Vijay Devarakonda : ఎవడి మాట వినేది లేదు.. కొట్లాడుకుందాం అంటూ విజయ్ దేవరకొండ షాకింగ్ కామెంట్స్
Vijay Devarakonda : రౌడీ బాయ్ విజయ్ దేవరకొండ ప్రస్తుతం లైగర్ సినిమాతో బిజీగా ఉన్న విషయం తెలిసిందే. ఈ సినిమా ప్రమోషన్స్ జోరుగా సాగుతున్నాయి. ఆగస్ట్ 25న విడుదల కానున్న ఈ సినిమాకి సంబంధించి బాయ్‌కాట్ సెగ కూడా తగిలింది. కాని అవన్నీ పక్కన పెట్టి దూసుకుపోతున్నాడు విజయ్ దేవరకొండ. ఈ సినిమా తాజగా సెన్సార్‌ను పూర్తి చేసుకుంది. సెన్సార్ వాళ్లు దీనికి U/A సర్టిఫికెట్ ఇచ్చారు. అంతేకాదు ఈ సినిమా నిడివి కూడా కాస్తా తక్కువుగానే ఉంది. ఈ సినిమా రెండు గంటల 20 నిమిషాలు ఉండనుందని తెలుస్తోంది. అయితే సినిమాపై వస్తున్న రూమర్స్ పై విజయ్ దేవరకొండ స్పందించాడు.
Vijay Devarakonda : స్టన్నింగ్ కామెంట్స్
మా సినిమా కరోనాకి ముందు 2019లో మొదలైంది. అప్పటికి బాయ్ కాట్ బాలీవుడ్ లాంటివి లేవు. అవి మొదలయ్యే సరికి మేము మా షెడ్యూల్ కూడా మొదలుపెట్టేసాము. సినిమాని ప్యాన్ ఇండియా స్థాయికి తీసుకువెళ్లడానికి కరణ్ సర్ కంటే ఇంకొక ఆప్షన్ కనిపించలేదు. ఆయన బాహుబలిని ఇండియా మొత్తానికి తీసుకెళ్లారు. నార్త్ లో మనకి తెలియని ఒక కొత్త దారిని ఆయన మనకు చూపించారు. మన సినిమాని తీసుకుని వెళ్లి హిందీలో విడుదల చేయమని కోరగా ఆయన హృదయపూర్వకంగా మాకు స్వాగతం పలికారు. నేను ఇండియాలోనే పుట్టాను. నేను హైదరాబాద్ లో పుట్టాను. చార్మి పంజాబ్ లో పుట్టింది. పూరి సార్ నర్సీపట్నంలో పుట్టారు. మేము మూడేళ్లు కష్టపడి సినిమా చేశాము.
”ఏది ఎదురొచ్చినా కొట్లాడటమే. ఈ దేశం, ఈ ప్రజల కోసం ఏదైనా చేయడానికి సిద్ధం. కంప్యూటర్ ముందు కూర్చొని ట్వీట్లు కొట్టే బ్యాచ్ కాదు మేము. ఏదైనా జరిగితే ముందడుగు వేసేది మనమే. లాక్‌డౌన్ సమయంలో నేను మొదలు పెట్టిన ‘మిడిల్‌క్లాస్ ఫండ్’ కోసం ఎంతో మంది విరాళం ఇచ్చారు. అలాంటి వాళ్లు మనకు కావాలి. ఎవరో పైకి వెళ్తుంటే కాళ్లు పట్టుకుని కిందికి లాగే వాళ్లు మనకు వద్దు.. అందరి ప్రేమ ఉందని నేను అనుకుంటున్నా. అసలు ‘లైగర్’ కథేంటో తెలుసా? ఒక అమ్మ, తన బిడ్డను ఛాంపియన్ చేసి, జాతీయ పతాకాన్ని ఎగురవేయాలన్న కథతో సినిమా తీస్తే బాయ్‌కాట్ చేస్తారా. ఇలాంటి ఏమనాలో నాకే అర్థం కావటం లేదు” అంటూ విజయ్ అన్నారు.