Vijay Devarakonda : విజయ్ దేవరకొండ తల్లిని కూడా వదలడం లేదు.. నాటి వీడియోపై ట్రోలింగ్ | The Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు

Vijay Devarakonda : విజయ్ దేవరకొండ తల్లిని కూడా వదలడం లేదు.. నాటి వీడియోపై ట్రోలింగ్

 Authored By aruna | The Telugu News | Updated on :23 August 2022,6:40 pm

Vijay Devarakonda : విజయ్ దేవరకొండ మీద, అతని సినిమా మీద ఇప్పుడు రకరకాల వాదనలు తెర మీదకు వస్తున్నాయి. లైగర్ సినిమాను బాయ్ కాట్ చేసేందుకు ఏ చిన్న కారణాన్ని కూడా వదలడం లేదు. కరణ్ జోహర్ నిర్మాతగా ఉన్నాడని కొందరు, స్టార్ కిడ్ అనన్య పాండే నటిస్తుందని ఇంకొందరు, ఆమిర్ ఖాన్‌కు మద్దతుగా విజయ్ వ్యాఖ్యలు చేశాడని, పూరి జగన్నాథ్ సినిమాలోని సీన్లు ఆడవాళ్ల మీద వేదింపుల్లా ఉంటాయని మరి కొందరు ఇలా ఎన్నెన్నో కారణాలతో లైగర్ సినిమాను బాయ్ కాట్ చేయాలని పిలుపునిస్తున్నారు. ఈ బాయ్ కాట్ పిలుపుల వల్ల ఆమిర్ ఖాన్ లాల్ సింగ్ చడ్డా, అక్షయ్ కుమార్ రక్షా బంధన్ రెండు కూడా డిజాస్టర్లుగా మిగిలాయి.

ఆమిర్ ఖాన్ మీద ఉన్న నెగెటివిటీ లాల్ సింగ్ చడ్డాను నిండా ముంచేసింది. గతంలో ఇండియా మీద, దేవుళ్ల మీద ఆమిర్ ఖాన్ చేసిన కామెంట్లతో లాల్ సింగ్ చడ్డా మొత్తంగా డిజాస్ఠర్ అయింది. సినిమా విడుదలకు ముందు బాయ్ కాట్ ట్రెండ్ మరింతగా వైరల్ అయింది. ఇక ఇప్పుడు ఇదే భయం లైగర్ టీంను పట్టుకున్నట్టు కనిపిస్తోంది. అసలే కరణ్ జోహర్ అంటే నెటిజన్లకు అంతగా నచ్చదు. లైగర్ సినిమాకు కరణ్ జోహర్ నిర్మాతగా ఉండటంతో బాయ్ కాట్ చేయాలనే పిలుపు ట్రెండ్ అవుతోంది. అయితే ఈ ట్రెండ్‌ల మీద విజయ్ స్పందించాడు. ఈ బాయ్ కాట్‌లకు మనం ఎక్కువగా ప్రిపరెన్స్ ఇస్తున్నామేమో.. అవన్నీ సినిమాను ఏం చేయలేవు అని విజయ్ దేవరకొండ చెప్పుకొచ్చాడు.

Vijay Devarakonda Mothers gets Trolled and boycott liger Movie

Vijay Devarakonda Mothers gets Trolled and boycott liger Movie

ఎంతో కష్టపడి సినిమాను తీశాం.. ఓ తల్లి సెంటిమెంట్.. మన జెండాను ఎగరేసే సినిమాను తీస్తే మీరు బాయ్ కాట్ అని అంటున్నారు.. మీకేం చెప్పగలను.. సినిమా బాగుంటే ఎవ్వరూ ఆపలేరు అని విజయ్ ఎంతో ధీమావ్యక్తం చేశాడు. ఇక తాజాగా విజయ్ దేవరకొండ తల్లి గతంలో మాట్లాడిన మాటలు ఇప్పుడు తవ్వి తీస్తున్నారు. ఆ కారణం చూపించి బాయ్ కాట్ చేస్తున్నారు. మేం దొరలం.. మాకు గడీలున్నాయి.. ఇప్పటికీ మా ఊర్లో మమ్మల్ని దొరసానులు అని అంటారు.. అని గర్వంగా చెప్పిన మాటలు ఇప్పుడు తప్పుగా, యారగెంట్‌గా చూసి ఆమెను ట్రోల్ చేస్తున్నారు. అందుకే లైగర్‌ను బాయ్ కాట్ చేయండని పిలుపునిస్తున్నారు.

aruna

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది