Home » Entertainment » Varun Sandesh And Vithika Sheru Romantic Reel Video
Entertainment

Varun Sandesh – Vithika : పొలంలో రొమాన్స్.. రెచ్చిపోయిన వితిక వరుణ్ సందేశ్

Authored By
aruna
The Telugu News | Published on: August 20, 2022, 4:20 pm
Advertisement

Varun Sandesh – Vithika : వరుణ్ సందేశ్ వితిక జోడి బిగ్ బాస్ ఇంట్లోకి వచ్చాకే ఇంతలా క్రేజ్, ఫేమ్ సంపాదించుకుంది. అంతకు ముందు వరుణ్ సందేశ్‌కు మాత్రమే మంచి ఇమేజ్ ఉండేది. వితిక షెరు అంటే కేవలం వరుణ్ సందేశ్ భార్యగానే గుర్తించేవారు. ఆమె కొన్ని సినిమాలు చేసినా కూడా అంతగా ఇమేజ్ రాలేదు. వరుణ్ సందేశ్‌తో పాటుగా వితిక షెరు బిగ్ బాస్ ఇంట్లోకి అడుగుపెట్టిన తరువాతే ఇంత ఫేమస్ అయింది. అయితే వరుణ్ సందేశ్ వితికలు బిగ్ బాస్ ఇంట్లో చాలా వారాల పాటే ఉంటూ వచ్చారు. బిగ్ బాస్ షో వల్ల వరుణ్ సందేశ్‌కు పాజిటివ్ ఇమేజ్ రాగా.. వితికకు నెగెటివ్ ఇమేజ్ ఏర్పడింది. బిగ్ బాస్ షో మాత్రం ఆ జోడికి బాగానే కలిసి వచ్చింది. బిగ్ బాస్ మూడో సీజన్ నడిచినంత కాలం ఈ ఇద్దరూ తెగ ట్రెండ్ అవుతూ ఉండేవారు.

Advertisement

వితిక మధ్యలోనే వెళ్లిపోయింది. వరుణ్ సందేశ్ మాత్రం చివరి వరకు ఉన్నాడు. రన్నర్ అవుతాడని అంతా భావించారు. కానీ టాప్ 5లోనే ఉండిపోయాడు. బయటకు వచ్చాక ఈ ఇద్దరి కెరీర్ బాగానే చేంజ్ అవుతుందని అంతా భావించారు. కానీ ఎక్కడ వేసిన గొంగళి అక్కడే అన్నట్టుగా సాగింది. వరుణ్ సందేశ్ చాలా గ్యాప్ తరువాత ఓ సినిమాను తీస్తే అది కేూడా బోల్తా కొట్టేసింది. వితిక షెరు మాత్రం తన యాంకరింగ్, హోస్ట్ కోరికను తీర్చేసుకుంది. సామజవరగమన అనే సింగింగ్ షోకు హోస్ట్‌గా మారి తన చిరకాల వాంఛను తీర్చేసుకుంది. కానీ ఆ షో హిట్ అవ్వలేదు. ఈమెకు పేరు రాలేదు.

Varun Sandesh And Vithika Sheru Romantic Reel Video

Advertisement

వితికకు బిగ్ బాస్ వల్ల సోషల్ మీడియాలో ఫాలోయింగ్ మాత్రం పెరిగింది. దాంతోనే ఆమె ఇలా గట్టెక్కుతోంది. సోషల్ మీడియా, యూట్యూబ్ చానెల్ అంటూ తెగ సందడి చేస్తుంటుంది. ఇక నెట్టింట్లో వితిక షేర్ చేసే రీల్ వీడియోలు, డ్యాన్స్ వీడియోలు తెగ వైరల్ అవుతుంటాయి. తాజాగా తన భర్తతో కలిసి మొదటి సారిగా ఇలా రీల్ వీడియోలు చేశాను అంటోంది. పొలంలో వర్షం పడుతుంటే ఈ ఇద్దరూ రొమాన్స్ చేస్తూ ఉన్నారు. దాన్ని ఓ రీల్ వీడియోగా వితిక షెరు షేర్ చేసింది. ప్రస్తుతం ఈ వీడియో నెటిజన్ల కామెంట్లతో తెగ వైరల్ అవుతోంది.

aruna

Advertisement

Latest News

Related News

The Telugu News మీకు నచ్చిన సైటుగా ఎంచుకోండి