Venu Swamy : స్టార్ హీరోయిన్ ఇంట్లో ప్రత్యేక పూజలు నిర్వహించిన వేణు స్వామి
Venu Swamy : ఆస్ట్రాలజర్ వేణు స్వామి అంటే తెలియని వారు ఎవరు ఉండరు. సోషల్ మీడియాలో జాతకాలు చెబుతూ బాగా ఫేమస్ అయ్యారు. మరి ముఖ్యంగా సెలబ్రిటీల జాతకాలతో పాటు రాజకీయ నాయకుల జాతకాలు చెబుతూ బాగా వైరల్ అయ్యారు. అయితే ఇండస్ట్రీలో చాలా మంది వేణు స్వామి చెప్పిన జాతకాలు నిజమైతాయని నమ్ముతారు. మరి ముఖ్యంగా నాగచైతన్య ,సమంత విడాకుల విషయంలో వేణు స్వామి చెప్పింది జరగడంతో ఆయనని అందరూ నమ్మడం మొదలుపెట్టారు. దానితో పాటుగా కొందరు అనారోగ్యానికి గురవుతారని మరికొందరు మరణిస్తారని వేణు స్వామి చెప్పారు. వీటిలో కూడా కొన్ని నిజం అవ్వడంతో ఆయన పాపులారిటీ మరింత పెరిగింది. దీంతో సెలబ్రిటీలు మొత్తం వేణి స్వామితో పూజలు చేయించుకుంటున్నారు.
స్టార్ హీరోయిన్స్ రష్మిక మందాన మరియు నిధి అగర్వాల్ కూడా వేణు స్వామి తో పూజలు చేయించుకున్నారు. హీరోయిన్లతో పాటు బుల్లితెర నటులు ఇనాయ సుల్తాన్, అషు రెడ్డి వంటి వారు కూడా పూజలు చేయించుకున్నారు.అయితే తాజాగా వీరి బాటలోనే మరో స్టార్ హీరోయిన్ కూడా వేణు స్వామి తో ప్రత్యేక పూజలు చేయించుకున్నారు. ప్రస్తుత కాలంలో ఫేమస్ అయింది ఈ బ్యూటీ. ఈ ముద్దుగుమ్మ ఎవరో కాదు కన్నడ యంగ్ హీరోయిన్ నిశ్విక నాయుడు. ప్రభుదేవా తో పోటీ పడుతూ డాన్స్ చేసి మంచి గుర్తింపు తెచ్చుకున్న ఈ ముద్దుగుమ్మ కరటక దమనక అనే సినిమాలో ప్రభుదేవా తో పాటు కలిసి నటించింది. ఇక త్వరలోనే ఈ అమ్మడు తెలుగులోకి అడుగు పెడుతుంది అని సమాచారం.
Venu Swamy : స్టార్ హీరోయిన్ ఇంట్లో ప్రత్యేక పూజలు నిర్వహించిన వేణు స్వామి
ఈ నేపథ్యంలోనే ఆమె వేణు స్వామితో ప్రత్యేక పూజలు చేయించుకుంది. దీంతో ఈ ఫోటోలు నెట్టింట వైరల్ గా మారాయి. అయితే ఈ ఫోటోలపై నెటిజన్లు కామెంట్ల వర్షం కురిపిస్తున్నారు. ఇటీవల కాలంలో వేణు స్వామి చెప్పిన జ్యోతిష్యంతో ఆయనపై నెటిజన్లు భారీగా ట్రోల్స్ చేస్తున్నారు. ఏపీలో జగన్ మరోసారి సీఎం అవుతారని వైసీపీ ప్రభుత్వం విజయం సాధిస్తుంది అని వేణు స్వామి చెప్పారు. కానీ అలా జరగపోవడంతో ఆయన చెప్పినవి అబద్ధాలు అని నేటిజన్స్ ట్రోల్స్ చేశారు. ఇక దీనితో ఆయన రాజకీయాలపై జ్యోతిష్యం చెప్పను అని ఒక వీడియోని కూడా రిలీజ్ చేయడం జరిగింది. ఇప్పుడు ఈ హీరోయిన్ పూజలు చేయించుకోవడంతో నెటిజెన్లు క్రేజీ కామెంట్లు చేసున్నారు.
Manchu Manoj | ఇటీవలే భైరవ సినిమాతో గ్రాండ్ రీ ఎంట్రీ ఇచ్చిన హీరో మంచు మనోజ్, సినిమాలతో పాటు…
Lord Ganesh | వినాయక చవితి వేడుకలు ఇంకా ప్రారంభం కాకముందే హైదరాబాద్‌లో అపశృతి చోటుచేసుకుంది. గణేష్ విగ్రహాన్ని మండపానికి తీసుకెళ్తుండగా…
Rains | రాష్ట్రంలోని పలు జిల్లాల్లో మంగళ, బుధవారాల్లో భారీ వర్షాలు (Heavy Rains) కురిసే అవకాశం ఉందని హైదరాబాద్…
Kiwi fruit | ఇటీవలి కాలంలో ఆరోగ్యంపై అవగాహన పెరిగిన నేపథ్యంలో పోషకాలు పుష్కలంగా ఉండే పండ్లకు డిమాండ్ ఎక్కువవుతోంది.…
Ginger | బరువు తగ్గడానికి స్పెషల్ డైట్ లేదా ఖరీదైన ఆహారం అవసరమే లేదు. మన ఇంట్లో దొరికే సాదాసీదా…
Morning Tiffin | రాత్రంతా నిద్రపోయిన తర్వాత శరీరం ఖాళీగా ఉంటుంది. ఆ సమయంలో శక్తి అవసరం అవుతుంది. అందుకే ఉదయం…
Health Tips | బొప్పాయి మంచి పోషకాలతో నిండి ఉండే పండు. ఇందులో విటమిన్లు ఎ, సి, ఇ ఎక్కువగా…
Banana peel Face Pack | మెరిసే చర్మం ఎవరికైనా ఇష్టమే! అందుకే మార్కెట్‌లో లభించే విభిన్నమైన బ్యూటీ క్రీములకు ఎంతో…
This website uses cookies.