Vijay Deverakonda : విజయ్ దేవరకొండ పెళ్లి.. స్వయంగా రౌడీస్టార్‌ తల్లి చెప్పేసింది

Authored By Prahbas Gilakathula | The Telugu News | Updated on : 17 February 2023, 5:00 pm

Vijay Deverakonda : రౌడీ స్టార్ విజయ్ దేవరకొండ హీరోగా ఈ మధ్య కాలంలో సక్సెస్ కాలేక పోతున్నాడు. అర్జున్ రెడ్డి మరియు గీత గోవిందం సినిమాల తర్వాత ఇప్పటి వరకు విజయ్ దేవరకొండ ఏ ఒక్క సినిమాతో కూడా సక్సెస్ అవ్వలేదు. అయినా కూడా ఆయనకు ఉన్న క్రేజ్ ఏ మాత్రం తగ్గలేదు. గీత గోవిందం సినిమా సమయం నుండే విజయ్ దేవరకొండ మరియు రష్మిక మందన ప్రేమలో ఉన్నారనే ప్రచారం జరిగింది. ఆ సమయంలో ఇద్దరు కూడా ఆ వార్తలను కొట్టి పారేశారు.

Vijay Deverakonda marriage issue his mother react

Vijay Deverakonda marriage issue his mother react

తాజాగా ఇద్దరు ప్రేమలో ఉన్నారని దాదాపుగా కన్ఫామ్ అయ్యింది. ఇద్దరు కలిసి మాల్దీవ్స్ కి వెళ్లడంతో పాటు, విజయ్ దేవరకొండ కుటుంబ సభ్యులతో హాలిడే కి రష్మిక మందన పదే పదే వెళ్తోంది. ఈ నేపథ్యంలో అతి త్వరలోనే విజయ్ దేవరకొండ యొక్క కుటుంబంలో కోడలుగా రష్మిక మందన అడుగు పెట్టే అవకాశాలు ఉన్నాయంటూ జోరుగా ప్రచారం సాగుతోంది. తాజాగా విజయ్ దేవరకొండ తల్లి తన సన్నిహితుల వద్ద తన పెద్ద కొడుకు విజయ్ దేవరకొండ పెళ్లి చేయబోతున్నామని తెలియజేసిందట.

Vijay Deverakonda marriage issue his mother react

Vijay Deverakonda marriage issue his mother react

రష్మిక మందన మరియు విజయ్ దేవరకొండ ప్రేమించుకున్నారని, వారిద్దరికీ పెళ్లి చేస్తామని చెప్పారట. సోషల్ మీడియాలో ప్రస్తుతం ఈ విషయం వైరల్ అవుతుంది. గత కొంత కాలంగా జరుగుతున్న ఈ ప్రచారం ఆమె ప్రకటనతో క్లారిటీ ఇచ్చినట్లు అయింది. అన్ని వర్గాల వారిని ఆకట్టుకునే విధంగా విజయ్ దేవరకొండ మరియు రష్మిక మందన నటించిన చిత్రాలు ఉంటాయి.. కనుక వారి జోడి కూడా కచ్చితంగా అందరిని ఆకట్టుకుంటుందని ఇండస్ట్రీ వర్గాల వారు మాట్లాడుకుంటున్నారు.

Advertisement

Prahbas Gilakathula

Prabhas Gilakathula Content Writer experiened in Digital media field. Iam worked in various Telugu media for about 5 years. Worked in Namasthe Telangana, Telugu Rajyam , as a telugu content writer. I wrote various Latest Breaking News , politics, interesting stories, Andhr Pradesh & Telangana local news, health, technology, entertainment , Devotional, etc. He is also Social Media Expert, Technical Expert . He is present content writer of thetelugunews.com website. Contact details: Prabhas29nov@gmail.com

Google The Telugu News మీకు నచ్చిన సైటుగా ఎంచుకోండి