Varun Tej And Lavanya Tripathi : ఏంటి.. ఆమె వల‌న వ‌రుణ్ తేజ్, లావ‌ణ్య త్రిపాఠికి విడాకులు అవుతాయా..? | The Telugu News : Latest Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు | బ్రేకింగ్ న్యూస్ తెలుగు

Varun Tej And Lavanya Tripathi : ఏంటి.. ఆమె వల‌న వ‌రుణ్ తేజ్, లావ‌ణ్య త్రిపాఠికి విడాకులు అవుతాయా..?

మెగా హీరో వ‌రుణ్ తేజ్, అందాల భామ లావ‌ణ్య త్రిపాఠి ప్రేమించి పెళ్లి చేసుకున్న విష‌యం తెలిసిందే. ఈ జంట ఒక పక్క తమ కెరీర్ ప‌నులు చూసుకుంటూనే.. మరోపక్క కపుల్ గోల్స్ ని కూడా ఎంజాయ్ చేస్తూ వస్తున్నారు. పెళ్లి తరువాత ఫారిన్ కి వెకేషన్ కి వెళ్లిన ఈ క్యూట్ క‌పుల్ ఆ త‌ర్వాత కాశ్మీర్‌కి వెళ్లారు. ఇక ఇప్పుడు హిమాచ‌ల్ ప్ర‌దేశ్‌లో సంద‌డి చేస్తున్నారు .గత వారం రోజుల నుంచి అక్కడే ప్రకృతి […]

 Authored By ramu | The Telugu News | Updated on :27 March 2024,6:00 pm

మెగా హీరో వ‌రుణ్ తేజ్, అందాల భామ లావ‌ణ్య త్రిపాఠి ప్రేమించి పెళ్లి చేసుకున్న విష‌యం తెలిసిందే. ఈ జంట ఒక పక్క తమ కెరీర్ ప‌నులు చూసుకుంటూనే.. మరోపక్క కపుల్ గోల్స్ ని కూడా ఎంజాయ్ చేస్తూ వస్తున్నారు. పెళ్లి తరువాత ఫారిన్ కి వెకేషన్ కి వెళ్లిన ఈ క్యూట్ క‌పుల్ ఆ త‌ర్వాత కాశ్మీర్‌కి వెళ్లారు. ఇక ఇప్పుడు హిమాచ‌ల్ ప్ర‌దేశ్‌లో సంద‌డి చేస్తున్నారు .గత వారం రోజుల నుంచి అక్కడే ప్రకృతి అందాలు మధ్య గడుపుతూ వాటికి సంబంధించిన ఫొటోలు, వీడియోలు షేర్ చేస్తున్నారు. అయితే ఎంతో ఆప్యాయంగా ఉంటున్న ఈ జంట త్వ‌ర‌లో విడాకులు తీసుకోనున్నార‌ని కొన్ని వార్త‌లు నెట్టింట తెగ హల్‌చ‌ల్ చేస్తున్నాయి. ఆస్ట్రాలజిస్ట్ గా మంచి పేరు సంపాదించుకున్న వేణుస్వామి ఈ జంట మీద కూడా కొన్ని కామెంట్స్ చేయ‌డం హాట్ టాపిక్ అవుతుంది.

వేణు స్వామి గ‌తంలో ప‌లువురు సెల‌బ్రిటీల జాత‌కాల గురించి కామెంట్స్ చేయ‌గా, అవి నిజం అయ్యాయి. నాగ చైత‌న్య‌, స‌మంత విడాకుల గురించి చెప్పిన మాట‌లు నిజం కావ‌డంతో అప్ప‌టి నుండి ఈయ‌న చెప్పిన మాట‌ల‌ని కొంద‌రు న‌మ్ముతున్నారు. అయితే వేణుస్వామి ఒక ఇంటర్వ్యూలో వరుణ్ తేజ్ లావణ్య త్రిపాఠి కూడా కలిసి ఉండరని.. వాళ్ళిద్దరు జాతకాల్లో దోషముందని.. ముఖ్యంగా ఒక స్త్రీ వలన వాళ్ళిద్దరూ విడిపోతారు అని చెప్పడం జరిగింది. అయితే ఆ స్త్రీ ఎవరు అయ్యి ఉంటారు? వరుణ్ తేజ్ అమ్మగారు అయ్యి ఉంటారా? లేదా వరుణ్ చెల్లి, లావణ్య ఆడపడుచు నిహారిక వల్ల విడిపోతారా అనేది మాత్రం చెప్ప‌లేదు.

వేణు స్వామి చెప్పిన‌ట్టు అలా ఏం జ‌ర‌గ‌ద‌ని కొంద‌రు అంటుంటే, మ‌రి కొంద‌రు మాత్రం జ‌రిగిన ఆశ్చ‌ర్య‌పోన‌క్క‌ర్లేదు అని కామెంట్ చేస్తున్నారు. వేణు స్వామి తెలంగాణ ఎల‌క్ష‌న్స్‌కి ముందు తెలంగాణలో కెసిఆర్ సీఎం అవుతాడు అని చెప్పాడు. ఆయ‌న కాలేదు క‌దా, ఆయ‌న చెప్పిన‌వ‌న్నీ ప్ర‌తిసారి జ‌రిగే అవ‌కాశం లేదు అంటూ కొంద‌రు వ‌రుణ్ తేజ్, లావ‌ణ్య విడాకుల విష‌యాన్ని కొట్టి పారేస్తున్నారు. ఇక వ‌రుణ్ తేజ్ కెరీర్ ఇప్పుడు స‌జావుగా సాగ‌డం లేదు. చివరిగా ‘ఆపరేషన్ వాలెంటైన్’ సినిమాతో ప్రేక్ష‌కుల ముందుకు రాగా, ఈ సినిమా విమర్శల ప్రశంసలు అందుకుందే గాని, కమర్షియల్ గా పెద్దగా వర్క్ అవుట్ అవ్వలేదు. అంతకుముందు వచ్చిన ‘గాండీవధారి అర్జున’ కూడా ప్లాప్ గా నిలిచింది. ప్ర‌స్తుతం ‘మట్కా’ అనే మూవీ చేస్తున్నారు. ఈ మూవీపైనే బోలెడ‌న్ని ఆశ‌లు పెట్టుకున్నాడు.

ramu

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది