Vijay Devarakonda : రష్మికతో లవ్.. ఆ టైం వచ్చినప్పుడు తెలుస్తుంది విజయ్ హింట్ ఇచ్చాడుగా..?
ప్రధానాంశాలు:
Vijay Devarakonda : రష్మికతో లవ్.. ఆ టైం వచ్చినప్పుడు తెలుస్తుంది విజయ్ హింట్ ఇచ్చాడుగా..?
Vijay Devarakonda : విజయ్ దేవరకొండ రష్మిక ఈ ఇద్దరు లవ్ స్టోరీ గురించి ప్రపంచం అంతా మాట్లాడుతుంది కానీ వాళ్లిద్దరు మాత్రం ఓపెన్ అవ్వరు. ఒకరి మీద ఒకరి ఇష్టాన్ని ఇన్ డైరెక్ట్ గా చూపిస్తూ ప్రదర్శిస్తూనే పైకి మాత్రం లేదు కాదు అని అంటుంటారు. మొన్న కాబోయే వాడు అన్నిటికీ సపోర్ట్ గా ఉండాలి.. బాధ్యతగా ఉండాలి.. ప్రేమించాలి అంటూ రష్మిక చెప్పింది. ఐతే ఇవన్నీ విజయ్ లోనే ఉన్నాయని నెటిజన్లు చర్చించడం మొదలు పెట్టారు.
ఐతే కొన్నాళ్లుగా మీడియాలో బర్నింగ్ టాపిక్ అవుతున్న విజయ్ రష్మిక లవ్ మ్యాటర్ గురించి విజయ్ దేవరకొండ స్పందించాడు. రష్మిక గురించి అన్నట్టుగా కాకుండా తన గురించి సోషల్ మీడియాలో జరుతుతున్న విషయాల పట్ల తనకు ఎలాంటి ఇబ్బంది లేదని ఐతే ఆ టైం వచ్చినప్పుడు తానే అన్ని చెబుతానని అన్నాడు విజయ్ దేవరకొండ. అంటే మీరు మీరు అనుకోవడం కాదు మేము ఎప్పుడు చెబుతామో మాకే తెలియదు అనేట్టుగా విజయ్ స్పందన ఉంది.
Vijay Devarakonda ఇద్దరు ఇంకాస్త టైం ఉంది..
విజయ్ దేవరకొండ రష్మిక ఇద్దరి ఆన్ స్క్రీన్ జోడీ అదిరిపోతుంది. ఆఫ్ స్క్రీన్ లో కూడా ఈ ఇద్దరు కలిసి డేటింగ్ చేస్తున్నారు అన్న టాక్ ఉంది. ఐతే ఈ విషయాలపై క్లారిటీ రావాల్సి ఉంది. కానీ అటు రష్మిక ఇటు విజయ్ ఇద్దరు ఇంకాస్త టైం ఉంది అంటూ చెప్పుకొస్తున్నారు. సో వీళ్ల ప్లాన్ చూస్తుంటే ఇద్దరు ఒకరోజు సడెన్ గా ఎంగేజ్మెంట్ తో కనిపించినా ఆశ్చర్యపోవాల్సిన పనిలేదని అనిపిస్తుంది.
విజయ్ దేవరకొండ రష్మిక ఇద్దరు పెళ్లాడితే ఆ ఇద్దరి ఫ్యాన్స్ కి సూఒపర్ జోష్ అందిస్తుంది. రష్మిక ఓ పక్క వరుస పాన్ ఇండియా సినిమాలతో అదరగొట్టేస్తుంది. విజయ్ కూడా ప్రస్తుతం 12వ సినిమాతో పాటు మరో రెండు సినిమాలు లైన్ లో పెట్టాడు. 2025 మార్చిలో విజయ్ గౌతం తిన్ననూరి కాంబో సినిమా రిలీజ్ ప్లాన్ చేశారు. రవికిరణ్ కోలా డైరెక్షన్ లో సినిమా కూడా నెక్స్ట్ ఇయర్ ఎండింగ్ కి రిలీజ్ ఉంటుందని తెలుస్తుంది. Vijay Devarakonda about rashmika mandanna Love , Vijay Devarakonda, Rashmika, VD12, Gowtham Tinnanuri, Tollywood