Venkatesh : వెంకీ బాబాయి మళ్లీ ప్రయోగం.. అవసరమా బాబు!

Authored By Prahbas Gilakathula | The Telugu News | Updated on : 11 August 2022, 9:00 pm

Venkatesh : టాలీవుడ్ స్టార్ హీరోల్లో విక్టరీ వెంకటేష్. ఆయన స్టార్ హీరోల్లో టాప్ లో ఉండేవారు. అలాంటి స్టార్ హీరో ఇప్పుడు వరుసగా సినిమాలు చేయడంలో విఫలమవుతున్నాడు. ఆయన నటించిన సినిమాలు బాక్సాఫీస్ వద్ద బొక్క బోర్ల పడడంతో పాటు ఆయన వరుసగా సినిమాలు చేసేందుకు ఆసక్తి చూపడం లేదు అనేది సమాచారం. ఆయన స్టార్ హీరో కనుక వరుసగా సినిమాలు వస్తూనే ఉంటాయి, కానీ ఆయనకు సరిపడా కథలు మాత్రం రావడం లేదు అంటూ కొందరు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. ఆయన అవకాశాల గురించి ఎవరికి అనుమానం లేదు, కానీ ఆయన యొక్క సినిమాల ఎంపిక ప్రస్తుతం చర్చనీయాంశంగా మారింది. వరుసగా కమర్షియల్ సినిమాలు కాకుండా విభిన్న సినిమాలను ఆయన చేయడం వల్ల కెరియర్ కాస్త అటు ఇటు అయింది అంటూ కొందరు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. ఆ విషయంలో వెంకటేష్ ఇప్పటికైనా కొత్త నిర్ణయాన్ని తీసుకోవాలని అభిమానులు కోరుకుంటున్నారు.

రెగ్యులర్ గా కమర్షియల్ ఎంటర్టైన్మెంట్ సినిమాలను చేయడం ద్వారా మంచి సక్సెస్ లను దక్కించుకునే అవకాశం ఉంది కానీ ఆయన మాత్రం అలా రెగ్యులర్ కమర్షియల్ సినిమాలకు బదులు ప్రయోగాత్మక సినిమాలను చేసేందుకు ఆసక్తి చూపిస్తున్నారు. ఆయన కనుక మళ్ళీ మళ్ళీ ప్రయోగాత్మక సినిమాలు చేస్తే హీరోగా ఆయన కెరియర్ మసక బారిపోయినట్లే అవుతుందంటూ కొందరు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. ఈ సమయంలో వెంకటేష్ యొక్క కొత్త సినిమా గురించి ఆసక్తికర చర్చ జరుగుతుంది. ఆయనతో పలువురు దర్శకులు సినిమాలు చేసేందుకు రెడీగా ఉన్నా కూడా ఆయన మాత్రం చాలా విభిన్నమైన సినిమాలను చేసే ఉద్దేశంతో ప్రయోగాత్మక సినిమాలను చేసే ఉద్దేశంతోనే కొత్త కథలను వింటున్నాడు. ఇటీవల ఆయన ఒక విభిన్నమైన కథను విన్నాడని ఆ కథకు ఓకే చెప్పాడని సమాచారం అందుతుంది.

Venkatesh fans unhappy with his movies

Venkatesh fans unhappy with his movies

రీమేక్లతో పాటు ప్రయోగాత్మక సినిమాలు చేయడం ద్వారా ఈ సమయంలో ఆయన కెరియర్లో సక్సెస్ అవ్వాలని తీవ్రంగా ప్రయత్నాలు చేస్తున్నారు. కానీ కమర్షియల్ సినిమాలతో సక్సెస్ అయినంతగా రెగ్యులర్ ప్రయోగాత్మక సినిమాలో సక్సెస్ అవ్వవు అనేది ఆయన గుర్తుంచుకోవాలి అంటూ అభిమానులు విజ్ఞప్తి చేస్తున్నారు. ఎంతో మంది సీనియర్ స్టార్ హీరోలు కమర్షియల్ సినిమాలు చేస్తూ వరుసగా సక్సెస్ లు దక్కించుకుంటూ ఉంటే వెంకటేష్ మాత్రం ప్రయోగాత్మక సినిమాలో అంటూ ఈ సమయంలో వరుస ప్లాపులకు ఎందుకు గురి కావాల్సి వస్తుంది అంటూ కొందరు అసహనం వ్యక్తం చేస్తున్నారు. ప్రస్తుతం వెంకటేష్‌ ఓరి దేవుడా అనే సినిమాలో చిన్న పాత్రలో కనిపించబోతున్నట్లుగా తెలుస్తోంది. విశ్వక్సేన్ హీరోగా నటిస్తున్న ఆ సినిమాలో వెంకటేష్ దేవుడిగా కనిపించబోతున్నట్లుగా తెలుస్తోంది. ఆ సినిమా సంగతి పక్కన పెడితే మరో యువ దర్శకుడికి విభిన్నమైన కథ అంటూ ఓకే చెప్పాడట, ఆ కథ ఎలా ఉంటుంది మరో ప్రయోగానికి వెంకటేష్ సిద్ధమైతే ప్రేక్షకులు ఆదరిస్తారా అనేది చూడాలి.

Prahbas Gilakathula

Prabhas Gilakathula Content Writer experiened in Digital media field. Iam worked in various Telugu media for about 5 years. Worked in Namasthe Telangana, Telugu Rajyam , as a telugu content writer. I wrote various Latest Breaking News , politics, interesting stories, Andhr Pradesh & Telangana local news, health, technology, entertainment , Devotional, etc. He is also Social Media Expert, Technical Expert . He is present content writer of thetelugunews.com website. Contact details: Prabhas29nov@gmail.com

Google The Telugu News మీకు నచ్చిన సైటుగా ఎంచుకోండి