Nayanthara : న‌య‌న‌తార కౌగిలిలో బంధీ అయిన విఘ్నేష్ శివన్.. క్యూట్ పిక్‌కి ఫిదా అవుతున్న కుర్ర‌కారు

Authored By Sam C | The Telugu News | Published on: July 3, 2022, 9:00 pm

Nayanthara : సినిమా ఇండ‌స్ట్రీలో ప్రేమ వ్య‌వ‌హ‌రాలు కొత్తేమి కాదు. చాలా మంది ప్రేమాయణం సాగిస్తూ ఉంటారు. కానీ, అందులో చాలా తక్కువ మంది మాత్రమే తమ బంధాన్ని పెళ్లి పీటల వరకూ తీసుకుని వెళ్తారు. అలాంటి వారిలో ఎన్నో ఏళ్ల పాటు ప్రేమ పక్షుల్లా విహరించి, ఇటీవలే ఒక్కటైన లేడీ సూపర్ స్టార్ నయనతార.. ప్రముఖ దర్శకుడు విఘ్నేష్ శివన్ జంట ఒకటి. పెళ్లి తర్వాత వైవాహిక జీవితాన్ని సంతోషంగా గ‌డుపుతున్నారు. ఇటీవ‌ల‌ హనీమూన్‌కు వెళ్లిన ఈ కపుల్.. అక్కడ యమ రొమాంటిక్‌గా గడిపారు. అందుకు సంబంధించిన పిక్స్ నెట్టింట హ‌ల్చ‌ల్ చేస్తున్నాయి. కెరీర్ పరంగా నయనతార ఎంత సక్సెస్ అయిందో..

ప్రేమ వ్యవహారాల విషయంలో మాత్రం పలుమార్లు విఫలమైంది. గతంతో పలువురితో ప్రేమాయణం సాగించిన ఈమె.. వాళ్లతో బంధాన్ని మాత్రం పెళ్లి వరకూ తీసుకెళ్లలేదు. ఇలా కొన్ని బ్రేకప్‌ల తర్వాత నయన్.. విఘ్నేష్ శివన్ అనే కోలీవుడ్ డైరెక్టర్‌తో లవ్ ట్రాకును మొదలెట్టి.. నాలుగేళ్ల పాటు అతడితో బంధాన్ని కొనసాగించింది. జూన్ 9న తమిళనాడులోని మహాబలిపురంలో ఉన్న షెరటాన్ హోటల్‌‌‌లో పెళ్లి చేసుకున్నారు. ఇందుకోసం భారీ ఏర్పాట్లు చేసుకున్నారు. బీచ్ వ్యూ ఉండే ఈ హోటల్‌లో ప్రముఖ దర్శకుడు గౌతమ్ మీనన్ పర్యవేక్షణలో వర్క్ జరిగింది. దీంతో ఈ పెళ్లి దేశ వ్యాప్తంగా హాట్ టాపిక్ అయిన విషయం తెలిసిందే.

vignesh shivan hugs to Nayanthara

vignesh shivan hugs to Nayanthara

Nayanthara : క్యూట్ పిక్..

హనీమూన్‌లో జంటగా సందడి చేసిన నయనతార – విఘ్నేష్ శివన్.. ఈ ట్రిప్‌లో తన మధురానుభూతులను కెమెరాల్లో బంధించారు. ఇందులో భాగంగానే అక్కడ గడిపిన క్షణాలకు తాలుకా ఫొటోలు, వీడియోలను సోషల్ మీడియా వేదికగా ఫ్యాన్స్‌తో పంచుకున్నారు. దీంతో వీళ్లిద్దరి అభిమానుల నుంచి వాటికి భారీ రెస్పాన్స్ దక్కేది. ఫలితంగా ఇవి విపరీతంగా వైరల్ అయ్యాయి.తాజాగా విఘ్నేష్ శివ‌న్ త‌న స‌తీమ‌ణి న‌య‌న‌తార కౌగిలిలో బంధీగా ఉన్న ఒక పిక్ షేర్ చేశాడు. ఇందులో వీరిద్ద‌రు చాలా ప్రేమ‌గా క‌నిపిస్తున్నారు. ఈ పిక్ నెటిజ‌న్స్‌ని ఎంత‌గానో ఆక‌ట్టుకుంటుంది.

Sam C

No bio available for this author.

Google The Telugu News మీకు నచ్చిన సైటుగా ఎంచుకోండి
WhatsApp