Sankranthiki Vasthunnam : సంక్రాంతికి వస్తున్నాం ఇవేం ప్రమోషన్స్ సామి.. బుల్లితెరని కూడా వదల్లేదుగా..!
ప్రధానాంశాలు:
Sankranthiki Vasthunnam : సంక్రాంతికి వస్తున్నాం ఇవేం ప్రమోషన్స్ సామి.. బుల్లితెరని కూడా వదల్లేదుగా..!
Sankranthiki Vasthunnam : సంక్రాంతి సినిమాల రిలీజ్ లో భారీ అంచనాలతో వస్తున్న సినిమా విక్టరీ వెంకటేష్ Victory Venkatesh సంక్రాంతికి వస్తున్నాం. సక్సెస్ ఫుల్ డైరెక్టర్ Anil Ravipudi అనీల్ రావిపూడి డైరెక్షన్ లో తెరకెక్కిన ఈ సినిమాను దిల్ రాజు నిర్మించారు. సినిమా జనవరి 14 మంగళవారం రిలీజ్ అవుతుంది. సంక్రాంతి పండగ రోజు రిలీజ్ అవుతున్న ఈ సినిమా కోసం ప్రమోషన్స్ ని ఒక రేంజ్ లో ప్లాన్ చేస్తున్నారు డైరెక్టర్ అనీల్ రావిపూడి. అదేంటో ఈ సినిమాను ఇలా ప్రమోట్ చేయాలని షూటింగ్ టైం లోనే ఫిక్స్ అయ్యారు అనుకుంటా సినిమా సెట్స్ లోనే ప్రమోషనల్ యాక్టివిటీస్ కనిపిస్తున్నాయి. అంటే ఒక సాంగ్ లొకేషన్ లో సినిమా ప్రమోషన్ కనిపిస్తుంది. ఇలా చాలా రకాలుగా ప్రమోషన్స్ తో అదరగొట్టారు. మరోపక్క స్మాల్ స్క్రీన్ మీద కూదా సంక్రాంతికి వస్తున్నాం ప్రమోషన్స్ అదిరిపోయాయి.
Sankranthiki Vasthunnam : సినిమాకు కూడా మంచి బూస్టింగ్..
స్టార్ మా సంక్రాంతి వేడుకలు గోల్డెన్ స్టార్స్ వర్సెస్ ట్రెండింగ్ స్టార్స్ ఎపిసోడ్ లో విక్టరీ వెంకటేష్ కూడా గెస్ట్ గా వచ్చి అలరించారు. షో సక్సెస్ అవ్వడమే కాదు ఆ షో ద్వారా సంక్రాంతికి వస్తున్నాం సినిమాకు కూడా మంచి బూస్టింగ్ దొరికేలా ఉంది. సినిమా ప్రమోషన్స్ లో పి.హెచ్.డి చేసినట్టు కనిపిస్తున్న అనీల్ రావిపూడి Anil Ravipudi దేన్ని కూడా వదలట్లేదు.
ఈ కాలంలో సినిమా తీయడం కన్నా జనాల్లోకి తీసుకెళ్లడం చాలా ఇంపార్టెంట్ అయ్యింది. అది కష్టంతో కూడుకున్న పని అని కొందరు భావిస్తారు. కానీ సంక్రాంతికి వస్తున్నాం టీం మాత్రం ఇక్కడ అక్కడ అనే కాదు ఎక్కడైనా ప్రమోట్ చేస్తున్నారు. సినిమా ప్రమోషన్స్ లో భాగంగానే బాలయ్య అన్ స్టాపబుల్ Unstoppable కి వెళ్లిన వెంకటేష్ లేటెస్ట్ గా అమెజాన్ ప్రైం లో ది రానా దగ్గుబాటి షోకి కూడా వెళ్లి సందడి చేశారు. చెప్పాలంటే బాలకృష్ణ డాకు మహారాజ్ కన్నా ప్రమోషన్స్ లో సంక్రాంతికి వస్తున్నాం ముందుందని చెప్పొచ్చు. ఈ రేంజ్ ప్రమోషన్స్ కి సినిమాకు హిట్ టాక్ వస్తే కలెక్షన్స్ అదిరిపోతాయి. Victory Venkatesh, Sankranthiki Vastunnam,