Vijay Devarakonda : రౌడీ హీరో తగ్గాడు.. విజయ్ దేవరకొండ నుంచి ఈ కామెంట్స్ ఊహించలేదే..! | The Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు

Vijay Devarakonda : రౌడీ హీరో తగ్గాడు.. విజయ్ దేవరకొండ నుంచి ఈ కామెంట్స్ ఊహించలేదే..!

 Authored By ramesh | The Telugu News | Updated on :12 October 2022,10:00 pm

Vijay Devarakonda : రౌడీ హీరో విజయ్ దేవరకొండ లైగర్ ఫ్లాప్ తో డీలా పడ్డాడు. పూరీ జగన్నాథ్ డైరక్షన్ లో తెరకెక్కిన లైగర్ సినిమా నేషనల్ వైడ్ గా భారీగా రిలీజైంది. ఆ సినిమాతో ఇండియాని షేక్ చేద్దామని అనుకున్న విజయ్ ఆశలు అడి ఆసలయ్యాయి. పూరీని నమ్ముకున్న విజయ్ కి డిజాస్టర్ ఖాతాలో పడ్డది. ఇన్నాళ్లు తన మీద తన సినిమాల మీఎద బీభత్సమైన కాన్ ఫిడెంట్ గా ఉండే విజయ్ లైగర్ ఫ్లాప్ అతన్ని కొద్దిగా తగ్గేలా చేసిందని చెప్పొచ్చు. మాములుగా తన సినిమా ప్రమోషనల్ ప్రెస్ మీట్ లో తన కామెంట్స్ తో టార్గెట్ అవబడే విజయ్ లైగర్ ఫ్లాప్ తర్వాత కొద్దిగా వెనక్కి తగ్గాడని అనిపిస్తుంది.

రీసెంట్ గా జరిగిన సైమా అవార్డ్ వేడుకల్లో పాల్గొన్న విజయ్ లైగర్ సినిమా గురించి ప్రస్థావించి అందరికి షాక్ ఇచ్చాడు. లైగర్ నిరాశపరచింది. ఆ సినిమాతో ఇండస్ట్రీ హిట్ ఇవ్వాలని అనుకున్నా.. అందుకోసం చాలా కష్టపడ్డాం.. కానీ ఫలితం వేరేలా వచ్చింది అంటూ విజయ్ లైగర్ గురించి చెప్పుకొచ్చాడు.విజయ్ ఖాతాలో లైగర్ హ్యాట్రిక్ ఫ్లాపులను మిగిల్చింది. డియర్ కామ్రేడ్, వరల్డ్ ఫేమస్ లవర్ సినిమాల లిస్ట్ లో లైగర్ కూడా చేరింది. ప్రస్తుతం విజయ్ ఖుషి సినిమా చేస్తున్నాడు. శివ నిర్వాణ డైరక్షన్ లో వస్తున్న ఈ సినిమాలో సమంత హీరోయిన్ గా నటించింది.

vijay devarakonda about liger flop siima awards

vijay devarakonda about liger flop siima awards

ఈ సినిమా విషయంలో విజయ్ దేవరకొండ చాలా జాగ్రత్తగా ఉన్నాడని తెలుస్తుంది. సమంతతో ఆల్రెడీ మహానటి సినిమాలో కలిసి నటించిన విజయ్ ఈ సినిమాలో మొత్తం రొమాన్స్ చేయనున్నారు. ఖుషి తర్వాత సుకుమార్ డైరక్షన్ లో విజయ్ సినిమా ఉంటుందని తెలుస్తుంది. అయితే లైగర్ హిట్ అయితే జన గణ మన చేయాలని అనుకున్నారు. ఆ సినిమా ఫ్లాప్ అవడంతో పూరీతో సినిమా లైట్ తీసుకున్నాడు విజయ్. విజయ్ కాదని చెప్పడంతో పూరీ మళ్లీ ఇస్మార్ట్ శంకర్ హీరో రామ్ తో మరో సినిమా ప్లాన్ చేస్తున్నాడట. బోయపాటి శ్రీను సినిమా తర్వాత రామ్ పూరీ కాంబో మూవీ ఉంటుందని టాక్.

ramesh

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది