిణి, ఆది, సుధీర్, రష్మీ, ప్రదీప్ గ్యాంగ్ ఉన్నప్పుడే ఢీ షోను అందరూ చూశారు.

సుధీర్ రష్మీ, ఆది వర్షిణి ట్రాక్ ఫుల్ వర్కవుట్ అయింది. ఆది వర్షిణిల వ్యవహారం అయితే ఏకంగా నిశ్చితార్థం, పెళ్లి అనే రూమర్ల వరకు వెళ్లింది. అయితే ఆ తదుపరి సీజన్‌కు వర్షిణి ఢీ నుంచి బయటకు వచ్చింది. తనంతట తానే వచ్చిందా? లేదా మల్లెమాల టీం పొమ్మన్నదా? అనే విషయం బయటకు రాలేదు.వర్షిణి స్థానంలో దీపిక పిల్లి వచ్చేసింది. టిక్ టాక్ స్టార్ అయిన దీపిక పిల్లి.. మొత్తానికి రష్మీతో క్లోజ్ అయింది. ఢీ షోలో దీపిక పిల్లి ఎక్కువగా హైలెట్ అవ్వలేదు. కానీ రష్మీతో ఆఫ్ స్క్రీన్ ఫ్రెండ్ షిప్‌తో ఫుల్ ఫేమస్ అయింది.

Varshini Laughs AT Rashmi Gautam And Deepika Reel Video

Varshini Laughs AT Rashmi Gautam And Deepika Reel Video

ఈ ఇద్దరూ కలిసి వీకెండ్ పార్టీలు, తిరగడాలు చేస్తుండటంత, ఇన్ స్టా రీల్ వీడియోలతో ఫుల్ ట్రెండ్ అయ్యారు. తాజాగా రష్మీ, దీపిక పిల్లి ఓ రీల్ వీడియో చేశారు.అందులో ఆ ఇద్దరూ మూమెంట్స్ ప్రాక్టీస్ చేస్తూ వచ్చారు. ఈవెంట్లలో చేసిన మూమెంట్‌ను లిఫ్ట్‌లోనూ ట్రై చేశారు. కాకపోతే అక్కడే కాస్త తేడా కొట్టేసింది. దీంతో నెటిజన్లు పగల బడి నవ్వేస్తున్నారు. ఈ రీల్ వీడియోకు వర్షిణి రియాక్ట్ అయింది. పగలబడి నవ్వేస్తున్నట్టుగా ఎమోజీని షేర్ చేసింది

 

View this post on Instagram

 

A post shared by Rashmi Gautam (@rashmigautam)

prabhas

Prabhas Gilakathula Content Writer experiened in Digital media field. Iam worked in various Telugu media for about 5 years. Worked in Namasthe Telangana, Telugu Rajyam , as a telugu content writer. I wrote various Latest Breaking News , politics, interesting stories, Andhr Pradesh & Telangana local news, health, technology, entertainment , Devotional, etc. He is also Social Media Expert, Technical Expert . He is present content writer of thetelugunews.com website. Contact details: Prabhas29nov@gmail.com

Google The Telugu News మీకు నచ్చిన సైటుగా ఎంచుకోండి