Varun tej : పెళ్లి తరువాత అందరికీ ‘చెక్’.. నితిన్‌పై వరుణ్ తేజ్ కామెంట్స్

Authored By Cinema Desk | The Telugu News | Published on: February 22, 2021, 12:30 pm

Varun tej : నితిన్‌కు, మెగా ఫ్యామిలీకి మంచి సంబంధాలున్నాయన్న విషయం అందరికీ తెలిసిందే. నితిన్ సినిమాలకు మెగా హీరోలు గెస్ట్‌లుగా హాజరువుతుండటం పరిపాటే. పవన్ కళ్యాణ్ వీరాభిమాని, భక్తుడిగా నితిన్‌కు అటు టాలీవుడ్‌లో, ఇటు సినీ ప్రేక్షకుల్లో మంచి క్రేజ్ ఉంది. అలా తాజాగా చెక్ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్‌కు కూడా మెగా హీరోను తీసుకొచ్చాడు. మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్.. చెక్ ప్రీ రిలీజ్ ఈవెంట్‌కు అతిథిగా వచ్చాడు. ఈవెంట్‌లో మాట్లాడుతూ నితిన్‌పై సెటైర్స్ వేసేశాడు.

Varun tej about Nithiin at Check Pre Release Event

Varun tej about Nithiin at Check Pre Release Event

2020లో టాలీవుడ్ హీరోలు వివాహా బంధాలతో కొత్త జీవితాలను ప్రారంభించారు. అందులో నితిన్ కూడా ఉన్నాడు. అయితే అంతా బాగుండి ఉంటే.. 2020 నితిన్‌కు మరింతగా మరుపురాని ఏడాదిగా మారేది. ఒకే ఏడాదిలో నాలుగు చిత్రాలు విడుదలవ్వడం, పెళ్లి కూడా జరగడం వంటి ఎన్నో విశిష్టతలుండేవి. కానీ కరోనా కారణంగా భీష్మ సినిమా తప్పా మిగతావేవీ కూడా రిలీజ్ కాలేదు. పెళ్లి కూడా అనుకున్నంత రేంజ్‌లో చేయలేకపోయాడు.

ఇవే విషయాలను వరుణ్ తేజ్ చెబుతూ.. సాధారణంగా పెళ్లయిన తరవాత ఎవరైనా కాస్త స్లో అవుతారని.. కానీ, నితిన్ స్పీడు పెంచాడని.. నాలుగు సినిమాల డేట్లు కూడా ప్రకటించి అందరికీ చెక్ పెట్టాడని అన్నారు వరుణ్ తేజ్. నితిన్.. మరీ టూ మచ్. ట్రాఫిక్ ఎక్కువ చేశావ్ అంటూ వరుణ్ జోకులు వేశారు. ఏడాదిన్నర క్రితం తనను కలిసినప్పుడు ‘చెక్’ సినిమా స్టోరీ తనకు నితిన్ చెప్పాడని వరుణ్ అన్నారు. ఈ సినిమాపై నితిన్‌కు ఎంతో నమ్మకం ఉందని.. అది కచ్చితంగా నిజమవుతుందని వరుణ్ చెప్పుకొచ్చాడు.

Cinema Desk

No bio available for this author.

Google The Telugu News మీకు నచ్చిన సైటుగా ఎంచుకోండి
WhatsApp