Venkatesh : అంద‌రికి చుక్క‌లు చూపించే బిత్తిరి స‌త్తికి వెంకటేష్ నోట మాట రాకుండా చేసాడుగా..!

Authored By Sam C | The Telugu News | Published on: May 25, 2022, 6:00 pm

Venkatesh : ప్ర‌స్తుతం పెద్ద హీరోల సినిమా హంగామా సాగుతున్న విష‌యం తెలిసిందే. ఇటీవ‌ల స‌ర్కారు వారి పాట చిత్రంవిడుద‌ల కాగా, ఈ సినిమా మంచి విజ‌యం సాధించింది. ఇక ఇప్పుడు ఎఫ్ 3 చిత్రం రిలీజ్ కి సిద్ధంగా ఉంది. మే 27వ తేదీన ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ నేపథ్యంలో ఈ సినిమా ప్రమోషన్స్ ఊపందుకున్నాయి. వెంకటేశ్ .. వరుణ్ తేజ్ .. అనిల్ రావిపూడిని బిత్తిరి సత్తి ఇంటర్వ్యూ చేశాడు. ఆయన ప్రశ్నలకు వెంకటేశ్ స్పందిస్తూ .. “ఈ సినిమాలో నాకు రేచీకటి ఉంటుంది. ఆ సమయంలో నేను ఇచ్చే సలహాలు వినడం వలన వరుణ్ ఇబ్బందులు పడుతుంటాడు.

ఇక్కడే కావలసినంత కామెడీ పండుతుంది. ఈ సినిమాలో ప్రతి పాత్రకి ఒక ప్రత్యేకత ఉంటుంది .. ఆర్టిస్టులంతా కూడా చాలా బాగా చేశారు. అనిల్ రావిపూడి డైలాగ్స్ బాగా రాశాడు. సినిమా మొదలైన దగ్గర నుంచి చివరివరకూ నవ్వుతూనే ఉంటారు.కోవిడ్ తరువాత ఫ్యామిలీ ఎంటర్టైనర్ జోనర్లో ఇలాంటి సినిమా రాలేదు. ఫ్యామిలీ ఆడియన్స్ ను థియేటర్లకు రప్పించే సినిమా ఇది. ఫ్యామిలీలోని అన్ని వయసుల వారు ఎంజాయ్ చేసే సినిమా ఇది అని చెప్పారు. ‘ఎఫ్ 2’ చేసిన ధైర్యంతోనే ‘ఎఫ్ 3’ చేసుకుంటూ వెళ్లాను. నేను కూడా కామెడీ బాగా చేశానని అంతా అంటూ ఉంటే చాలా సంతోషంగా ఉందని అన్నాడు. ఇక చిలక ఫ్లైయింగ్ లో ఉందనీ ..

venkatesh comments on Bittiri satti

venkatesh comments on Bittiri satti

Venkatesh : మ‌స్త్ మ‌జా..

దానికీ తనకి బ్లూటూత్ కనెక్షన్ ఉందంటూ బిత్తిరి సత్తి చెప్పిన చిలక జోష్యం బాగుంది అని వ‌రుణ్ తేజ్ అన్నారు.అనిల్ రావిపూడి మనసులో ఏవుందని చిలకనడుగుతూ తమన్నా .. పూజ హెగ్డే ఫొటోలను బయటికి తీయడం వెంకటేశ్ మనసులో ఏవనుకుంటున్నారు? అంటూ దిల్ రాజు ఫొటోలు బయటికి తీయడం .. అలాగే వరుణ్ తేజ్ విషయానికి వచ్చేసరికి పెళ్లి – మంచం ఫొటోలు తీసి పిలగాడు ఇక ఆగేట్టులేడు నాగబాబుగారు అంటూ నవ్వులు పూయించాడు. బిత్తిరి సత్తిరి మాదిరిగా ప్రతి పదాన్ని ‘ఫ’కారంతో పలుకుతూ ఆయనను వెంకటేశ్ ఆటపట్టించడం మరింత రక్తి కట్టించింది. అసలు వెంక‌టేష్ సినిమాలోనే కాదు ఇంట‌ర్వ్యూలోను తెగ ర‌చ్చ చేశాడు. ఈ వీడియో వైర‌ల్‌గా మారింది.

Sam C

No bio available for this author.

  1. "Tirumala Darshan : ₹300 టికెట్ మాత్రమే కాదు.. శ్రీవారి దర్శనానికి ఇన్ని మార్గాలున్నాయా?"

  2. "Fruits Myths : రాత్రి పండ్లు తింటే హానా?.. స్మూతీలో ఫైబర్ పోతుందా?"

  3. "Saara Palekar : ‘డోంట్ ట్రబుల్ ది ట్రబుల్’లో స్పెషల్ అట్రాక్షన్ ఈ పాపే.. సారా పాలేకర్ ఎవరో తెలుసా?"

  4. "Shubman Gill : గిల్ డబుల్ సెంచరీ.. 406 పరుగులు ఛేజ్ చేసి సిరీస్ గెలిచిన భారత్..!"

  5. "Jr NTR Dragon : ఫౌజీ చేసిన పెద్ద తప్పును ‘డ్రాగన్’ టీమ్ రిపీట్ చేస్తుందా? ఎన్టీఆర్ ఫ్యాన్స్‌లో మొదలైన గుబులు..!"

  6. "Nabha Natesh : సముద్రం మధ్యలో నభా నటేష్ స్టన్నింగ్ లుక్.. వైరల్ అవుతున్న వెకేషన్ పిక్స్"

  7. "Perni Nani : మచిలీపట్నంలో పేర్ని నానికి తీవ్ర నిరసన సెగ.. సొంత పార్టీ కేడరే తిరగబడటంతో టెన్షన్!"

Google The Telugu News మీకు నచ్చిన సైటుగా ఎంచుకోండి
WhatsApp