Home » Entertainment » Varshini Post On Love With Hyper Aadi
Entertainment

Hyper Aadi : జీవితం మొత్తం నీవు తోడుగా ఉండాలి హైపర్ ఆది అంటూ వ‌ర్షిణి పోస్ట్… అంద‌రిలో అనుమానాలు

Authored By
Sam C
The Telugu News | Published on: June 10, 2022, 7:30 pm
Advertisement

Hyper Aadi : యాంకర్ వర్షిణి ఒక‌ప్పుడు వెండితెర‌, బుల్లితెర‌పై తెగ సంద‌డి చేసింది. ప్రస్తుతం బుల్లితెరకు దూరంగా ఉంటోంది. ఆమెకు ఎలాంటి షోలు చేతిలో లేవు. మధ్యలో సినిమా పనులతో బిజీగా ఉండటం వల్ల బుల్లితెరను వదిలేసింది. సమంత శాకుంతలం చిత్రంతో త్వ‌ర‌లో ప‌ల‌క‌రించ‌నుంది. వర్షిణి మాత్రం ఇప్పుడు బుల్లితెరకు పూర్తిగా దూరంగా ఉంటోంది. మరో వైపు సినిమా అవకాశాలు కూడా ఎక్కువగా రావడం లేనట్టుంది. అయితే సోషల్ మీడియాలో మాత్రం వర్షిణి ఫుల్లుగా సందడి చేస్తోంది. అందాలను ప్రదర్శించడంలో వర్షిణి దూసుకుపోతోంది. వర్షిణి షేర్ చేసే ఫోటోలు నెట్టింట్లో మంటను పుట్టిస్తున్నాయి. ఢీ షోలో ఉన్నప్పుడు హైపర్ ఆది, వర్షిణి చాలా సార్లు రొమాంటిక్ డాన్స్ తో అదరగొట్టిన సంగతి తెలిసిందే.

Advertisement

వీరిద్దిరిది చాలా చూడ‌ముచ్చ‌టైన జంట అని చాలా మంది కూడా చెప్పుకొచ్చారు. అయితే తాజాగా వ‌ర్షిణి త‌న సోష‌ల్ మీడియాలో షేర్ చేసిన పోస్ట్ అంద‌రికి అనేక అనుమానాలు తెప్పిస్తుంది. వర్షిణి.. ఆదితో చాలా క్లోజ్‌గా ఉంటూ తీసిన వీడియో షేర్ చేస్తూ… డియర్ ఆది.. హ్యాపీ బర్త్ డే. నా జీవితం మొత్తం నీవు తోడుగా ఉండాలి. నా ఫేవరిట్ పర్సన్, సపోర్ట్ సిస్టం నువ్వే. రైటర్ ఆది నువ్వు నాకు రైట్ రా ఆది’ అంటూ వర్షిణి లవ్ ఎమోజిలు పోస్ట్ చేసింది. దీనితో వీరిద్దరూ రిలేషన్ షిప్ లో ఉన్నారనే ఊహాగానాలు మొదలయ్యాయి. న‌టిగా పరిచయం అవడానికి ముందే వర్షిణి సౌందరాజన్ మోడలింగ్ రంగంలోకి ప్రవేశించింది.

Varshini post On Love With Hyper Aadi

Advertisement

Hyper Aadi : అనుమానాలు తెప్పిస్తున్న వ‌ర్షిణి..

అందులో తన అందచందాలతో ఆకట్టుకున్న ఈ భామ.. అక్కడ అందరి దృష్టినీ తన వైపునకు లాగేసుకుంది. ఈ క్రమంలోనే కొన్ని జాతీయ బ్రాండ్లకు అంబాసీడర్‌గానూ చేసింది. అదే సమయంలో కొన్ని వ్యాపార ప్రకటనల్లోనూ నటించి దేశ వ్యాప్తంగా మంచి గుర్తింపును అందుకుంది. మోడల్‌గా హవాను చూపిస్తోన్న సమయంలోనే వర్షిణి ‘చందమామ కథలు’ అనే తెలుగు సినిమాతో నటిగా ఎంట్రీ ఇచ్చింది. ఆ తర్వాత కూడా కొన్ని సినిమాల్లో నటించింది. కానీ, ఇవేమీ ఆమెకు భారీ సక్సెస్‌ను కానీ, గుర్తింపును కానీ ఇవ్వలేకపోయాయి. దీంతో వర్షిణి సినిమాలకు గ్యాప్ తీసుకుంది. ఈ క్రమంలోనే ‘పెళ్లి గోల’ అనే వెబ్ సిరీస్‌ చేసి మంచి బ్రేక్‌ను దక్కించుకుంది.

Sam C

Advertisement

Latest News

Related News

The Telugu News మీకు నచ్చిన సైటుగా ఎంచుకోండి