Venkatesh : వివాదాల‌కు దూరంగా ఉండే వెంక‌టేష్‌పై ఆ త‌ప్పుడు ప్ర‌చారం ఎందుకు చేశారు..! | The Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు

Venkatesh : వివాదాల‌కు దూరంగా ఉండే వెంక‌టేష్‌పై ఆ త‌ప్పుడు ప్ర‌చారం ఎందుకు చేశారు..!

 Authored By sandeep | The Telugu News | Updated on :9 November 2022,12:20 pm

Venkatesh : విక్ట‌రీ వెంక‌టేష్ గురించి ప్ర‌త్యేక ప‌రిచ‌యాలు అక్క‌ర్లేదు. టాలీవుడ్ సీనియ‌ర్ హీరోల‌లో ఆయ‌న ఒక‌రు కాగా, కెరీర్‌లో ఎన్నో వైవిధ్య‌మైన సినిమాల‌తో ప‌ల‌క‌రించారు. హీరో గా వెంకటేష్ సినీ కెరియర్ లో ఎన్నో సూపర్ డూపర్ హిట్స్ దక్కించుకున్న విషయం తెలిసిందే.కానీ ఈ మధ్య కాలం లో ఆయన సినిమా లు ఎక్కువ చేయక పోవడం తో అభిమానులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.30 సంవత్సరాల క్రితం కే. రాఘవేంద్రరావు దర్శకత్వంలో వచ్చిన ‘కలియుగ పాండవులు’ సినిమాతో వెంకటేష్ హీరోగా పరిచయం అయ్యాడు.

తొలి సినిమాతోనే వెంకటేష్ సూపర్ హిట్ కొట్టారు. ఆ రోజుల్లోనే 12 కేంద్రాల్లో అర్ధ శత దినోత్సవం జరుపుకుంది. ఈ సినిమా కొన్ని కేంద్రాల్లో వంద రోజులు కూడా ఆడింది. విజయవాడలో కలియుగ పాండవులు శత దినోత్సవం సినిరంగానికి చెందిన అతిరథ మహారధుల సమక్షంలో ఎంతో గ్రాండ్‌గా జరిపించారు. ఇక ఈ సినిమా త‌ర్వాత వెనక్కి తిరిగి చూసుకోలేదు. తాజాగా వెంకీ కుడుముల దర్శకత్వం లో వెంకటేష్ సినిమా కన్ఫర్మ్ అయింది అంటూ సమాచారం అందుతోంది. సినిమా ను ప్రముఖ తెలుగు నిర్మాత నిర్మించేందుకు సిద్ధమవుతున్నాడని ప్రీ ప్రొడక్షన్ వర్క్ కోసం ఆయన భారీగా ఖర్చు చేస్తున్నాడు అంటూ వార్తలు వస్తున్నాయి.

venkatesh gets rumors on that topic

venkatesh gets rumors on that topic

Venkatesh : ఆ ఒక్క విష‌యంలోనే..

అయితే వెంకటేష్ ఏ పాత్రలో నటించిన ఆ పాత్రలో లీనమైపోతారనే విష‌యం తెలిసిందే. ఇక సినిమా కథలో వేలు పెట్టడం సెట్‌లో ఇతరులతో గొడవ పడటం లాంటి విమర్శలు వెంకటేష్ పై ఎప్పుడు రాలేదు. అలాగే హీరోయిన్ల విషయంలోనూ వెంకటేష్ పెద్దగా వార్తల్లోకి ఎక్కలేదు. అయితే రీమేక్ హీరో అంటూ ప‌లు విమ‌ర్శ‌లు ఎదుర్కొన్నాడు వెంకీ. తమిళంలో, మలయాళంలో, హిందీలో హిట్ అయిన సినిమాల్లోనే ఎక్కువగా నటించేవారని… రీమేక్ సినిమాల్లో నటించి ఎక్కువ హిట్లు కొట్టిన రీమేకుల‌ హీరోగా వెంకటేష్‌కు ముద్ర పడిపోయింది. కెరీర్‌లో ఎక్కువ రీమేక్ సినిమాలో నటించి హిట్‌లు కొట్టారన్న ఒక్క అపవాదు మినహా ఆయన కెరీర్ మొత్తం మీద ఏనాడు విమ‌ర్శ‌లు ఎదుర్కోలేదు.

Advertisement
WhatsApp Group Join Now

sandeep

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది