Venu Swamy : మెగా ఫ్యాన్స్ కి గుండె పగిలిపోయే న్యూస్.. వరుణ్ – లావణ్య త్వరలోనే విడాకులు తీసుకుంటారని చెప్పిన వేణు స్వామి..!! | The Telugu News : Latest Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు | బ్రేకింగ్ న్యూస్ తెలుగు

Venu Swamy : మెగా ఫ్యాన్స్ కి గుండె పగిలిపోయే న్యూస్.. వరుణ్ – లావణ్య త్వరలోనే విడాకులు తీసుకుంటారని చెప్పిన వేణు స్వామి..!!

Venu Swamy : రెండు తెలుగు రాష్ట్రాల ప్రజలకు వేణు స్వామి గురించి ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు. సినీ సెలబ్రిటీల గురించి సంచలమైన వ్యాఖ్యలు చేస్తూ తెలుగు సినీ ఇండస్ట్రీలో ఫేమస్ ఆస్ట్రాలజర్ గా మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు. అంతేకాక కొందరు సెలబ్రిటీల గురించి వేణు స్వామి చెప్పిన విషయాలు నిజం కావడంతో ఈయనపై సినీ సెలబ్రిటీలకు అపారమైన నమ్మకం కూడా కలిగింది. అలాగే ఆయన చెప్పినవి కొన్ని అబద్ధాలుగా కూడా మారాయి. కానీ […]

 Authored By aruna | The Telugu News | Updated on :8 December 2023,4:00 pm

ప్రధానాంశాలు:

  •  Venu Swamy : మెగా ఫ్యాన్స్ కి గుండె పగిలిపోయే న్యూస్..

  •  వరుణ్ - లావణ్య త్వరలోనే విడాకులు తీసుకుంటారని చెప్పిన వేణు స్వామి..!!

Venu Swamy : రెండు తెలుగు రాష్ట్రాల ప్రజలకు వేణు స్వామి గురించి ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు. సినీ సెలబ్రిటీల గురించి సంచలమైన వ్యాఖ్యలు చేస్తూ తెలుగు సినీ ఇండస్ట్రీలో ఫేమస్ ఆస్ట్రాలజర్ గా మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు. అంతేకాక కొందరు సెలబ్రిటీల గురించి వేణు స్వామి చెప్పిన విషయాలు నిజం కావడంతో ఈయనపై సినీ సెలబ్రిటీలకు అపారమైన నమ్మకం కూడా కలిగింది. అలాగే ఆయన చెప్పినవి కొన్ని అబద్ధాలుగా కూడా మారాయి. కానీ ఎక్కువగా ఆయన చెప్పినవి జరగడంతో చాలామంది ఆయనను ఎంత ఎంతగానో విశ్వసిస్తున్నారు. ఈ క్రమంలోనే తాజాగా తెలంగాణ ఎన్నికల నేపథ్యంలో ఈసారి సీఎం ఖచ్చితంగా కేసీఆర్ అవుతారని చెప్పి వేరే స్వామి అడ్డంగా బుక్ అయ్యారు.

ఎందుకంటే ఆయన చెప్పిన దానికి విరుద్ధంగా కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చి రేవంత్ రెడ్డి సీఎంగా ప్రమాణ స్వీకారం చేశాడు. అయితే తాజాగా వేణు స్వామి ఇటీవల పెళ్లి చేసుకుని వారి లైఫ్ ని ఎంజాయ్ చేస్తున్న వరుణ్ తేజ్ లావణ్య త్రిపాఠి ల గురించి సంచలన వ్యాఖ్యలు చేశాడు. దీంతో ప్రస్తుతం దీనికి సంబంధించిన న్యూస్ సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంది. తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న వేణు స్వామి మాట్లాడుతూ లావణ్య త్రిపాఠి, వరుణ్ తేజ్ విడిపోతారంటూ సంచలన విషయాన్ని బయట పెట్టాడు. అయితే వేణు స్వామి ఇప్పటికే నయనతార పెళ్లి జీవితం కలిసి రాదని, అలాగే సమంత నాగ చైతన్య విడిపోతారని చెప్పడం జరిగింది.

అదేవిధంగా రకుల్ ప్రీత్ సింగ్, అనుష్క, రష్మిక లకి పెళ్లి జీవితం సరిగా ఉండదని చెప్పుకొచ్చారు. ఇక వేణు స్వామి చెప్పిన వాటిలో నాగచైతన్య సమంత నిజంగానే విడాకులు తీసుకుని విడిపోయారు. ఇక తాజాగా మెగా ఫ్యామిలీ హీరో వరుణ్ తేజ్ లావణ్య త్రిపాఠిలకు కూడా పెళ్లి జీవితం కలిసి రాదని త్వరలోనే విడిపోతారని వేణు స్వామి చేసిన వ్యాఖ్యలు తీవ్ర చర్చనియాంశంగా మారాయి. లావణ్య మరియు వరుణ్ జాతకాలలో గురుడు, శుక్రుడు ఇద్దరు నీచ స్థానంలో ఉన్నారని , కావున భవిష్యత్తులో వీరు కలిసి ఉంటారో లేదో అని నమ్మకం లేదంటూ చెప్పుకొచ్చారు.

అదేవిధంగా లావణ్య కు కుజదోషం ఉందని, వరుణ్ తేజ్ కు నాగదోషం ఉందని, అందుకే వీరిద్దరూ భవిష్యత్తులో కలిసి ఉండటం కష్టమే అంటూ వేణు స్వామి తెలియజేశారు. దీంతో ప్రస్తుతం వేణు స్వామి చేసిన వ్యాఖ్యలు సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున దుమారం లేపుతున్నాయి. వేణు స్వామి మాటలు విన్న మెగా అభిమానులు ఆయనపై మండిపడుతున్నారు. పెళ్లయిన జంటను కనీసం హ్యాపీగా ఉండనివ్వకుండా నీ చెత్త జ్యోతిష్యాలతో ఎందుకు ఇబ్బంది పెడతావ్ అంటూ తిట్టిపోస్తున్నారు. నీ జాతకమే బాగుంటే ఇంకొకరి జాతకం చెప్పవు కదా అంటూ మరికొందరు కామెంట్స్ చేస్తూ ఆయనపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

aruna

డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్రత్యేక