Vijay devarakonda say about love marriage
Vijay Devarakonda : టాలీవుడ్ ఇండస్ట్రీలో రౌడీ స్టార్ విజయ్ దేవరకొండకు ఎటువంటి క్రేజ్ ఉందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ‘ అర్జున్ రెడ్డి ‘ సినిమాతో విపరీతమైన ఫ్యాన్ ఫాలోయింగ్ సంపాదించుకున్న విజయ్ దేవరకొండ వరుస సినిమాలు చేస్తూ బిజీగా గడుపుతున్నాడు. ప్రస్తుతం విజయ్ దేవరకొండ ‘ ఖుషి ‘ సినిమాలో నటిస్తున్నాడు. ఈ సినిమాని శివ నిర్వాణ దర్శకత్వం వహిస్తున్నారు. ఇక ఈ సినిమాలో హీరోయిన్గా సమంత నటిస్తున్న సంగతి తెలిసిందే. ఇటీవల విడుదలైన ఈ సినిమాలోని పాటలకు మంచి రెస్పాన్స్ వచ్చింది.
అలాగే రౌడీ స్టార్ అభిమానులకు ఈ సినిమాపై భారీ అంచనాలు నెలకొన్నాయి. లైగర్ సినిమా అట్టర్ ఫ్లాప్ కావడంతో ఇప్పుడు వచ్చే సినిమాపై విజయ్ దేవరకొండ హై ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకున్నాడు. మరి ఈ సినిమా ఎటువంటి రిజల్ట్ ఇస్తుందో చూడాలి. ఇదంతా పక్కన పెడితే విజయ్ దేవరకొండకు అమ్మాయిల ఫ్యాన్ ఫాలోయింగ్ ఎక్కువగా ఉంది. అయితే తాజాగా విజయ్ దేవరకొండ తన ప్రేమ పెళ్లి పై క్లారిటీ ఇచ్చారు. ఓ మీడియా ఛానల్ అడిగిన ప్రశ్నకి విజయ్ దేవరకొండ సమాధానమిస్తూ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.
Vijay devarakonda say about love marriage
లవ్ మ్యారేజ్ చేసుకుంటారా లేక అరేంజ్డ్ మ్యారేజ్ చేసుకుంటారా అని యాంకర్ అడగగా దానికి బదులుగా విజయ్ దేవరకొండ లవ్ లేదా అరేంజ్ రెండింటిలో ఏదో ఒకటి చేసుకోవాలి కదా. నాకు ఆల్రెడీ గర్ల్ ఫ్రెండ్స్ ఉన్నారు. కానీ మా పేరెంట్స్ ఏది డిసైడ్ చేస్తారో నేను అదే ఫాలో అవుతాను అని విజయ్ దేవరకొండ క్లారిటీ ఇచ్చారు. మొత్తానికి అయితే విజయ్ దేవరకొండ తన ఫ్యామిలీ చూసిన సంబంధాన్ని చేసుకుంటారని క్లారిటీ ఇచ్చారు. ప్రస్తుతం సోషల్ మీడియాలో విజయ్ దేవరకొండ చేసిన వ్యాఖ్యలు వైరల్ అవుతున్నాయి.
BC Youth Employment : ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు రాష్ట్ర ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందించేందుకు…
wife Killed Her Husband : నిర్మల్ జిల్లాలో దారుణమైన హత్య కేసు వెలుగులోకి వచ్చింది. 30 ఏళ్ల వివాహ…
డిల్లీ మెట్రోలో (Delhi Metro) తరచుగా జరిగే విచిత్ర సంఘటనల జాబితాలోకి మరో ఘటన చేరింది. ఇద్దరు మహిళలు సీటు…
Lord Vinayaka | తెలుగు రాష్ట్రాల్లో వినాయక చవితి ఉత్సవాలు శోభాయమానంగా కొనసాగుతున్నాయి. వీధి వీధి అంతా వినాయక మండపాలు,…
Vodafone | వోడాఫోన్-ఐడియా (Vi) తమ వినియోగదారుల కోసం అద్భుతమైన గేమ్ బేస్డ్ ప్రమోషనల్ ఆఫర్ను తీసుకువచ్చింది. అత్యుత్తమ ప్రయోజనాలతో…
Manchu Manoj | ఇటీవలే భైరవ సినిమాతో గ్రాండ్ రీ ఎంట్రీ ఇచ్చిన హీరో మంచు మనోజ్, సినిమాలతో పాటు…
Lord Ganesh | వినాయక చవితి వేడుకలు ఇంకా ప్రారంభం కాకముందే హైదరాబాద్లో అపశృతి చోటుచేసుకుంది. గణేష్ విగ్రహాన్ని మండపానికి తీసుకెళ్తుండగా…
Rains | రాష్ట్రంలోని పలు జిల్లాల్లో మంగళ, బుధవారాల్లో భారీ వర్షాలు (Heavy Rains) కురిసే అవకాశం ఉందని హైదరాబాద్…
This website uses cookies.