Venu Swamy : వేణు స్వామి చుట్టూ బిగిస్తున్న ఉచ్చూ.. రష్మికకి అలాంటి పూజలు చేస్తున్నాడా..!
Venu Swamy : ప్రముఖ జ్యోతిష్కుడు వేణు స్వామి గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఆయన సమంత- నాగ చైతన్యల విడాకులు గురించి ముందుగానే చెప్పడంతో వేణు స్వామి పేరు ఒక్కసారిగా మారుమ్రోగింది. ఆ తర్వాత పలువురు సినీ, రాజకీయ ప్రముఖుల జాతకాలు కూడా చెప్పారు. నాగచైతన్య-శోభిత ధూళిపాళ్ల నిశ్చితార్థం తర్వాత ప్రముఖ జ్యోతిష్యుడు వేణు స్వామి హాట్ టాపిక్ గా మారారు. ఎంగేజ్ మెంట్ జరిగిన మరుసటి రోజే వీరి వైవాహిక జీవితంపై జోస్యం చెప్పి సంచలనం […]
ప్రధానాంశాలు:
Venu Swamy : వేణు స్వామి చుట్టూ బిగిస్తున్న ఉచ్చూ.. రష్మికకి అలాంటి పూజలు చేస్తున్నాడా..!
Venu Swamy : ప్రముఖ జ్యోతిష్కుడు వేణు స్వామి గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఆయన సమంత- నాగ చైతన్యల విడాకులు గురించి ముందుగానే చెప్పడంతో వేణు స్వామి పేరు ఒక్కసారిగా మారుమ్రోగింది. ఆ తర్వాత పలువురు సినీ, రాజకీయ ప్రముఖుల జాతకాలు కూడా చెప్పారు. నాగచైతన్య-శోభిత ధూళిపాళ్ల నిశ్చితార్థం తర్వాత ప్రముఖ జ్యోతిష్యుడు వేణు స్వామి హాట్ టాపిక్ గా మారారు. ఎంగేజ్ మెంట్ జరిగిన మరుసటి రోజే వీరి వైవాహిక జీవితంపై జోస్యం చెప్పి సంచలనం సృష్టించారు.. గతంలో నాగ చైతన్య- సమంతల పెళ్లి బంధం గురించి ఎలాంటి కామెంట్స్ చేశారో నాగ చైతన్య- శోభితలపై కూడా అలాంటి కామెంట్సే చేశారు వేణు స్వామి.
Venu Swamy ఇరకాటంలో వేణు స్వామి..
దీంతో అక్కినేని అభిమానులు స్వామీజీపై ఫైర్ అవుతున్నారు. మరోవైపు జర్నలిస్టు సంఘాలు, మహిళా కమిషన్ కూడా వేణు స్వామిపై మండిపడ్డాయి. ప్రస్తుతం ఈ వివాదం ఇంకా కొనసాగుతూనే ఉంది. వేణు స్వామి అసలు బ్రాహ్మణుడే కాదని బ్రాహ్మణ చైతన్య వేదిక అధ్యక్షుడు సిరిపురపు శ్రీధర్ శర్మ అన్నారు. ఆయన అసలు పేరు పరాశరం వేణు అని తెలిపారు. బ్రాహ్మణుడిగా చెప్పుకుంటూ జ్యోతిష్యం పేరుతో అందరినీ మోసం చేస్తున్నాడని మండిపడ్డారు. రాజకీయ నాయకులను, సినిమా ఇండస్ట్రీ ప్రముఖులను, సభ్య సమాజాన్ని జ్యోతిషం పేరుతో మోసం చేస్తున్నాడని ఆరోపించారు. అయితే వేణుస్వామి, ఆయన భార్య వీణా ఇటీవల చేసిన ఆరోపణలపై సదరు మీడియా ఛానెల్స్ ప్రతినిధులు సవాల్ విసరడమే కాకుండా ఆయన అవాస్తవ, అసత్య జ్యోతిష్యాలను బయటపెట్టారు.
రష్మిక మందన్నకు చేసిన పూజల గురించి బట్టబయలు చేశారు. ఆయనకు పూజలు, క్రతువులు, యాగాలు చేయడం రాదు. ఆయనకు వేద మంత్రాలు వల్లించడం కూడా తెలియదు అంటూ రష్మిక మందన్నకు పూజలు చేస్తున్న వీడియోను బయటపెట్టారు. రష్మిక మందన్నకు రాజ శ్యామల యాగం చేసిన తర్వాత ఆమెకు ఆశీర్వాదం ఇస్తున్న తీరును కొందరు తప్పు పట్టారు. ఆయనకు మంత్రాలు కూడా చదవడం రాదు. సంప్రోక్షన బదులు, తలపై తమలపాకుతో నీళ్లు ధారగా పోస్తున్నాడు. అది తప్పు అంటూ విమర్శించారు. ఇలా మీడియా, వేణుస్వామి మధ్య రష్మిక మందన్న ఇరుక్కొన్నారనే విషయం చర్చనీయాంశమైంది.