Home » Exclusive » Latest News Anantapur January 7th
Exclusive

Anantapur : సొంత మేనమామను పెళ్లి చేసుకుంది.. చివరకు బెడ్ రూమ్ లో విగత జీవిగా మారింది

Authored By
Breaking News 2
The Telugu News | Published on: January 7, 2023, 3:00 pm
Advertisement

Anantapur : సొంత మేనమామను ఓ యువతి పెళ్లి చేసుకుంది. సొంత మేనమామ కాబట్టి తన జీవితం సుఖంగా, సంతోషంగా ఉంటుంది అని భావించింది. కానీ.. తన జీవితం మొత్తం అస్తవ్యస్తం అవుతుందని.. చివరకు అర్థాంతరంగా తన జీవితాన్ని ముగించుకోవాల్సి వస్తుందని ఆ మహిళ ఏనాడూ ఊహించి ఉండదు. ఈ ఘటన ఏపీలోని అనంతపురంలో చోటు చేసుకుంది. శ్రావణి, దుర్గాప్రసాద్.. ఇద్దరికీ 8 ఏళ్ల కింద వివాహం జరిగింది. వాళ్లకు ఒక కూతురు కూడా పుట్టింది.

Advertisement

అనంతపురంలో వీళ్లు నివాసం ఉంటున్నారు. దుర్గాప్రసాద్.. శ్రావణికి స్వయాన మేనమామ. అయితే.. పెళ్లి అయిన కొన్ని రోజుల తర్వాత శ్రావణి, దుర్గాప్రసాద్ ఇద్దరి మధ్య గొడవలు ప్రారంభం అయ్యాయి. తన భర్తతో జరిగే గొడవల గురించి చాలా సార్లు శ్రావణి తన తల్లికి చెప్పి చూసింది. కానీ.. తన తల్లి మాత్రం సర్దుకోవాలంటూ చెప్పుకొచ్చింది. మరోసారి ఇద్దరి మధ్య ఒక రోజు గొడవ జరిగింది. దీంతో ఏం చేయాలో శ్రావణికి అర్థం కాలేదు. దుర్గాప్రసాద్ తీరు ఇక మారదని గ్రహించిన శ్రావణి.. తీవ్రమైన నిర్ణయం తీసుకుంది.

latest news on Anantapur january 7th

Advertisement

మరోసారి తీవ్ర స్థాయిలో గొడవ జరగడంతో తీవ్ర నిర్ణయం తీసుకున్న శ్రావణి

కోపంతో రూమ్ లోకి వెళ్లి డోర్ వేసుకుంది. ఎంత డోర్ కొట్టినా తీయకపోవడంతో దుర్గప్రసాద్ స్థానికులను పిలిచాడు. స్థానికులు అనుమానంతో డోర్ ను బద్దలు కొట్టారు. దీంతో తను ఫ్యాన్ కు ఉరి వేసుకొని వేలాడుతూ కనిపించింది. తను ఫ్యాన్ కు ఉరేసుకొని ఆత్మహత్య చేసుకుంది. ఈ విషయం తెలుసుకొని శ్రావణి తల్లి, అన్న కన్నీరు మున్నీరు అయ్యారు. చిన్న పిల్లను వదిలేసి తల్లి ఆత్మహత్య చేసుకోవడంతో ఆ చిన్నారి పరిస్థితి ఏంటంటూ వాపోయారు. ఈ ఘటన స్థానికంగా సంచలనం సృష్టించింది.

Breaking News 2

Advertisement

Latest News

Related News

The Telugu News మీకు నచ్చిన సైటుగా ఎంచుకోండి