నయనతార ప్రియుడితో సమంత.. మొత్తానికి మొదలెట్టేశారు!!
నయనతార ప్రియుడు విఘ్నేశ్ శివన్ ఓ కొత్త సినిమా ప్రారంభమైన సంగతి తెలిసిందే. ఆ మధ్య నయనతారతో నానూ రౌడీదానే (నేనూ రౌడీనే) అనే సినిమాతో పలకరించాడు. ఆ ఒక్క సినిమాతో నయన్‌ను ప్రేమలోకి దించేశాడు విఘ్నేశ్ శివన్. అలా అప్పటి నుంచి వీరి బంధం బలపడింది. ఇప్పటికీ కొనసాగుతూనే ఉంది. అయితే పెళ్లి మ్యాటర్ మాత్రం ఇంకా ముందుకు సాగడం లేదు. అదిగో ఇదిగో అంటూ పెళ్లి వార్తలపై ఏదో రకమైన పుకార్లు వస్తూనే ఉంటాయి.

ignesh shivan wlcomes Samantha Akkineni For kaathu vaakula rendu kaadhal
కానీ ఇప్పుడు వ్యవహారం చూస్తుంటే పెళ్లి అనేది దరిదాపుల్లో కూడా కనిపించడం లేదు. ప్రస్తుతం నయన్ తన సినిమాలతో బిజీగా ఉంది. విఘ్నేశ్ కూడా తన కొత్త ప్రాజెక్ట్ (కాతువకుల్ రెండు కాదల్) పనిలో పడ్డాడు. సౌత్ లేడీ సూపర్ స్టార్లను ఒకే దగ్గరకు చేర్చి సినిమాను ప్రారంభించాడు. ఈ మూవీలో నయన్, సమంతలు కలిసి నటిస్తున్నారు. ఇందులో విజయ్ సేతుపతి హీరోగా నటిస్తున్నాడు. మొత్తానికి నయన్, సామ్‌లను ఒకే ఫ్రేమ్‌లో చూపిస్తూ సినిమాపై హైప్ పెంచేందుకు మంచి ప్లాన్ వేశాడు.
అయితే ఈ మూవీకి సంబంధించిన షూటింగ్‌లో తాజాగా సమంత జాయిన్ అయింది. ఈ మేరకు సమంతకు మేకప్ వేస్తూ గ్రాండ్ ఎంట్రీ ఇచ్చారు. విఘ్నేశ్ స్పెషల్ బొకేను ఇస్తూ.. సినిమాలో పాలు పంచుకున్నందుకు థ్యాంక్స్ అంటూ తెలిపాడు. సమంత కూడా తమిళంలోనే సినిమా విశేషాలను చెప్పింది. ఇక నయన్‌తో కలిసి స్క్రీన్ పంచుకునేందుకు సమంత సిద్దమైంది. ఇక సమంత, నయన్‌లను ఒకే ఫ్రేమ్‌లో చూసేందుకు ఫ్యాన్స్ సంబరంగా ఎదురుచూస్తున్నారు.
View this post on Instagram